05 May 2012

statutory warning

ఎవరైతే నీ కనులపై నుంచి
.. వేకువ కన్నీటి తెరలను తొలగించారో

ఎవరైతే నిన్ను దగ్గరగా హత్తుకుని
... రాతి మార్గాలలో నీకు పూలను పరిచారో

ఎవరైతే నీ పెదాలపై చిరునవ్వై
.......... వేళ్ళతో నీ చేత
పదాల తోటలను విరబూయించారో

ఎవరైతే నువ్వైయ్యారో
ఎవరిగా అయితే
నువ్వు మారావో

ఎవరి కోసం అయితే
నువ్వు శబ్ధాన్ని వీడి

నిశ్శబ్దపు ఎదురు చూపువి అయ్యావో

వాళ్ళే, వాళ్ళే

తనువుతోనో, కరుణతోనో
ఉంటూనో లేకుండానో

రహస్యంగానో బహిరంగంగానో
నిన్ను రాత్రుళ్ళుకూ గాలులకూ
ఉరివేస్తారు

నీ హృదయాన్ని చీల్చి, ప్రేమగా
నింపాదిగా నములుతారు-

స్నేహితుడా, కొద్దిగా జాగ్రత్త!

2 comments: