ఎంతో ప్రేమగా
ఎంతో ఆప్తంగా
ఎంతో ఘాడంగా ఎంతో పదిలంగా ఎంతో లాలిత్యంగా ఎంతో త్యాగంగా
ఎంతో అపురూపంగా
ఎంతో అమాయకంగా
ఎంతో శాంతిగా ఒక బహుమతిగా ఒక అబ్బురంగా ఎంతో ఆనందంగా
ఎంతో కోరికగా
ఎంతో నవ్వుగా
ఎంతో నువ్వుగా ఎంతో తనువుగా ఎంతో తను గా తానుగా అందరుగా
-ఎంతో ఓరిమిగా
ఎంతో సంగర్షణగా
ఎన్నో చేసుకున్న పుణ్యంగా పూర్వజన్మ సుకృతంగా సంపూర్ణంగా
గుండెల్లోకి హత్తుకుని
అలా అదుముకుని
పొదుపుకుంటావు కదా
పూలహారాల్లా పిల్లల్నీ
----మరి పిల్లలు ఇతరులై
తమకి తాము దూరమై
నీ కళ్ళనీ హృదయాన్నీ
కత్తులై కుమ్ముతుంటే ---
పిల్లలు గన్న తండ్రీ
పిల్లల్ని గని గర్భం
కోల్పోయిన తండ్రీ
పిల్లల్ని సాకీ సాకీ సాకీ
తనే లేకుండా నిండా
తన తనువే లేకుండా
అరిగిపోయిన
ఆరే పోయిన
విచ్చిన్నమైన నా
తండ్రీ తండ్రీ తండ్రీ
తల్లి లేక తల్లి కాక
ఏ తల్లి వద్ద తల దాచుకుంటావు
--ఏ తల్లి వద్ద పుత్ర శత్రువులను
తలుచుకుని రోదిస్తావు?-----
31 May 2012
దిగులు చెందకు
ఈ మహా నగరం
ఒక మృతపాత్రతో
నుదుటిన లోహపు భస్మపు తిలకంతో తిరుగాడే ఒక అందమైన కంకాళం-
ఆహ్
....యిక మనం
నీళ్ళు అర్ధించిన
ఇళ్ళ ముందు నుంచి
పగిలిన పెదాలతో
ఎండిన శరీరాలతో
--వెనుదిరిగి
వెళ్ళిపోవచ్చు--
దిగులు చెందకు
దాహార్తులై, ఆర్తియై
చనిపోయిన వాళ్లకి
ఈ లోకంలో
కొదవలేదు-

తప్పేముంది
పరిగెత్తకు
పారిపోకు
ముఖాన్ని
దాచుకునేందుకు
---తప్పించుకోకు
నిలువెల్లా
భూమిలో నాటుకున్న చెట్లే తిరిగి
---పచ్చగా చిగురించగలవు
నిలువెల్లా వాడిన లతలే
తిరిగి పూలను
అందించగలవు
బీటలు వారిన భూమే
--వానలతో తడిచి
పచ్చటి పచ్చికతో
గాలిలో హాయిగా
అలా నవ్వగలదు
.......పరిగెత్తకు
.......పారిపోకు
..తప్పించుకోకు
కన్నీళ్లు లేని కళ్ళూ
గాయం లేని వొళ్ళూ
ఏదీ లేదు యిక్కడ-
ఒక మొక్క కంటే
ఒక చినుకు కంటే
మనం గొప్ప వాళ్ళమేమీ కాదు కానీ
అరచేతుల నిండా నిండిన
జీవన రక్తాన్ని
మనం కొంత
ఇచ్చి పుచ్చుకోవడంలో
...తప్పేముంది?
పాపమేముంది?
పారిపోకు
ముఖాన్ని
దాచుకునేందుకు
---తప్పించుకోకు
నిలువెల్లా
భూమిలో నాటుకున్న చెట్లే తిరిగి
---పచ్చగా చిగురించగలవు
నిలువెల్లా వాడిన లతలే
తిరిగి పూలను
అందించగలవు
బీటలు వారిన భూమే
--వానలతో తడిచి
పచ్చటి పచ్చికతో
గాలిలో హాయిగా
అలా నవ్వగలదు
.......పరిగెత్తకు
.......పారిపోకు
..తప్పించుకోకు
కన్నీళ్లు లేని కళ్ళూ
గాయం లేని వొళ్ళూ
ఏదీ లేదు యిక్కడ-
ఒక మొక్క కంటే
ఒక చినుకు కంటే
మనం గొప్ప వాళ్ళమేమీ కాదు కానీ
అరచేతుల నిండా నిండిన
జీవన రక్తాన్ని
మనం కొంత
ఇచ్చి పుచ్చుకోవడంలో
...తప్పేముంది?
పాపమేముంది?
30 May 2012
అలసి వచ్చిన
అలసి వచ్చి
ముఖాన చెమటని తుడుచుకుని
----గూటిలో దీపం వెలిగించుకుని
రాత్రిలో ఒక్కడే
బియ్యంలో వేపాకులు ఏరుకుని
--ఇంత అన్నం వొండుకుంటాడు
అతను: ఏదో ఆలోచనలో
-స్నానానికై తెచ్చుకున్న
తువ్వాలుని తలకు చుట్టుకుని
మట్టి కుండలోని నీళ్ళు
-కడుపు నిండుగా తాగి
మంచంపై ఒరిగిపోతాడు
అలాగే అతను: యిక నేను
ప్రత్యేకంగా చెప్పాలా మీకు
-----శరీరాన్ని తుడుచుకున్న
గరుకైన ఆ ఎండిన తువ్వాలూ
ఏరుకుని వొండుకున్న అన్నమూ
హృదయం నిండుగా తాగిన నీళ్ళూ
మెత్త లేని మంచమూ
అలసి ఆరిన దీపమూ
దయ లేని నిదురా
ముళ్ళ మెలుకువా
అంతా అన్నిటా
-----ఆమే అని?
ముఖాన చెమటని తుడుచుకుని
----గూటిలో దీపం వెలిగించుకుని
రాత్రిలో ఒక్కడే
బియ్యంలో వేపాకులు ఏరుకుని
--ఇంత అన్నం వొండుకుంటాడు
అతను: ఏదో ఆలోచనలో
-స్నానానికై తెచ్చుకున్న
తువ్వాలుని తలకు చుట్టుకుని
మట్టి కుండలోని నీళ్ళు
-కడుపు నిండుగా తాగి
మంచంపై ఒరిగిపోతాడు
అలాగే అతను: యిక నేను
ప్రత్యేకంగా చెప్పాలా మీకు
-----శరీరాన్ని తుడుచుకున్న
గరుకైన ఆ ఎండిన తువ్వాలూ
ఏరుకుని వొండుకున్న అన్నమూ
హృదయం నిండుగా తాగిన నీళ్ళూ
మెత్త లేని మంచమూ
అలసి ఆరిన దీపమూ
దయ లేని నిదురా
ముళ్ళ మెలుకువా
అంతా అన్నిటా
-----ఆమే అని?
29 May 2012
కోత
...నిన్నటి ఈ రాత్రిలో
ఆ వాగు మలుపులో
పచ్చిగడ్డి నీళ్ళ అంచులలో వంకీలు తిరిగిన చందమామ
-పగటి కాటులో
చతురస్రంగా తెగి
ఆకాశపు ఇనుప చువ్వలకు పైగా వడలి
మెలికలుగా రాలిపోయిన ఒక తనూ లత
- రెండు గంటల
రెండు బాకులు
శిరస్సున దిగబడి
నలుచదరపు అంతస్తుల ముందుగా
కాలంతో స్పృహ తప్పిన
అంతిమ చరణాల ఒక ఆదిమ అమ్మ
గుండెలో కోత
గర్భంలో కోత
ప్రేమ ఊచకోత
ఎదురుచూపు
నిండిన కళ్ళలో ఎంతకూ ఎదురు రాని
రెండు కనుల
రంపపు కోత -
-చేయగలిగినది
ఏమీ లేదు యిక
నీ శరీరపు పాత్ర నిండా
--నీళ్ళు ముంచుకుని
నలుగురికీ పంచేందుకు
మొండి నవ్వుతో
నువ్వు వెళ్ళడం
-------------తప్ప

