04 July 2011

ఖాళీ గాలి

గాలి.
కళ్ళల్లో ఖాళీ గాలి

గాలి ఇచ్చిన ఖాళీలో
చిట్లిన పెదాల పాళి

చేయి, నిన్ను చరచిన
ఆ గుడ్డి చేయి

హృదయాన్ని నమిలి
తింటుంది ఇక్కడ.

నేను ఎక్కడ ఉన్నానో
నీకు తెలిస్తే

వచ్చి ఇన్ని పూలు
చల్లిపో

నలిగిపోయిన
పదసమాధిలో
దాగి ఉన్న

నివురుగప్పిన
నిప్పై నిద్రిస్తున్న

అతడి వద్ద=

1 comment:

  1. హృదయాన్ని మెలితిప్పే కవిత. బాగుందండి.

    ReplyDelete