నీ పిల్లలే
ధిక్కరిస్తారు నిన్ను అనంతంలోకి నెట్టి వేసే తమ చేతులతో
నువ్వొక
స్మృతని
నువ్వొక
గోడపై మిగిలే నిన్నటి చారికల ధూళి పటం అనీ తెలియదు నీకు
అప్పటిదాకా-
కళ్ళంత భారంతో
కళ్ళంత కన్నీటితో
ఆ వెన్నులో దిగిన
పిల్లల బాల్యపు పెదవులతో, చేష్టలతో అరచేతులతో
నీ చీకటింట శరీరం
యిక రాత్రిలో వొణుకుతోంది నువ్వు మోయలేని కాలపు స్పృహతో
వయో భారంతో-
ఇలాగేనా, నాన్నా
నువ్వూ నేనూ చచ్చిపోయేదీ ఒకరినొకరు వదిలి వెళ్లిపోయేదీ తిరిగి
ఎన్నటికీ కలవనిదీ?
మీ 'తవిక ' చూస్తుంటే నాకు చంటబ్బాయ్ సినిమా లోని ఒక సన్నివేశం గుర్తుకొచ్చింది. :) :)
ReplyDeleteJust take it lite. Just wanted to share here! :)
శ్రీలక్ష్మి పత్రికా ఎడిటర్ కి తన 'తవికలు ' చూపిస్తుంది. మచ్చుకు ఒకటి కింద.... :) :)
"కాల యముడు కిను
కలహించిన ఆ
శాంతన కిం
పుణ్య మూ
ర్తిని ...
....
...
ఆఫీసు కే పం
పాడు పాడు యముడు."
అప్పుడు ఆ ఎడిటర్ అంటాడూ... శ్రీలక్ష్మి తో...
చూడమ్మా... ఒక వాక్యాన్ని వరసగా రాయకుండా దానిని తెగ్గొట్టి, చిత్రవధ చేసి
"ఒక దాని కింద ఒకటి " రాస్తే దానిని కవిత అనరు.
అప్పుడు మన శ్రీలక్ష్మి ఆ కొత్త సాహితీ ప్రక్రియ కు 'తవిక ' అని పేరు పెడుతుంది.
మీ తవిక కూదా బాగుంది.