21 July 2011

ఎడబాటు ( మరీ ఒక/మరియొక/ పాతవాచకం)

జరిగిపోతున్నాం దూరంగా

ఇక మొదలవుతుంది ఒక
ఎడబాటు గీతం భారంగా

ఇక ఈ రాత్రికి నేను
నీ రక్తాన్ని వినలేను కాబట్టి

నిన్ను తలచి మదిని మలిచి
తల ఎత్తి అక్కడ

మేఘమాలికలు ముళ్లై
జాబిలిని చీరేస్తున్న చోట
రాలిపోతాను:

నువ్వు ఊహించినది సరి
అయినదే: మన

ఇద్దరి మధ్యా కాలిపోయినవి
తల దాచుకునేందుకూ

రెండు కళ్ళు కప్పుకుని
రోదించేందుకూ

స్థలమూ లేదు.
సమాధీ లేదు.

సరిగ్గానే ఊహించాను నేను

ఎడబాటు ఒక నలుపు గీతం:

విడిపోవడంతోనే
మొదలవుతుంది అది=

(విన్నావా నువ్వు
తెల్లటి దంతాలతో నవ్వుతోన్న
ఆ నలుగురి వికృత
ఆనందాన్ని?)

No comments:

Post a Comment