06 May 2012

అవిద్య

యింకా వొద్దు, యిక వొద్దు -

ఇంకొంత నొప్పి చాలు
యిక ఈ శరీరం తన తీరాన్ని దాటి తానే వొలికిపోతుంది
ఇన్నాళ్ళుగా ఒరిమిగా పట్టుకున్న పాత్ర
నెమ్మదిగా జారి త్రుటిలో పగిలిపోతుంది-

అప్పుడేనా? అంత తొందరగానా?
..భాస్కరుని భస్మం, చినుకుల హర్షం
...శీతల పవనం, వసంత రుతు జననం
.......నా చేతులతో కాలంలో మరి కొన్నిసార్లు
.....వెదజల్లనిదే, తనువంతా నింపుకోనిదే

అప్పుడే అంత తొందరగానా

అలా వెళ్ళిపోవడం? మరచిపోవడం?
ఇదిగో ఇపుడే చెబుతున్నా విను
ఈ కమిలిన లోకపు ప్రేమా రాహిత్యపు చారికల కళ్ళ సాక్షిగా -

ఈ అంతిమ దినాల
వృద్ధాప్యపు పుష్పం

మరికొంత కాలం బ్రతికే ఉంటుంది

నీ ద్వేషాన్ని
ప్రేమగా స్వీకరిస్తూనైనా
నీ నిర్ధయకై
తిరిగి నీ వద్దకు వస్తూనైనా-

ఒక పిల్లవాడిని ఆపడం
నీకైనా నాకైనా
ఎవరికైనా ఎలా సాధ్యం?

1 comment: