17 May 2012

తారు హృదయాలు

రావాల్సిన వాళ్లు, నేను
............రావాలనుకున్న వాళ్ళూ
ఎవరైతే ఉన్నారో
.ఎవరైతే వెళ్ళారో

వాళ్ళైతే వచ్చారు కానీ
ఇన్నాళ్ళుగా పుల్ల పుల్లనూ
సన్నటి మల్లె కాడల ఇనుప
.............తీగలనూ తెచ్చుకుని అల్లుకుంటున్న
..ఆ పక్షుల గూడే మిగలలేదు
................ఈ నలు చదరపు గదుల అంతస్తులలో-

యిక పిల్లలే యిక కనిపించని
ఆ పావురాళ్ళ గుండ్రటి కళ్ళతో
బెంగగా బెదురుగా ఇనుప చట్రాలు అమర్చిన బాల్కొనీలోంచి

ముక్కలైన ఆకాశాన్నీ
నీడ లేని నీరెండ లేని
................................చిట చిట లాడే చితి వంటి తారు దారిని చూస్తో :

యిక ఏమని చెప్పను మీకు
ఈ నల్లటి పరదాల
దిగులు దేహం/దినం గురించి-?

2 comments:

  1. "...బెంగగా బెదురుగా ఇనుప చట్రాలు అమర్చిన బాల్కొనీలోంచి"
    hm...

    ReplyDelete
  2. తారు హృదయాల లేక తామర పరదాల?

    ReplyDelete