పూల వనాలకు
దారి కాదు ఇది
అంధకారం
ఇది అంధుల
నగరం
వెళ్ళిన పాదముద్రలే
కృష్ణ బిలంలోకి
ఎవరొచ్చారు తిరిగి
తిరిగి తిరిగి
చిగురాకు పదంతో?
రాలిపోయిన
కన్నీళ్ళే అన్నీ, నిన్ను
వొదిలివేసిన
చేతులే అన్నీ
అందరివీ-
చూడకు ఇటు=
నాలికొక ముద్రిత
నగరం
మొద్దుబారిపోయి
వల్లెవేస్తోంది, వెక్కిళ్ళు
పెడుతోంది
ఒక పసిపదం కోసం
రోదిస్తున్న అతడిని
కదిలించకండి
baagundi sreekanth...nagara jeevitham meeda inkaa raayavalasindi entha vundo naaku mallee gurthu chesindi ee padyam...
ReplyDeletesrikanthudu.!
ReplyDeletereally i am proud to have a poet friend like you..
wonderful poems..expressions..
kudos to u..
recent poems ur poems inspiring me..