నీకొక పదాన్ని ఇవ్వగలను
పూలు రాలే కాలంలో
పెదాలును మోదే
నిర్ధయ లోకంలోకి వెళ్ళే
మునుపు
తిరిగి వచ్చే, తిరిగి తిరిగి
వచ్చే ఆ అరచేతిని
ఆ తనువు వనాన్ని అందుకో:
ఇప్పటికి అది నువ్వు
తల దాచుకునే గూడు.
నువ్వు పలకగలిగే
ఒకే ఒక్క తెల్లటి పదం.
=మరోమారు ఆకాశంలోంచి
జలపాతం రాలే వేళయ్యింది.
పసి చేతులు పసి ఆకులు
ఎక్కడ దాగి ఉన్నాయో
వెదుకు
ఇక నువ్వు నిదురపోయే
రాత్రి ఆసన్నమయ్యింది=
No comments:
Post a Comment