పిల్లలకీ స్త్రీలకీ?
నీ లోకం లేదిక
నీ లోకం నీ కాలం
లేదే లేదిక, రాదిక
గోడపై పిల్లలు గీసిన
రంగుల వంకర గీతల్లో
వాళ్ళు రాయని
పదం నువ్వు. ప్రేమించలేవ్
పిల్లలని. కామించలేవ్
కనీసం స్త్రీలని: కలలో మెరిసే
గోడపై పిల్లలు గీసిన
రంగుల వంకర గీతల్లో
వాళ్ళు రాయని
పదం నువ్వు. ప్రేమించలేవ్
పిల్లలని. కామించలేవ్
కనీసం స్త్రీలని: కలలో మెరిసే
వీధులలో, వీధులలో ఎదురుపడే
శిధిల ముఖాలలో, కళ్ళల్లో
తిరిగే మృతులకి కావాలి
నువ్వు, నీ నిశ్శబ్దాలు:
తిరిగే మృతులకి కావాలి
నువ్వు, నీ నిశ్శబ్దాలు:
అన్నీ ఉండి ఏమీ
లేదిక్కడ: వెదుకుతూ నిన్ను
వెంటాడే పిలుపులో
దాగిన స్మితవదనంఎవరిదో చెప్పు?
No comments:
Post a Comment