పరిగెత్తకు
పారిపోకు
ముఖాన్ని
దాచుకునేందుకు
---తప్పించుకోకు
నిలువెల్లా
భూమిలో నాటుకున్న చెట్లే తిరిగి
---పచ్చగా చిగురించగలవు
నిలువెల్లా వాడిన లతలే
తిరిగి పూలను
అందించగలవు
బీటలు వారిన భూమే
--వానలతో తడిచి
పచ్చటి పచ్చికతో
గాలిలో హాయిగా
అలా నవ్వగలదు
.......పరిగెత్తకు
.......పారిపోకు
..తప్పించుకోకు
కన్నీళ్లు లేని కళ్ళూ
గాయం లేని వొళ్ళూ
ఏదీ లేదు యిక్కడ-
ఒక మొక్క కంటే
ఒక చినుకు కంటే
మనం గొప్ప వాళ్ళమేమీ కాదు కానీ
అరచేతుల నిండా నిండిన
జీవన రక్తాన్ని
మనం కొంత
ఇచ్చి పుచ్చుకోవడంలో
...తప్పేముంది?
పాపమేముంది?
No comments:
Post a Comment