ఉగ్గ పట్టుకున్న కన్నీళ్ళతో గోడపై నీడలలో తనని తాను చూసుకుంటుంది ఒక అమ్మ
మధ్యాహ్నపు ఎండ
మధ్యాహ్నపు గాలి
మధ్యాహ్నపు శరీరపు రాతి తాకిడి, కమిలిన చెంపల వెచ్చటి ఆవిరి
దూరంగా పాప ఒక్కతే
నిశ్శబ్ధం అర్థం కాక, నిశ్శబ్ధం కాలేక ఇన్ని గిన్నెలని పోగేసుకుని ఆడుకుంటుంది
దాహమైన గొంతుకీ
ఆకలైన కడుపుకీ ఇంట్లో ఒక్కటే ఒక్క కుండ, తల్లి కుండ
బాల్కనీ లో మెలికలుగా అల్లుకున్న లత
ఇంటి వెనుకాల గూడు కట్టుకుందామన్న
....పావురాల అవిచ్చిన్న జీవితపు తపన, శ్రమ-
జాబిలిని మింగిన చీకటి బావిలో
ఎవరో ఒకరు రాలిపడే మృత వేళల్లో
అటు మరలిన ఒక అమ్మ ఇటు తిరిగి
చిత్తడైన మనస్సునీ చీకటయ్యిన శరీరాన్నీ
....నెత్తురింకిన కనులనీ తుడుచుకుని లేస్తుంది-
తనకి తెలుసు, తనకే తెలుసు
యిక ఒక పాత్రలో తననో, బియ్యాన్నో ఈ రాత్రినో వొండాలనీ
అన్నం పెట్టి, తన గర్భ సమాధిలో
పిల్లలని పదిలంగా దాచుకోవాలనీ-
నడిరోడ్లో
ReplyDeleteనడుము మీద చేతులేసుకొని,
నగ్నంగా నిలబడి,
నా కళ్లలోకి సూటిగా,
నవ్వుతూ చూస్తూ ,
నడిరాత్రంతా,
నా అక్షరాలను
పీకి పీకి
పందిరేసిన దెయ్యం వాడు,
ఆ నల్లపిర్రలవాడు.
మట్టి వాసన వాడు,
పూలహారమై,
అమ్మ మెడలో
పరిమళించే వాడు,
వీది వీదంతా,
వర్షమై కురిసేవాడు,
ఇల్లంతా రొచ్చుచేసి,
రచ్చచేసే వాడు,
నా వాడు కాని వాడు,
ఆ కలువ కన్నుల వాడు,
వాడు, నల్లపిర్రల వాడు.
ఆ కమ్మని పదాల వాడు,
నిరంతర శోధకుడు వాడు,
వాడు అని ఏడ(ఎక్కడ) వాడాలన్న,
దాని పేటెంట్ నాదేనంటూ,
కోపంతో వణికేవాడు,
నన్ను గేలి చేసేవాడు,
ఓ చిన్ని భూతం వాడు,
కవిత ఇంట దీపం వాడు,
కవిత్వానికే వెన్నల వాడు,
ఆ నల్ల పిర్రలవాడు,
నా వాడు కాని వాడు.
some lines from my "naakai" from "bhaskar" blog
plese read and put a comment.