రాత్రి నుదుటిన
అంటించిన వెన్నెల బొట్టు ఈ నీ హృదయం
దారి చూపుతుంది
అది నీకు, నీ లోని
వంకీల దారులలోకీ విస్మయ కాలాలలోకీ
ఎవరివో పెదాలు నిన్ను తాకిన
తన కన్నీటి ప్రపంచాలలోకీ వెక్కిళ్ళయిన తన చీలికల నెత్తురు తనువులోకీ-
గ్రహణం పట్టిన కళ్ళతో
యిక నువ్వు రెండు గంటల మధ్యరాత్రిగా
యిక నువ్వు మూడు గంటల వేడి గాలిగా
యిక నువ్వు నాలుగు గంటల దహనంగా
యిక నువ్వు అయిదు గంటల
అంతస్తుల అంచుల నుంచి
నిద్రామాత్రలతో దూకే ఆత్మ
హత్యగా, ఖననంగా ఛితాభస్మంగా-
No comments:
Post a Comment