ఎవరూ లేక
శరీరమంతా హృదయమై, ఒక రాచపుండై సలుపుతోంది
పరిసరాల్లోనే
నువ్వు ఆపలేని ఒంటరితనం రక్తపిపాసియై
ఖడ్గ దంతాల వేట మృగమై నీకై పొంచి ఉంది-
యిక యిదే సరైన సమయం
యిక్కడ నుంచి నిష్క్రమించేందుకు
మధుశాలల్లో, నీ కన్నుల్లో
మత్తిల్లేందుకు నన్ను నేను మరచేందుకు
పూలల్లో దాగిన పచ్చిముళ్ళను
చేతి వేళ్ళ అంచున దింపుకుని
పొటమర్చిన ఆ నెత్తురు చుక్కలతో
ఈ పదాలను రాసేందుకు-
శరీరమంతా హృదయమై, ఒక రాచపుండై సలుపుతోంది
పరిసరాల్లోనే
నువ్వు ఆపలేని ఒంటరితనం రక్తపిపాసియై
ఖడ్గ దంతాల వేట మృగమై నీకై పొంచి ఉంది-
యిక యిదే సరైన సమయం
యిక్కడ నుంచి నిష్క్రమించేందుకు
మధుశాలల్లో, నీ కన్నుల్లో
మత్తిల్లేందుకు నన్ను నేను మరచేందుకు
పూలల్లో దాగిన పచ్చిముళ్ళను
చేతి వేళ్ళ అంచున దింపుకుని
పొటమర్చిన ఆ నెత్తురు చుక్కలతో
ఈ పదాలను రాసేందుకు-
ఫరీదా, యిక యింతకంటే
ఎక్కువ చెప్పడం నిషిద్ధం
ఎందుకంటే
ఈ సంబంధాలు
జీవితాంతం సపర్యలు చేసుకునే రోగులు అనీ
ఫిరోజ్ కి తెలిసింది ఇప్పుడే-
ఎక్కువ చెప్పడం నిషిద్ధం
ఎందుకంటే
ఈ హృదయమొక అంతం లేని తపన అనీ
ఈ జనులు తీరని ఒక మహా రుగ్మత అనీ
ఈ జనులు తీరని ఒక మహా రుగ్మత అనీ
ఈ సంబంధాలు
జీవితాంతం సపర్యలు చేసుకునే రోగులు అనీ
ఫిరోజ్ కి తెలిసింది ఇప్పుడే-
ఒకే భావాన్ని
ReplyDeleteఅన్నిసార్లు,
సూటిగా, స్పష్టంగా
గురితప్పకుండా
లక్ష్యాన్ని చేధించినట్లు
గుండెల్లో గుచ్చాలా !
ఫరీదా,
ఇలా అడిగినందుకు క్షమించు,
వీలైతే నన్నూకొంచెం ప్రేమించు,
కుదరకపోతే,
కనీసం, ఫిరోజ్ తో స్నేహించు.(స్నేహం చేయించు.)
నీకై......ఫరీదా,
ఇంతకంటే ఎక్కువ
నాకిక నిషిధ్దం.
Baavundi
ReplyDeleteబాగుంది!
ReplyDeleteఈ హృదయమొక అంతం లేని తపన అనీ
ఈ జనులు తీరని ఒక మహా రుగ్మత అనీ
"నీకై"...సిరీస్....ఊ చిన్న పుస్తకం గ వేయొచ్చు........గీతాంజలి ల.....నెరుడా..లవ్ పోఎమ్స్ ల........ఆలోచించు.....
ReplyDelete