ఎంతో ప్రేమగా
ఎంతో ఆప్తంగా
ఎంతో ఘాడంగా ఎంతో పదిలంగా ఎంతో లాలిత్యంగా ఎంతో త్యాగంగా
ఎంతో అపురూపంగా
ఎంతో అమాయకంగా
ఎంతో శాంతిగా ఒక బహుమతిగా ఒక అబ్బురంగా ఎంతో ఆనందంగా
ఎంతో కోరికగా
ఎంతో నవ్వుగా
ఎంతో నువ్వుగా ఎంతో తనువుగా ఎంతో తను గా తానుగా అందరుగా
-ఎంతో ఓరిమిగా
ఎంతో సంగర్షణగా
ఎన్నో చేసుకున్న పుణ్యంగా పూర్వజన్మ సుకృతంగా సంపూర్ణంగా
గుండెల్లోకి హత్తుకుని
అలా అదుముకుని
పొదుపుకుంటావు కదా
పూలహారాల్లా పిల్లల్నీ
----మరి పిల్లలు ఇతరులై
తమకి తాము దూరమై
నీ కళ్ళనీ హృదయాన్నీ
కత్తులై కుమ్ముతుంటే ---
పిల్లలు గన్న తండ్రీ
పిల్లల్ని గని గర్భం
కోల్పోయిన తండ్రీ
పిల్లల్ని సాకీ సాకీ సాకీ
తనే లేకుండా నిండా
తన తనువే లేకుండా
అరిగిపోయిన
ఆరే పోయిన
విచ్చిన్నమైన నా
తండ్రీ తండ్రీ తండ్రీ
తల్లి లేక తల్లి కాక
ఏ తల్లి వద్ద తల దాచుకుంటావు
--ఏ తల్లి వద్ద పుత్ర శత్రువులను
తలుచుకుని రోదిస్తావు?-----
No comments:
Post a Comment