02 July 2011

how do you say you

రాత్రొక తెల్ల కాగితం

రెండు కళ్ళను అతికించి
చుట్టూతా వృత్తాలు గీసాను

అరచేతులని
నిప్పుని చేసి

వృత్తాలను కాల్చాను

మోకాళ్ళపై
ఒరిగిపోయి

నిన్ను స్మరించి
విస్మృతిని
అయ్యాను

ఇంతా చేసి

ఈ ఉదయాన

నీ ముఖాన్ని
కన్నాను-

ఇక నిన్ను

నువ్వని ఎలా
పిలవాలి?

No comments:

Post a Comment