ఇదొక దూరం, ఉన్నదీ
ఇదొకే దూరం
అందివ్వు విషపాత్రని
పద అందియలతో
రాలేదీ, రాలనిదానికీ
మధ్య అతడే ఎప్పుడూ
నలుపు నీటిపై తేలే
తెల్లటి చందమామ
ఎవరు వింటారు
అలల అలజడిని
నలుపు హృదయంలోని
తెల్లని శూన్యసవ్వడిని?
రాలుతోంది
ప్రమిదె కంటిలోకి
నీటినిప్పు
ఇక చీకటి పూలను
గుచ్చుతో
దారంతా
నీ నిశ్శబ్ధం.
ఇదొక్కటే దూరం
ఉన్నదీ ఇదే
ఈ దేహపు
దూరం:
ఏ పదాన్నీ
ఎప్పుడూ నమ్మకు=
No comments:
Post a Comment