చీమతో చిన్నవాడు
తన రెండు చేతి వేళ్ళని
రెండు చక్రాల్లా కదుపుతో
ఆ నేలపై పాకే
చీమ వెనుకగా
పరిగెడతాడు పసివాడు తన లేత చేతివేళ్ళతో-
తన కళ్ళంతా రంగులు
తన వొళ్ళంతా
ఆ మెరుపులు
తెరుచుకున్న తన
సున్నా నోటి నుంచి
నేలపై రాలే లాలాజలపు జల్లులూ విశ్వ గీతాలూ -
చీమ వెనుకగా కాసేపు
చీమ పక్కగా కాసేపు
చీమ ముందుగా ఆగి
నేలపై పడుకుని చుబుకాన్ని తన ముంజేతులపై ఆన్చుకుని
దాని ప్రపంచాల్ని విప్పారిన కనులతో చూసుకుంటూ కాసేపు-
-ఏం చెప్పను యిక
-తమ లోకాలని చంపుకోక
ఇష్టంగా కాలాన్ని గడపటం
అలా ఆడుకోవడం
--పిల్లలకే తెలుసు!

కవీ
పాపం ఎంతో ప్రయత్నం
ఏదో రాద్దామనీ, ఎవరినో తలదన్నుదామనీ ఎవరినో ఓడిద్దామనీ -
పొద్దున్నే స్నానం చేయించి
దుస్తులు వేసి, పాపిడి తీసి
చక్కగా తల దువ్వి శింగారించి బయటకి పంపిద్దామనుకుంటావే నీ పదాల్ని పిల్లల్లా
మరచిపోయావా నువ్వు
నెత్తి నిండా దుమ్ము పోసుకుని దుస్తుల్ని చించుకుని ఎండల్లో వానల్లో నీడల్లో దారుల్లో
-జుత్తు చెరుపుకుని
నిండా ఇకిలింతలతో
తోటి పిల్లలని నాలికలతో వెక్కిరించడమే పిల్లలకీ పదాలకీ ఇష్టమని?
కవీ ఇంతా చేసి నువ్
ఉదయాన్నే వేప పుల్లతో నోరు శుభ్రం చేసుకోవడం మరచిపోయావ్ కానీ
-యిక నీకూ నాకూ, తనకూ
రాస్తూ ఎండిన నీ ముఖానికీ
అద్దంలో అలసిన
--నా ముఖానికీ
ఏదీ జగతి? ఏదీ గతి?

వానా కాలం
ఆకాశం మబ్బు పట్టి
ఆ పిల్లల ముఖాల్లో
చల్లటి గాలీ తుంపర
కళ్ళ నిండుగా
మెరూస్తూన్న
స్కూలు లేని
ఇకిలింతా, దోబూచులాటా -
యిక నీకు తెలుసు
ఈ వానా కాలం
ఎలా ఉండబోతుందో!
ఆ పిల్లల ముఖాల్లో
చల్లటి గాలీ తుంపర
కళ్ళ నిండుగా
మెరూస్తూన్న
స్కూలు లేని
ఇకిలింతా, దోబూచులాటా -
యిక నీకు తెలుసు
ఈ వానా కాలం
ఎలా ఉండబోతుందో!
28 May 2012
గూడు
పావురం పిల్లలు
బయటకి వచ్చాయా నాన్నా? అని అడుగుతారు
రోజంతా ఎదురుచూసే పిల్లలు
చిట్టి పావురాళ్ళని చూద్దామని-
అయితే
అప్పుడే బయటకి వస్తుంటావు నువ్వు
నేలపై గూటి కింద రాలిపడిన
ఆ పావురాళ్ళ చితికిన గుడ్లని
ఒక బట్టతో శుభ్రం చేసీ నీళ్ళతో తుడిచీ-
యిక దూరంగా
ఆ రాతి రాత్రంతా
ఆకాశమంతా గదంతా పావురాళ్ళు చేసే బ్లుర్ బ్లురుర్ మనే ఎక్కిళ్ల శబ్దాలు
యిక ఎలా నిదుర పోతారు
యిక ఎలా నిదురపోగలరు
రెక్కలు ఆ విరిగిన పిల్లలు?

తను అడిగినది
తల్పమొక
నిన్ను చుట్టుకునే ఒక వంకీల త్రాచు అయిన నాడు
శరీరమొక
నిన్ను తలచుకునే ఒక పచ్చి పుండు అయిన నాడు
పగలూ
రాత్రీ, నిన్ను వేటాడే క్రూర మృగాలు అయిన నాడు
అద్దంలో
నీ ముఖం ఒక పుర్రెలా ప్రతిబింబించిన నాడు
మనుషులు
కదిలే సమాధుల వలె నీకు తోచిన నాడు, ఆనాడు
నువ్వేం చేస్తావు? నువ్వెలా నిదురోతావు?

యిక్కడ
ఇదొక
నల్లటి నిశ్శబ్ధపు వలయం
మధ్యలో
మధ్యగా రాలిన ఆ
చినుకే నీ వదనం-
యిక ఆ రావిచెట్లు
కొద్దిగా కదిలి అలా
కమ్మనైన గాలి వీచింది యిక్కడ
నల్లటి నిశ్శబ్ధపు వలయం
మధ్యలో
మధ్యగా రాలిన ఆ
చినుకే నీ వదనం-
యిక ఆ రావిచెట్లు
కొద్దిగా కదిలి అలా
కమ్మనైన గాలి వీచింది యిక్కడ
?
వేళ్ళ మధ్య ఆగిన చురికకీ
యింకా తెగని మణి కట్టుకీ
యింకా తెగని మణి కట్టుకీ
మధ్యన ఉన్న
ఎదురు చూసే
ఎదురు చూసే
ఆ దూరం .....................................ఎంత దూరం?
27 May 2012
తేలికగా
తేలికైన రాత్రిలో
నా తేలికైన తనువుపై వాలిన తేలికైన సీతాకోకచిలుకవు నువ్వు
ఇలాగే ఉంటుందేమో
తేలికగా ఒక పుష్పం
తేలికైన నీ నిశ్శబ్దంలో
తేలికైన ఆ గాలిలో
తేలికైన మంచులో
అలా హాయిగా, తేలికగా
నీలా వికసించినప్పుడు-
దిగులు చెందకు
బ్రతికి ఉండటమే
ఇవాళ మనం సాధించిన ఒక తేలికైన విజయం-

