అప్పుడప్పుడూ ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుండేది.
ఇప్పుడైతే ప్రతి క్షణమూ నిర్దయగా చనిపోవాలనిపిస్తుంటుంది. దేహంలో ప్రవహించే నెత్తురులోనూ ఒక పరాయి హస్తమేదో ప్రవేశించి గిలకొడుతున్నట్టు ఒక్కటే బాధ. ఆత్మహత్యించుకోవాలన్నా ఆత్మ మిగల్లేదు. ఎవరో దారుణంగా నిరాదరణతో హత్య చేసారు. కంపోజ్ తో కలగలసి పడుకున్నా నిదుర పట్టదు. ఇంకా మిగిలి ఉంది ఒకే ఒక్క వేలియం 5. రాత్రి ఒంటి గంట దాటి పావుగంట వాంతి చేసుకున్న క్షణంలో నేనొక్కడనే దు:క్కిస్తూ ఉంటాను.
అసహనం. ఎవరిమీదో చెప్పలేనంత విషం. ప్రేమలూ సర్పాలూ కలగలసి అల్లుకున్న క్షణాలలో నేనొక్కడినే నా మీద వ్యక్తం చేయలేనంత అసహ్యంతో కన్నీళ్ళతో రాలిపడుతూ ఉంటాను. జీవితంపై అమిత విశ్వాసమూ ఒక గొప్ప నమ్మకమూ పటాపంచలై తాతయ్య పంచలై బయటపడ్డ మర్మాంగపు వెండ్రుకల్లా తేలిపోతాయి. తాతయ్యదెప్పుడూ ఒకటే బాధ.
నిరాదరణ. నిరాదరణ .
కీళ్ళ నొప్పులూ కళ్ళకు ఆన్ని చూపులూ విసర్జించడానికి కూర్చోడానికైనా మోకాళ్ళు వంగక, బిగుతు నవారు మంచం అతి కొద్దిగా వదులు చేసినట్టు కొద్దిగా వంగి మల మూత్రాల్ని విసర్జించే ఒక భయానక వృద్ధాప్యం ఎవరూ పట్టించు కోనితనం కలగలసి పేనిన తాతయ్య. తాతయ్యదెప్పుడూ ఒకటే బాధ.
ప్రేమారాహిత్యం. ప్రేమారాహిత్యం.
నోటిలోకి ఒక అన్నం ముద్ధకీ దేవులాడుకోవాలి. పదిసార్లు బ్రతిమిలాడుకోవాలి. గ్లాసు నీళ్లకూ అడుగడుగునా అసహ్యించు కోబడాలి. అప్పటికీ షుగర్ టెస్ట్ లు సొంతంగా పరీక్షా నాళికలో మూత్రాన్ని తెచ్చి మందు కలిపి వేడి చేసి, రంగు మారిందా లేదా, లేదా ఏ రంగు వచ్చిందో అని వొణికే చేతులతో ఎండిపోయిన పండిపోయిన హస్తాలతో ఆయనే చేసుకుంటాడనుకో, అయినా ఒకన్నం ముద్ద వేయాలంటే అందరికీ ఎక్కడ లేని బరువు -
అంత నరకమూ అంత వృద్ధాప్యపు నిరాదరణా నాకు ఆవహించినట్టు అనిపిస్తుంది. యవ్వనంలోంచే వ్రుద్ధ్యాప్యపు దశ మొదలయ్యినట్టుగా వుంటుంది. అదే స్థితి. కదల లేని కదలిక లేని తాతయ్య స్థితి నాలోకి హత్తుకు పోతుంది. చేతులు కదలవు, బలహీనంగా కంపిస్తుంటాయి. గుండెక్కడో డోక్కుపోయినట్టు చెక్కుకుపోయినట్టు పెచ్చులు పెచ్చులుగా పై చర్మం ఊడిపోయి నరాలు తెగిపోయి రక్తమింకిపోయి మిగిలిన ఆస్థిపంజరమొక్కటి పటాలున పేలిపోయినట్టు మూసుకున్న కళ్ళ చీకట్ల కింద వేదనేమిటో అర్థమౌతుంది. ఎండిన చర్మంపై పొడుచుకు వచ్చిన నరాల స్పర్సార్థమేమిటో బోధ పడుతుంది.
మనుషుల్ని అర్థం చేసుకోడానికైనా మనుషులు చేసే నమ్మక ద్రోహాలని ఓర్చుకోవాలనిపిస్తుంటుంది. ఏది అక్రమామో ఏది సక్రమమో ఏది నైతికమో ఏది అనైతికమో తేల్చుకోడానికైనా జీవించాలనిపిస్తుంది. ఇన్నేళ్ళు కలిసి బ్రతికి ఇన్నేళ్ళు కలిసి సుఖించీ దు:క్కించీ ఎక్కడో ఒక ముడి వీడిపోయి పూసల్లా మనం చెల్లా చెదురై పోయి ముఖాలు దాచుకుని సిగ్గుతో అవమానంతో తప్పుకుని తిరుగుతో ఒక ఘోర పాపం చేసినట్టు తలలు దించుకుని పారిపోతో
చీకట్లో చిక్కటి చామంతి మొక్కల మధ్యగా వికసించిన అస్పష్టపు తెల్లని పూవు. నీడల్లా ముడిపడిన దారాల్లా అల్లుకుపోయిన మల్లె తీగ మసక చిరునవ్వు. ఇంటికి పైగా వ్యాపించి ఆకాశ అంధకారంలోకి చేతులూపుతున్న వేపచెట్టు.
మబ్బు పట్టింది. వొక వర్షపు జల్లు మనస్సుని ఆహ్లాదం చేస్తుందా? ఇంత రాత్రి చుక్కలు కూడా లేని ఒక శారద రాత్రిపై కురిసే నాలుగు చినుకులు నన్ను ఆర్పుతాయా?
మనస్సిలాగే, మబ్బులాగే వేసవి కాలం వానకి ఎదురు చూసే మొక్కలలాగే తపిస్తూ, పరి పరి విధాల దు:క్కిస్తూ భరిస్తూ చేతులు చాచి నింగిలోకి, రాబోయే నీలాకాశంలోకి జారిపోతుంది

అప్పుడప్పుడూ బ్రతకాలనిపిస్తుంటుంది

ఎందుకిలా మన కల వికలమైపోయింది?
చీకట్లో చిక్కటి చామంతి మొక్కల మధ్యగా వికసించిన అస్పష్టపు తెల్లని పూవు. నీడల్లా ముడిపడిన దారాల్లా అల్లుకుపోయిన మల్లె తీగ మసక చిరునవ్వు. ఇంటికి పైగా వ్యాపించి ఆకాశ అంధకారంలోకి చేతులూపుతున్న వేపచెట్టు.
మబ్బు పట్టింది. వొక వర్షపు జల్లు మనస్సుని ఆహ్లాదం చేస్తుందా? ఇంత రాత్రి చుక్కలు కూడా లేని ఒక శారద రాత్రిపై కురిసే నాలుగు చినుకులు నన్ను ఆర్పుతాయా?
మనస్సిలాగే, మబ్బులాగే వేసవి కాలం వానకి ఎదురు చూసే మొక్కలలాగే తపిస్తూ, పరి పరి విధాల దు:క్కిస్తూ భరిస్తూ చేతులు చాచి నింగిలోకి, రాబోయే నీలాకాశంలోకి జారిపోతుంది
ఒక నిట్టూర్పుగా ధిగులుగా జాలిగా మోయలేనంత బరువుగా బాధగా-
No idea
ReplyDelete