12 July 2011

పూలపాత్ర

ఉంచాను ఒక పుష్పాన్ని
నీకోసం పూలపాత్రలో

రాత్రి మాటల జలంతో
వికసితమైన పుష్పాన్నీ

వెన్నెల అశ్రువులతో
తడచిన సూర్యనయనాన్నీ

ఉంచాను నీకై
ఆ పూలపాత్రలో=

( వచ్చి చూడు ఇప్పటికైనా
వడలిపోయిన అతడి
వదనాన్ని. శిలువ వేయబడిన
అతడి పదాన్ని)

No comments:

Post a Comment