అనామిక
రాత్రి నుదుటిన
అంటించిన వెన్నెల బొట్టు ఈ నీ హృదయం
దారి చూపుతుంది
అది నీకు, నీ లోని
వంకీల దారులలోకీ విస్మయ కాలాలలోకీ
ఎవరివో పెదాలు నిన్ను తాకిన
తన కన్నీటి ప్రపంచాలలోకీ వెక్కిళ్ళయిన తన చీలికల నెత్తురు తనువులోకీ-
గ్రహణం పట్టిన కళ్ళతో
యిక నువ్వు రెండు గంటల మధ్యరాత్రిగా
యిక నువ్వు మూడు గంటల వేడి గాలిగా
యిక నువ్వు నాలుగు గంటల దహనంగా
యిక నువ్వు అయిదు గంటల
అంతస్తుల అంచుల నుంచి
నిద్రామాత్రలతో దూకే ఆత్మ
హత్యగా, ఖననంగా ఛితాభస్మంగా-

నొప్పి
గర్భం
నీ దానిది, నీ ఒక్క దానిది మాత్రమే కాదు
యిక్కడ నా
శరీరం చీలికలై నా నెత్తురు అంటు కట్టుకున్న పిండమై విలపిస్తోంది
ఎవరు చెప్పారు నీకు
నీ గర్భం ఉత్పత్తి సాధనమైనంత మాత్రాన, పురుషులకి గర్భం లేదనీ
గర్భ శోకం, గర్భ పాపం పుణ్యం
గర్భ విచ్చినతా, గర్భ కాందిశీకులూ
అగర్భ బహిష్క్రుతులూ
పురుషులకి ఉండరనీ?
ఇటు చూడు
ఒక మగవాడి
పుత్ర పిత్రు విలాపం
తొమ్మిది నెలలు లేకుండా చచ్చిపోయింది యిక్కడ-

26 May 2012
అమ్మ పదాలు*
నువ్వు బాధను అనుభూతి చెంధగాలవా? ఆమె పాదం మోపినప్పుడు, గుమ్మంలోంచి బరువుగా, మరో పరిమళం లేని పోనీ మరో మొగ్గైనా లేని బాధాపూరిత వెలుగులోకి ఆమె పాదం మోపినప్పుడు, ఆమె పాదాల కింది మట్టి ఆమె బాధతో మరి కొద్దిగా కుంగుతుంది. పగలేనా? రాత్రీ కావొచ్చు, నిర్లిప్తంగా ఆమె తిరిగి వచ్చినప్పుడు, లేదా సాయంత్రం మంచానికి చేరగిలబడి కుచ్చిళ్ళను మోకాళ్ళ దాకా జారుపుకుని ఆమె నిర్లిప్తంగా రెండు చేతి వేళ్ళతో పాదాలని రుద్దుకుంటున్నప్పుడు ఆ నొప్పెమైనా మందగిస్తుందేమోనని, పసుపు పచ్చటి చేతివేళ్ళతో ఒకప్పుడు కాళ్ళ మధ్య శిశువును మృదువుగా రుద్దుతూ స్నానం చేయించినట్టు పాదాల్ని వేళ్ళ కొసలతో నొక్కి పట్టుకుంటున్నప్పుడు, నేనా బాధను అనుభూతి చెందగలనా?
నీకు తెలుసు. ప్రేమించకుండా ద్వేషించకుండా బ్రతకడం - ప్రేమా లేదు, ద్వేషమూ లేదు. వొద్దనుకున్నా, గిల గిలా కొట్టుకుని బయటకు వచ్చినా వెంటనే బలంగా లోపలి లాక్కునే బాధ. ఈ దేహం. దేహంలోని రక్తం, రక్తాన్ని అంటి పెట్టుకుని ఉండే కలలూ, కలల అంచున కరగకుండా గడ్డ కట్టుకుని ఉన్న కన్నీళ్ళూ, ఒక నిర్లిప్తపు నిశ్చల చెట్ల గుంపుల నీడల మధ్యకు నెట్టివేసే ఈ జీవితం నీకు తెలుసు.
కొన్నిసార్లు, కొన్ని క్షణాలలో ఈ దేహం జ్వలిస్తుంది. చీకట్లో గాలికి రగులుకునే మంటలానూ ఆకాశానికి ఎగిసిపడే అగ్ని పుష్పం లోని వివిధ రంగుల రేకుల గానూ ఒకే ఒక్క క్షణంలో ప్రేమా, ఉద్రేకమూ శాంతీ కూడానూ. కొన్నిసార్లు, ఈ వేళ్ళ కొసల అంచున వెన్నెల అలలని ప్రవహింప జేయవచ్చు. ఈ కనులతో సూర్యరశ్మిని మృదువుగా, వేకువఝామున గూళ్ళ లోంచి రెక్కలు విదిల్చి ఎగిరిన పక్షుల లానూ మృదు ఘాడంగా విప్పార్చవచ్చు. కొన్నిసార్లు, ఒకే క్షణంలో ఈ దేహం నిండుగా తొణికిసలాడే, ముట్టుకుంటే ఒలికిపోయేటట్టు ఉండే ప్రేమా, ఉద్వేగామూ శాంతీ కూడానూ. చేయి చాచి దేహాన్ని స్పర్శిస్తే, వేళ్ళకు అంటుకుని తిరిగి స్పర్శించే దాకా అంటి పెట్టుకుని ఉండే వాసన లేని పరిమళ మొకటి. ఆమె స్పర్శించినప్పుడు స్పర్సలో కదులాడే అధ్రుస్యపు జల ధార ఒకటి.
నేను కదులుతాను
నా శరీరం చుట్టూ ఉన్న నిశ్శబ్ద దు:క్కంతో ఆమె పరిధిలోకి నడుస్తాను. ఆమె చేతి వేళ్ళలోకి ఇమిడిపోయి ఆమె చేతి వేళ్ళతో పాటు నొప్పితో కలుక్కుమంటున్న పాదంపై కదులుతాను. సాయం సామయపు సూర్యుడు విచ్చుకున్న ఒక మేఘపు ఖడ్గంతో తునకలైనట్టు, ఆమె సంధ్యా సమయం పాదంపై ఆమె చేతి వేళ్ళ మేఘ మాలికలతో పాటు అల్లుకుపోతాను. ఆమె పాదం మోపినప్పుడు, గుమ్మంలోంచి భారంగా, ఎటువంటి ఉద్వేగామూ లేని, పోనీ కనుల చలనమైనా లేని బాధాపూరితమైన పగటి లోకి ఆమె పాదం మోపినప్పుడు ఆమె పాదాల కింద రహస్యంగా ప్రయాణిస్తాను. ఆ పాదాల దు:క్కాన్ని నా శరీరంతో మోస్తాను. పగలు, లేదా రాత్రి, నిర్లిప్తంగా ఆమె తిరిగి వచ్చినప్పుడు లేదా మార్గ మధ్యంలో ముఖం ముకుళితమయ్యి ఆగిపోయినప్పుడు, ఆమెనూ ఆమె రెండు పాదాలనూ భుజంపై అమర్చుకుంటాను. తల్లీ, నేను మార్పు చేయగల క్షణమేదైనా వస్తే, నా జీవితాన్ని నీ రెండు పాదాల కింద పరుస్తాను. నువ్వు నడిచినంత మేరా భూమిపై తేలే ఒక పక్షి ఈకనై నిన్ను ఇంటికి మోసుకు వస్తాను. ఇదొక వాంఛ.
ఆగిపోని వేదన ఇది. దయ, పోనీ కరుణ అయినా లేని ప్రేమించానూ లేని ద్వేషించనూ లేని, వొట్టి దు:క్కం మాత్రమే దేహంలో కొట్టుకులాడే స్థితి ఇది. ఈ నిర్లిప్త సమయాలలో నీతో పాటు జన్మించిన పదాలు ఇవీ. కాదు, నువ్వు పేగు తెంచి ఇచ్చిన అక్షారాలు ఇవి. సంధ్యా సమయంలో గూటికి చేరుకునే పక్షుల్లా, ఎక్కడెక్కడో తిరిగి ఆత్రుతగా నీ వద్దకు తిరిగి వచ్చే పదాలు ఇవి. బహుశా, సాయంకాలం బేబీ కేర్ సెంటర్ ల వద్దకు పరుగెత్తే తల్లుల హృదాలు ఇవీ. నువ్విచ్చిన రక్తంతో నువ్వే అయిన ఈ పదాలు నా వద్ద తాత్కాలికంగా తార్లాడి నీ వద్దకి తిరిగి వస్తాయి. అవిశ్రాంత దీర్ఘ పగటి ఎదురు చూపుల తరువాత తల్లి ముఖం కనిపిస్తే, ముఖాలు వికసించి నిర్బంధంలోంచి ఆ కౌగిలి వైపు ఆ గోరువెచ్చని దేహం వైపూ శక్తినంతా కూడగట్టుకుని వేగంగా, తడబడే అడుగులతో పరిగెత్తే పసి పిల్లలు ఇవీ. వాటిని, నా శరీరాన్ని రెండు అరచేతులుగా మార్చి నీకు ఇస్తున్నాను. తీసుకో. నీకు తెలుసు, ఇంత కంటే ఇంతకు మించీ నీకు ఇవ్వగలిగినదేదీ నా వద్ద లేదనీ, ఉండదనీ-

