16 July 2011

దర్పణ వదనం/ నా వైపు

రాకు నావైపు, రాలకు నావైపు

రాతి పద ముద్రలు
మాత్రమే ఉన్నాయి ఇక్కడ

నీ పిలుపునైనా
పంపించకు నావైపు

గుహలు, ఆదిమ గుహలు
మాత్రమే ఉన్నాయి ఇక్కడ

ప్రతిధ్వని ప్రతి ధ్వనిలో
కలసిపోయి

వంకీల అర్థాలతో వలయమై
పోతున్నాయి ఇక్కడ

వదనంపై దర్పణం, వదనంలో
దర్పణం, దర్పణ వదనం

తదేకంగా వదన దర్పణంతో
వాదనకు దిగింది ఇక్కడ=

రాకు అసలు ఇటు వైపు
ఆ వైపు, నా వైపు

చెమ్మగిల్లిన నయనమొకటి
నా చేతులతో

ఉరివేయబడింది ఇప్పుడే.

1 comment: