01 May 2012

ముసలి పసి తండ్రి

ఒస్తాడు అతను
కడసారి చూపుగా మారిన నేను బ్రతికి ఉన్నానో లేదో చూద్దామని

ఒక తండ్రి
దారుల భారంతో కాలం శోకంతో కమిలీ కమిలీ

ఒంటరిగా
వేసవి కాలం వేడిమి గాలితో, పున్నమి రాత్రుళ్ళతో
వడలిన పూల దినాలతో, స్మశానాలయిన బిడ్డలకై
ఒంటరిగా

అలసిన ఆ ముసలి పసి తండ్రి

చిరిగిన చిగురాకుల వంటి కళ్ళతో
పిల్లల్ని కని చేసుకున్న పాపంతో
జీవిత కాటిన్యపు మహా పుణ్యంతో-

ఎవరు చెబుతారు అతనికి
నేను జన్మించగానే అతను
మరణించాడని?

1 comment:

  1. అలసిన ఆ ముసలి పసి తండ్రి...కవిత చక్కగా వ్రాసారండి.

    ReplyDelete