ఇప్పటిలాంటి అప్పటి స్థితి*
అప్పుడప్పుడూ ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుండేది.
ఇప్పుడైతే ప్రతి క్షణమూ నిర్దయగా చనిపోవాలనిపిస్తుంటుంది. దేహంలో ప్రవహించే నెత్తురులోనూ ఒక పరాయి హస్తమేదో ప్రవేశించి గిలకొడుతున్నట్టు ఒక్కటే బాధ. ఆత్మహత్యించుకోవాలన్నా ఆత్మ మిగల్లేదు. ఎవరో దారుణంగా నిరాదరణతో హత్య చేసారు. కంపోజ్ తో కలగలసి పడుకున్నా నిదుర పట్టదు. ఇంకా మిగిలి ఉంది ఒకే ఒక్క వేలియం 5. రాత్రి ఒంటి గంట దాటి పావుగంట వాంతి చేసుకున్న క్షణంలో నేనొక్కడనే దు:క్కిస్తూ ఉంటాను.
అసహనం. ఎవరిమీదో చెప్పలేనంత విషం. ప్రేమలూ సర్పాలూ కలగలసి అల్లుకున్న క్షణాలలో నేనొక్కడినే నా మీద వ్యక్తం చేయలేనంత అసహ్యంతో కన్నీళ్ళతో రాలిపడుతూ ఉంటాను. జీవితంపై అమిత విశ్వాసమూ ఒక గొప్ప నమ్మకమూ పటాపంచలై తాతయ్య పంచలై బయటపడ్డ మర్మాంగపు వెండ్రుకల్లా తేలిపోతాయి. తాతయ్యదెప్పుడూ ఒకటే బాధ.
నిరాదరణ. నిరాదరణ .
కీళ్ళ నొప్పులూ కళ్ళకు ఆన్ని చూపులూ విసర్జించడానికి కూర్చోడానికైనా మోకాళ్ళు వంగక, బిగుతు నవారు మంచం అతి కొద్దిగా వదులు చేసినట్టు కొద్దిగా వంగి మల మూత్రాల్ని విసర్జించే ఒక భయానక వృద్ధాప్యం ఎవరూ పట్టించు కోనితనం కలగలసి పేనిన తాతయ్య. తాతయ్యదెప్పుడూ ఒకటే బాధ.
ప్రేమారాహిత్యం. ప్రేమారాహిత్యం.
నోటిలోకి ఒక అన్నం ముద్ధకీ దేవులాడుకోవాలి. పదిసార్లు బ్రతిమిలాడుకోవాలి. గ్లాసు నీళ్లకూ అడుగడుగునా అసహ్యించు కోబడాలి. అప్పటికీ షుగర్ టెస్ట్ లు సొంతంగా పరీక్షా నాళికలో మూత్రాన్ని తెచ్చి మందు కలిపి వేడి చేసి, రంగు మారిందా లేదా, లేదా ఏ రంగు వచ్చిందో అని వొణికే చేతులతో ఎండిపోయిన పండిపోయిన హస్తాలతో ఆయనే చేసుకుంటాడనుకో, అయినా ఒకన్నం ముద్ద వేయాలంటే అందరికీ ఎక్కడ లేని బరువు -
అంత నరకమూ అంత వృద్ధాప్యపు నిరాదరణా నాకు ఆవహించినట్టు అనిపిస్తుంది. యవ్వనంలోంచే వ్రుద్ధ్యాప్యపు దశ మొదలయ్యినట్టుగా వుంటుంది. అదే స్థితి. కదల లేని కదలిక లేని తాతయ్య స్థితి నాలోకి హత్తుకు పోతుంది. చేతులు కదలవు, బలహీనంగా కంపిస్తుంటాయి. గుండెక్కడో డోక్కుపోయినట్టు చెక్కుకుపోయినట్టు పెచ్చులు పెచ్చులుగా పై చర్మం ఊడిపోయి నరాలు తెగిపోయి రక్తమింకిపోయి మిగిలిన ఆస్థిపంజరమొక్కటి పటాలున పేలిపోయినట్టు మూసుకున్న కళ్ళ చీకట్ల కింద వేదనేమిటో అర్థమౌతుంది. ఎండిన చర్మంపై పొడుచుకు వచ్చిన నరాల స్పర్సార్థమేమిటో బోధ పడుతుంది.
మనుషుల్ని అర్థం చేసుకోడానికైనా మనుషులు చేసే నమ్మక ద్రోహాలని ఓర్చుకోవాలనిపిస్తుంటుంది. ఏది అక్రమామో ఏది సక్రమమో ఏది నైతికమో ఏది అనైతికమో తేల్చుకోడానికైనా జీవించాలనిపిస్తుంది. ఇన్నేళ్ళు కలిసి బ్రతికి ఇన్నేళ్ళు కలిసి సుఖించీ దు:క్కించీ ఎక్కడో ఒక ముడి వీడిపోయి పూసల్లా మనం చెల్లా చెదురై పోయి ముఖాలు దాచుకుని సిగ్గుతో అవమానంతో తప్పుకుని తిరుగుతో ఒక ఘోర పాపం చేసినట్టు తలలు దించుకుని పారిపోతో
చీకట్లో చిక్కటి చామంతి మొక్కల మధ్యగా వికసించిన అస్పష్టపు తెల్లని పూవు. నీడల్లా ముడిపడిన దారాల్లా అల్లుకుపోయిన మల్లె తీగ మసక చిరునవ్వు. ఇంటికి పైగా వ్యాపించి ఆకాశ అంధకారంలోకి చేతులూపుతున్న వేపచెట్టు.
మబ్బు పట్టింది. వొక వర్షపు జల్లు మనస్సుని ఆహ్లాదం చేస్తుందా? ఇంత రాత్రి చుక్కలు కూడా లేని ఒక శారద రాత్రిపై కురిసే నాలుగు చినుకులు నన్ను ఆర్పుతాయా?
మనస్సిలాగే, మబ్బులాగే వేసవి కాలం వానకి ఎదురు చూసే మొక్కలలాగే తపిస్తూ, పరి పరి విధాల దు:క్కిస్తూ భరిస్తూ చేతులు చాచి నింగిలోకి, రాబోయే నీలాకాశంలోకి జారిపోతుంది

