12 July 2011

ద్వేషం

ఎక్కడ నేర్చుకున్నావు ఇంత ద్వేషం?

వడలిపోయాయి పూలు నిన్ను తాకి. రాలిపోయాయి పక్షులు నిను కాంచి.
ఎండిపొయినాయి నయనాలలో సరస్సులు. ముక్కలైనాయి హృదయాలలో
దాచుకున్న నువ్విచ్చిన బొమ్మలు

పారిపోతున్నాను. నాలో నేనే మునిగిపోతున్నాను.

ఎవరు ఇచ్చారో చెప్పు నీకు ఇంత ద్వేషం
నువ్వు మరచిపోలేని బహుమతిగా?

No comments:

Post a Comment