రమ్మని అనకు ఎవరినీ
చిగురాకు విచ్చుకునే
సమయం
గర్భంలో, తన తనువులో
వెన్నెల విత్తనమై
చిట్లుతోంది
చూసావా ఆమె కళ్ళు?తనతో
తళుక్కుమంటూ
మిలమిలా మీనాలై ఎలా మెరిసి
లోకం వెంటా, కాలం వెంటా
సాగిపోతున్నాయో?
పూలతోట సౌరభం
తన శ్వాస నిండా
వనాలవాన తన
మాటలనిండా=
కదులు ఒక కత్తితో
తన కలని చీరే
వేళయ్యింది.
No comments:
Post a Comment