అప్పుడప్పుడూ బ్రతకాలనిపిస్తుంటుంది

ఎందుకిలా మన కల వికలమైపోయింది?
చీకట్లో చిక్కటి చామంతి మొక్కల మధ్యగా వికసించిన అస్పష్టపు తెల్లని పూవు. నీడల్లా ముడిపడిన దారాల్లా అల్లుకుపోయిన మల్లె తీగ మసక చిరునవ్వు. ఇంటికి పైగా వ్యాపించి ఆకాశ అంధకారంలోకి చేతులూపుతున్న వేపచెట్టు.
మబ్బు పట్టింది. వొక వర్షపు జల్లు మనస్సుని ఆహ్లాదం చేస్తుందా? ఇంత రాత్రి చుక్కలు కూడా లేని ఒక శారద రాత్రిపై కురిసే నాలుగు చినుకులు నన్ను ఆర్పుతాయా?
మనస్సిలాగే, మబ్బులాగే వేసవి కాలం వానకి ఎదురు చూసే మొక్కలలాగే తపిస్తూ, పరి పరి విధాల దు:క్కిస్తూ భరిస్తూ చేతులు చాచి నింగిలోకి, రాబోయే నీలాకాశంలోకి జారిపోతుంది
ఒక నిట్టూర్పుగా ధిగులుగా జాలిగా మోయలేనంత బరువుగా బాధగా-
అమ్మ పాదాలు*
సాయంకాలం ఆమె నడచి వస్తూ ఉంటుంది. కన్నీటి పొరలా, కింద బరువుగా తడి తడిగా కదులాడే కనుగుడ్లలా, భారంగా నెమ్మదిగా ఆమె పాదాల కింద ప్రపంచం తేలికవుతుంది. విశ్వమంత వొత్తిడి పాదాలలో - నెమ్మదిగా ఒక్కక్క అడుగే వేస్తూ ఆమె సాయం సంధ్యలో, దారి పక్కగా తల వంచుకుని గులక రాళ్ళలా వొత్తుకుంటున్న పాదాలతో, బాధతో దేహాన్నీ అంతకు మించి మనస్సులోని భారాన్నీ మోస్తున్న పాదాల వంక చూస్తూ, తల వంచుకుని నడచి వస్తూ ఉంటుంది. కళ్ళకీ పాదాలకీ తేడా లేని క్షణాలవి. రహదారిపై బరువుగా పడుతున్నవి పాదాలా లేక నొప్పిని అణచి పెట్టుకున్న నయనాలా?
ఒకప్పుడు, బంగారపు నీటి పాయల్లా ఉన్న పాదాలు, తొలి సూర్యకాంతీ సిగ్గు పడే పాదాలు, ఇకిప్పుడు, అంతిమంగా రక్తం గడ్డ కట్టుకుపోయినట్టు నీరు పట్టి వాపుతో కదులుతుంటాయి. ఒక సమగ్ర ప్రేమమయ, దు:క్క మయ జీవితాన్ని చూడాలా? అమ్మ పాదాల్ని చూడండి. భూమిపై మరో భూమిలా, ధూళి అంటుకుని పగుళ్లతో బాధగా వర్షిస్తున్న బరువైన పాదాలు. ఎప్పుడైనా దగ్గరగా చూస్తానా, పాదాలు, మోకాళ్ళ నొప్పుల కింద నుంచి, శ్రమతో, జీవితం ఆకస్మికంగా ఇచ్చిన దు:క్కంతో వాచీ, కనుల కిందటి నల్లటి చారల్లా, అస్వస్థతతో మొలకెత్తిన దిగులు మొక్కల్లా, నెమ్మదిగా తమ గురించి చెబుతాయి. ఆ రెండు పాదాలు, పైగా రెండు చంచల జీవితాలు. తన హస్తాలతో పాదాలని వొత్తుకుంటూ
గాజుల సన్నటి వొణుకుల మధ్య, చేతి వేళ్ళకు పైగా పాదాల్ని చూసే ఆ రెండు కనులు. ఒక దు:క్కం. ఒక బాధ. ఎప్పుడూ ఉండే దిగులు. ఆకస్మికంగా వృద్ధాప్యం - అనుకోకుండా, ఇదిగో ఈ మజిలీలో కాదు - అనుకోకుండా, పోనీ ఊహించనైనా లేదు. నెమ్మది నెమ్మదిగా పాదాల నుంచి మొదలయ్యి క్రమ క్రమంగా పైకి పాకుతున్న నొప్పిలా, తునా తునకలయ్యిన మానవ సంబంధాలు. బాధ, నిదుర పట్టని రాత్రుల్లలా, శారీరికమైన నొప్పి కాదు, అంత కన్నా అంతకు మించినదేదో గుండెలో, ఆ రెండు హృదయపు మడతల్లో, క్రమ పద్ధతిలో కొట్టుకునే ధ్వనుల్లో ఒకటి తప్పిపోయింది. ఈ రద్దీలో మనుషులమని మరచిపోయే క్రమంలో లేదా మనుషులమని జ్ఞాపకముంచుకునే ప్రయత్నంలో ఒక ధ్వని కొట్టుకు పోయింది. కాలపు వర్షంలో, అసంఖ్యాక లబ్ డబ్ చినుకుల మధ్య నుంచి ఒక చినుకు నిశ్శబ్ధంగా మాయమయ్యింది. పరా మర్సించేందుకు, ఉదయం నుంచి సాయంత్రం దాకా, అలసటభరితమైన క్షణాలలో, ఏ ఒక్క రక్త కణమూ దగ్గర లేక, కళ్ళ ముందు ఉండే పాదాలతో, ఊహ తెలిసినప్పటి నుండీ జీవితాన్ని పంచి ఇస్తున్న చేతులతో, ఒక్కతివే, సాయంసంధ్యలో, కళ్ళ కింద పారాడే, కంపించే గాలికి పడి లేచి పాదాల చుట్టూ ఒదార్పులా చుట్టుకునే ధూళితో ఇంటికి తిరిగి వస్తూ నువ్వు.
నిరంతరం ఇంటికి. పగటి వొత్తిడి లోంచి రాత్రి రంపపు కోతలోకి, ప్రతీ రోజూ ఇంటికి. ఏమీ లేని ఇంటికి. నాలుగు గోడలు తప్ప ఇన్ని నవ్వులూ మాటలు పువ్వులూ పిడికెడంత హృదయమైనా లేని ఇంటికి. బలహీనమౌతున్న మోకాళ్ళలా, కాస్తంత దూరం నడవగానే సహకరించని పాదాలలా, కుంటుకుంటూ నెమ్మదిగా మౌనంగా నువ్వు ఇంటికి. నీ రాక కోసం ఎదురు చూసే నాలుగు మొక్కల కోసం, నీ చేతి స్పర్శకై ఎదురుచూసే గేటు కోసం నీ పాదాల తడికై మిగిలి ఉన్న నేల కోసం, నువ్వు పెట్టే ముద్ద అన్నం కోసం విప్పారిన కనులతో చూసే కుక్క కోసం, జీవితాన్ని మోస్తున్న పాదాలతో, భుజానికో సంచితో, మనస్సులో యింకా మనుషుల పట్ల ప్రేమతో, ఓపికగా, ప్రపంచమంతా మోయలేని దు:క్కాన్ని మునిపంట నొక్కి పట్టుకుని, నిర్లిప్తంగా నెమ్మదిగా, కన్నీటి వెనుక భారంగా కదులాడే కనుగుడ్ల పాదాలలా, సాయం సంధ్యలో కుంగిపోతున్న రక్తం ముద్ద మధ్యగా ఇంటికి తిరిగి వస్తూ, అమ్మా, నువ్వు.

