19 May 2012

ఎలా?

నీ కన్ను తెగి నా కంటి అంచు నుంచి
రాలి పడుతుందొక నెత్తురు బొట్టు

తొలి వెలుతురు మసక గాజు పాత్రలో
మంచు పొగ వలె
అతని కన్నీళ్ళలో

అల్లుకుంటుంది
ఆ నెత్తురు నిప్పు-

యిక అతను, యిక అతనికే
తొలిసారిగా మలిసారిగా

గుర్తుకు వస్తుంది అమ్మ, అన్నీ
అయ్యి ఏమీ కాక, అన్నీ అయ్యి
ఏమీ లేక ఏమీ కాలేక కాలపు బిలంలోకి ఇంకిపోయిన అమ్మ-

చెప్పు కన్నా

ఎలా అంతమౌతుంది
తల్లి లేని తను లేని
ఈ దిగులు దేహం?

1 comment: