18 July 2011

ప్రశ్న

నీ కళ్ళల్లో వెన్నెల ఉందో
వెన్నెల్లో నీ కళ్ళు ఉన్నాయో
తెలిసేదెలా?

***

బిరబిరా తిరుగుతోంది
నీ చేతిలో హొయలు పోతోంది

నీ హృదయాన్ని
పుచ్చుకుని చేతిలోంచి జారి
దొర్లిపోతోంది. నవ్వుతో
నీ ముఖం పోర్లిపోతోంది

లోకం మొత్తం చిన్ని గోళీలో
విశ్వం మొత్తం
నీ చిన్ని హృదయంలో=

నిన్ను చూసే వానకు
కదిలిపోయే ఆకుకూ

తడినీ, పచ్చదనాన్నీ ఇచ్చింది
ఎవరో నీకు తెలుసా?

***

నీ కళ్ళలో నక్షత్రాలు ఉన్నాయో
నక్షత్రాలలో నీ కళ్ళు ఉన్నాయో
తెలిసేదెలా?

1 comment:

  1. nee aksharaallo aindrajalamundo indrajalame nee aksharalo telisedelaa sree.....lots of love j

    ReplyDelete