25 May 2012
నీ / స్థితి/ నిస్సహాయ స్థితి
తల దగ్గర
ఒక దీపం వెలిగించుకుని కూర్చుంటావు నువ్ రాత్రంతా
నీ నాలికపై చేదు
నీ వొంట్లో వొణుకు
కళ్ళేమో శవాలు
అంతం లేని స్మశానం వలె పరచుకున్న ఆకాశంలో
కాలే ఒక చితి వద్ద
నిస్సహాయంగా వొరిగిన నీ చూపులు శిక్షా స్మృతులు
(- దానిని నువ్వు ఒక
- నక్షత్రం అని పిలవలేవు
- యిక ఎన్నటికీ_ )
నీ తల దగ్గర
దీపం వెలిగించాల్సిన వాళ్ళూ, నీ మృత దేహాన్ని అంటించాల్సిన వాళ్ళూ
తగలబడుతున్నారు ఇప్పుడే యిక్కడే
బ్రతికుండగానే నిన్ను తగలబెట్టేంత ఆ
పగతో ప్రేమతో ప్రతీకారంతో
మధుపాత్రల నిండా ముంచుకున్న తమ ఛితాభాస్మంతో మృత్యుహాసంతో-
...యిక ఎక్కడకి వెళ్తావ్ నువ్వు
చనుబాలు లేని చూచుకం లేని
ఈ లోకపు తల్లి స్థన్యంతో, తండ్రి లేని తనంతో తనువు లేని తనంతో నీతో నువ్వు?

ఇలాగేనా?
నీ పిల్లలే
ధిక్కరిస్తారు నిన్ను అనంతంలోకి నెట్టి వేసే తమ చేతులతో
నువ్వొక
స్మృతని
నువ్వొక
గోడపై మిగిలే నిన్నటి చారికల ధూళి పటం అనీ తెలియదు నీకు
అప్పటిదాకా-
కళ్ళంత భారంతో
కళ్ళంత కన్నీటితో
ఆ వెన్నులో దిగిన
పిల్లల బాల్యపు పెదవులతో, చేష్టలతో అరచేతులతో
నీ చీకటింట శరీరం
యిక రాత్రిలో వొణుకుతోంది నువ్వు మోయలేని కాలపు స్పృహతో
వయో భారంతో-
ఇలాగేనా, నాన్నా
నువ్వూ నేనూ చచ్చిపోయేదీ ఒకరినొకరు వదిలి వెళ్లిపోయేదీ తిరిగి
ఎన్నటికీ కలవనిదీ?

ఎలా ఉండింది?
రాత్రిని
నువ్వు ఒక నారింజ పండులా వొలుస్తున్నప్పుడు
ఒక పూవులా
దాని రేకు రేకునీ తెంపుతూ కూర్చున్నప్పుడు
ఎలాంటి రుచి
కలిగి ఉంది నీ
చేతుల్లో చిక్కుకున్న ఆ పదునైన కళ్ళ చీకటి?
పుల్ల గానా
తియ్యగానా
అపస్మారక
బాహువులలోకి నిన్ను లాక్కునే తన వెలుతురు విషంలానా?

ఒక రోజు (నీకై 15*)
యింకా నాతో ఉన్నందుకు
కృతజ్ఞతలు- చూడు
ధూపంలా మట్టిని రేపుతూ
చల్లగా భూమి ఉపరితలంపై
సాగిపోయింది చల్లని గాలి:
ఆ చిన్నిచిన్న పరామర్శకే
లోపలి ఇసుక పొరల్లో
జలదరించి కదిలింది
ఒక సహ/ జీవ నది-
ఆ చిన్ని చిన్న తాకిడికే
నిండుగా ఒళ్లంతా విరుచుకుని
గలగలా ఆకులతో నవ్వింది
పిట్టలతో విరగబూసిన రావి మది
ఆ చిన్ని చిన్న వలయానికే
తన చుట్టూతా తానే తిరిగి
గీతల మబ్బైన ఆకాశానికి
ఎగిరింది ఒక కాగితం ధ్వని
ఆ గాలితో పాటు గాలి కంటే
వేగంగా పరిగెడుతో పిల్లలు
జారే పోతున్నారు వాన చినుకులై
నీడలు పట్టిన రాదారులపై
హద్దు లేని స/ఇకిలింతలై
వస్తునారు ఎవరో లోపలికి
ఈ దేహం గదిలోకి
తడిచిన వస్త్రాలను
విదుల్చుకుంటూ ఆరబెట్టుకుంటో
ఆ శి/ రోజాలను
తుడుచుకుంటో
సాంభ్రాణి సువాసనతో
చలిమంట మాటలతో-
యిక ఏమైనా కానీ
యిక ఏమైనా రానీ
యిక పర్వాలేదు, నిజంగా
ఎందుకంటే యిక ఈ దినానికి
ఈ ఫిరోజ్, ఆ శ్రీకాంత్
ఆ మధుశాలల్లో కాక
ఈ మధుపాత్రల్తో కాక
మనుషులలో
మనుషులతో
మత్తిల్లి స్వర్గలోకాలను చూసే వేళయ్యింది!

