పావురపు కళ్ళల్లో కదిలే
నీ ప్రపంచం
ఆ రెక్కలపైన ఎగిరే
సీతాకోకచిలుకవా నువ్వు?
తేలుతోంది గాలి
ఊగుతోన్న వానతో
మైమరుపుగా
అలలు, నురుగు నృత్యాల
కలలే నీ నవ్వులు
అరచేతుల ఆకులలో
పొదిగిన ముత్యాలు
ఆ నీటి చినుకులు
ఊగుతోంది ప్రపంచం
వలయమై, మోహితమై
నీ పాదాలతో
ఎక్కడ నేర్చుకున్నావ్
ఆకాశంతో ఆడుకునే
భూమితో పాడుకునే
ఈ మహత్తర విద్యను?
చూడు:నల్లటి మదితో
స్థాణువై నేను
నిన్ను ఎలా
చూస్తున్నానో!
No comments:
Post a Comment