24 May 2012
బొమ్మ
అలాగే తను వొచ్చింది-
ఉదయపు ఎండలో
గదిలో కదిలే పిచ్చుకలతో
చల్లని నీడలతో పరదాలతో
నన్నో బొమ్మగా మార్చి
సర్ది దిద్ది దుస్తులు వేసి
ఆడుకున్నంత సేపు
ఆడుకుని ఆనక ఆ
అరలో నన్ను విసిరేసి
ఎప్పటిలాగే, అలాగే
తను వెళ్లిపోయింది-
యిక చీకటయ్యే వేళకి
చిత్తడయ్యే వేళకి
గూటిలో ఒంటరిగా ఉన్న బొమ్మకి
భయం .... వేస్తే
దిగులు ... వేస్తే
బెంగగా .. ఉంటె
ఆ బొమ్మ
ఏం చేయాలి, ఎవరికి
ఏమని చెప్పుకోవాలి?
ఉదయపు ఎండలో
గదిలో కదిలే పిచ్చుకలతో
చల్లని నీడలతో పరదాలతో
నన్నో బొమ్మగా మార్చి
సర్ది దిద్ది దుస్తులు వేసి
ఆడుకున్నంత సేపు
ఆడుకుని ఆనక ఆ
అరలో నన్ను విసిరేసి
ఎప్పటిలాగే, అలాగే
తను వెళ్లిపోయింది-
యిక చీకటయ్యే వేళకి
చిత్తడయ్యే వేళకి
గూటిలో ఒంటరిగా ఉన్న బొమ్మకి
భయం .... వేస్తే
దిగులు ... వేస్తే
బెంగగా .. ఉంటె
ఆ బొమ్మ
ఏం చేయాలి, ఎవరికి
ఏమని చెప్పుకోవాలి?
(అసంపూర్ణ) ప్రతీక
తేరుకుంటావు
ఒక దివంగత రాత్రి నుంచి
శరణుజొచ్చుతావు
ఒక నల్లటి పగటి ని
అందుకే మొలుచుకు వస్తాయి నీ కళ్ళల్లో
కన్నీటి గుర్రపు డెక్కల తీగలు
అందుకే ఆడరు ఎవ్వరూ
నీ చిన్ని హృదయం మీద
మెత్తటి చేతులతో, ఛాతి ఇసుక తీరం అయ్యిన క్షణాలలో - అందుకే యిక
ప్రార్ధిస్తాయి ముడుతలు పడిన నీ చేతులు
చనుబాలు లేని ఆ తల్లి కాలాన్ని -

తీసుకు వెళ్ళిపో, నా
_______ఈ విస్మయ వాచకపు దేహాన్ని
_____________ఒక నిట్టూర్పుగా మిగిలిన సశేష లోకాన్నీ
ఈ సంతానపు ఉక్కు పిడికిళ్లలోంచి
ఈ వలయామృత విష బంధనాల్లోంచి
ఈ మానవ సంబంధాల
పాముల పుట్టల లోంచీ-
_____________ఒక నిట్టూర్పుగా మిగిలిన సశేష లోకాన్నీ
ఈ సంతానపు ఉక్కు పిడికిళ్లలోంచి
ఈ వలయామృత విష బంధనాల్లోంచి
ఈ మానవ సంబంధాల
పాముల పుట్టల లోంచీ-
(యిక అతని అద్దపు అంచుని కోస్తున్న
ఒక ప్రతి బింబంలోంచి మరొక శిలువ
నెత్తురు గులాబియై మొలకెత్తుతుంది)
యిక తేరుకొని విధంగా అంతలోనే
అతనిని అతనిలోనే మరొకరిగా
నిర్విరామంగా అంధుల లోకంలో అందుకునే చేయి లేకుండా భూస్థాపితం చేసింది ఎవరు?
ఒక ప్రతి బింబంలోంచి మరొక శిలువ
నెత్తురు గులాబియై మొలకెత్తుతుంది)
యిక తేరుకొని విధంగా అంతలోనే
అతనిని అతనిలోనే మరొకరిగా
నిర్విరామంగా అంధుల లోకంలో అందుకునే చేయి లేకుండా భూస్థాపితం చేసింది ఎవరు?
23 May 2012
ఒకసారి
అరచేతుల్లో
ముఖాన్ని సమాధి చేసుకుని
చేతి వేళ్ళతో
తడిచిన రెప్పలని రుద్దుకుంటో
భూమంత
శ్వాసని తీసుకుంటావు నువ్వు
పలకలుగా
విరిగిన గుండెలోకి, కాలంలోకి-
హృదయంలో
వెలిగే ఆ తెల్లటి దీపపు
నల్లటి కాంతి అంచున
నీ నిద్రను ఉంచుతావు
ఒక శవాన్ని స్వప్నిస్తావు
స్మశానాలని పూలగా
తేనెపిట్టల తోటలుగా ఊహిస్తావు
ఒక నిస్సహాయతతో
శరీరాన్ని మొత్తంగా
అరచేతులలో దోపుకుని
తిరిగి నీలోకి నువ్వే
రాలిపడతావు
పిగిలిపోతావు
ఇంతకూ తెలుసునా నీకు?
చచ్చిపోతాం మనం
... బహుశా ఇలాగే
శరీరమంత శూన్యంతో
ఆ ప్రేమంత పాపంతో
భరించలేని దిగులుతో- అని?
ముఖాన్ని సమాధి చేసుకుని
చేతి వేళ్ళతో
తడిచిన రెప్పలని రుద్దుకుంటో
భూమంత
శ్వాసని తీసుకుంటావు నువ్వు
పలకలుగా
విరిగిన గుండెలోకి, కాలంలోకి-
హృదయంలో
వెలిగే ఆ తెల్లటి దీపపు
నల్లటి కాంతి అంచున
నీ నిద్రను ఉంచుతావు
ఒక శవాన్ని స్వప్నిస్తావు
స్మశానాలని పూలగా
తేనెపిట్టల తోటలుగా ఊహిస్తావు
ఒక నిస్సహాయతతో
శరీరాన్ని మొత్తంగా
అరచేతులలో దోపుకుని
తిరిగి నీలోకి నువ్వే
రాలిపడతావు
పిగిలిపోతావు
ఇంతకూ తెలుసునా నీకు?
చచ్చిపోతాం మనం
... బహుశా ఇలాగే
శరీరమంత శూన్యంతో
ఆ ప్రేమంత పాపంతో
భరించలేని దిగులుతో- అని?
మహా శబ్ధం
వీధి మలుపులో
తల వంచుకుని నిన్ను దాటుకుని వెళ్లిపోయారు ఎవరో
నిను తాకిన అతని కమిలిన శరీరపు గాలిని నువ్వు
_తిరిగి చూడనూ లేదు
వీడిన అతని అరచేతిని
తల వంచుకుని నిన్ను దాటుకుని వెళ్లిపోయారు ఎవరో
నిను తాకిన అతని కమిలిన శరీరపు గాలిని నువ్వు
_తిరిగి చూడనూ లేదు
వీడిన అతని అరచేతిని
_కొన వేళ్ళతో తాకనూ లేదు
వడలిన అతని ముఖాన్ని
_ఒక చిన్న మాటతో నువ్వు
నిమరనూ లేదు
ఏం చెప్పను తండ్రీ, యిక ఈ రాత్రి
గొంగళిపురుగు తిరుగాడే ఆకుపై
ఒక వాన చినుకుని రాయలేను-
కనురెప్పల పై వాలిన మెత్తటి నిద్రై
పూల దీవెనల దీపమై వెలగలేను
_ఒక చిన్న మాటతో నువ్వు
నిమరనూ లేదు
ఏం చెప్పను తండ్రీ, యిక ఈ రాత్రి
గొంగళిపురుగు తిరుగాడే ఆకుపై
ఒక వాన చినుకుని రాయలేను-
కనురెప్పల పై వాలిన మెత్తటి నిద్రై
పూల దీవెనల దీపమై వెలగలేను
_ఇంతకూ ఈ నీ నా జీవితపు మహా శబ్దాన్ని
నిలువునా సంధించి, వలయమై చేధించి
____వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోయిన వారెవరు?
నిలువునా సంధించి, వలయమై చేధించి
____వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోయిన వారెవరు?
21 May 2012
మరో వైపు
నువ్విక
ఈ రాత్రిని రాయలేవు ఎన్నటికీ
నువ్వు
సమాధులని తవ్వుకుని
ఆస్థి/పంజరాలతో
కలలని పంచుకునే
నువ్వు
నువ్విక
ఈ రాత్రిని ఎన్నటికీ దాటలేవు-
ఇంతకూ
ఎలా ఉండింది
ఇతరుని
ఇతర దేశపు
ఆ జ్నాపకపు
నీ నా శ్మశాన
ఉద్యానవనం?
ఈ రాత్రిని రాయలేవు ఎన్నటికీ
నువ్వు
సమాధులని తవ్వుకుని
ఆస్థి/పంజరాలతో
కలలని పంచుకునే
నువ్వు
నువ్విక
ఈ రాత్రిని ఎన్నటికీ దాటలేవు-
ఇంతకూ
ఎలా ఉండింది
ఇతరుని
ఇతర దేశపు
ఆ జ్నాపకపు
నీ నా శ్మశాన
ఉద్యానవనం?
అనువాదం
గాలి
శ్వాసించదు యిక్కడ
యిక్కడ
ఈ మూడు అంతస్తుల
ఈ మృత గాజు పాత్రలో
మొక్కల్లేని చదరపు
లోహపు లో గదుల్లో
పాత్ర లేక వడలిన
ఆ నీటి అలసటలో
ముడుచుకున్న
పావురాళ్ళ రాళ్ళ
చీకట్లలో రెక్కల్లో-
శిల్పపు ఆనందం
తెలుసునా నీకు?
ఎప్పుడూ
ఆ పూవు ఏదని
ఎవరినీ అడగకు
ఎందుకంటే
ఈ ఒంటరితనాన్ని
నీకెలా అనువాదం
చేయగలను-?
శ్వాసించదు యిక్కడ
యిక్కడ
ఈ మూడు అంతస్తుల
ఈ మృత గాజు పాత్రలో
మొక్కల్లేని చదరపు
లోహపు లో గదుల్లో
పాత్ర లేక వడలిన
ఆ నీటి అలసటలో
ముడుచుకున్న
పావురాళ్ళ రాళ్ళ
చీకట్లలో రెక్కల్లో-
శిల్పపు ఆనందం
తెలుసునా నీకు?
ఎప్పుడూ
ఆ పూవు ఏదని
ఎవరినీ అడగకు
ఎందుకంటే
ఈ ఒంటరితనాన్ని
నీకెలా అనువాదం
చేయగలను-?
20 May 2012
ఎందుకు (ఆకవిత)
దారి పక్కగా
పూరె గుడిసెలో వొణుకుతుంది ఒక స్త్రీ శరీరం, ఉండుండీ మూల్గుతోంది
'మ్మా' అంటో బ్రతికుందో లేదో తెలియని చిల్లులు పడిన దశ రంధ్రాల ఆ తల్లి ప్రాణం
బయటగా
నిటారుగా లేచిన ఇనుప దిమ్మెల లోహ భవంతి
పూరె గుడిసెలో వొణుకుతుంది ఒక స్త్రీ శరీరం, ఉండుండీ మూల్గుతోంది
'మ్మా' అంటో బ్రతికుందో లేదో తెలియని చిల్లులు పడిన దశ రంధ్రాల ఆ తల్లి ప్రాణం
బయటగా
నిటారుగా లేచిన ఇనుప దిమ్మెల లోహ భవంతి
అంతే నిటారుగా అంతే లోహంతో గుడిసె లోపలోక లోహ మనిషి
తలుపులోంచి ఎర్రబారిన కళ్ళతో, మత్తుబారిన నాలికతో చీకటిని
బండ బూతులు తిడుతో
'నీయమ్మ, లంజే నోర్ముయ్' అని కసి దీరా
______________ఒకప్పటి మెత్తటి పచ్చిక వంటి తన కడుపుని తంతో తనూ వణుకుతాడు
________తనూ తూలి చేజారి పోతాడు, నా వైపోసారి అసహ్యంగా చూసి
దిగంతాల నిస్సహాయతనంతా నాపై ఉమ్మేస్తాడు-

నక్షత్రాలు లేని గూటిలో
మోగుతున్న నక్షత్ర ప్రసారాల ముందు ఆ ఇద్దరు పసి పిల్లలే కడుపుని చేతబుచ్చుకుని
కనులని తుడుచుకుని ఎండకి చిట్లిన చేతులపై ఆరని పుండ్లని గిల్లుకుంటూ
ఎందుకో నవ్వుతారు పడీ పడీ, ఎందుకో ఏడుస్తారు ఆగీ ఆగీ ఎందుకో స్పృహ
___తప్పుతారు, తప్పిపోతారు రాత్రుళ్ళ అంచును చీరే చిరు కాగితాలలోకీ కలలలోకీ -
కమిలిన రక్తం
కమిలిన దేహం
కమిలిన ప్రాణం
కమిలిన కాలం
కమిలిన లోకం
కమిలీ కమిలీ కమిలీ యిక కమల లేక యిక కాలలేక ఆగిన వేసవి గాలి కింద
ముడుచుకుంటాయి రెండు నల్ల వీధి కుక్క పిల్లలు
కొంత సేపటి తరువాత చెల్లా చేదురయ్యే పేగులతో,
వేల జన్మల ఆర్తితో యిక రాత్రంతా ఊళ పెడుతూ ఏడ్చే తల్లి తనపు ఆక్రందనతో-
అయితే ఇంతకూ
ఎవరు చెప్పారు మీకు ఇదొక కవితని
యింకా ఎందుకు ఉన్నారు మీరు యిక్కడ నిసిగ్గుగా
_తిరుగుతో కనులతో తడుతూ ఈ వాచకపు తనువుని?

19 May 2012
నీకై 14*
తన కళ్ళను మాత్రం వొదిలి
తన ముఖాన్ని పూర్తిగా చుట్టుకున్న అజగరం ఆ దుప్పట్టా
యిక మరి తన ముఖమేమో ముఖం లేకుండా
ముందున్న విద్యుత్ తెరల పరదాలలో ముఖ పుస్తకాలలో నిండుగా మునిగింది
తన చేతివేళ్లు, తెలియదా నీకు, అవి
మంచు మల్లె పూల అగ్ని తీగలు
నిను నిలువెల్లా దగ్ధం చేసే కీలలు
అల్లుతాయి అవి అక్షరాలను శర శరా
వొదులుతాయి అవి పదాలను
శరాఘాతాల్లా, మృదు మృత్యువులా-
మడచిన చేతిలోంచి చెవిలోకి సాగుతోంది
ఒకనొక రహస్య సమాచారం
పల్చగా కదిలే పరదాలోంచి
మెరుస్తోంది ఆ పెదాలు ఇచ్చే వింత విషం-
యిక్కడ కూర్చుని అక్కడ బ్రతుకుతూ
మధుపాత్రలో మోముని చూసుకుంటూ
తన ఎదురుగా ఎండగా మారిన నీడలో
అపరాధిగా నిలబెట్టిన ఆ తనువులో
స్పృహ తప్పిన ఫిరోజ్ ఇలా అంటాడు:
అమ్మాయీ, ఆ మాయా కర్ణ భేరిలోంచి
నీ స్వరాన్ని కొంచెం పక్కకు జరపగలిగితే
అమ్మాయీ, ఆ ముఖే ముఖ వాచకపు
రాచరికపు ఊబిలోంచి నీ ముఖాన్ని
కొంత సేపు అలా పైకి లేపి ఉంచగలిగితే
జాబిలిని చుట్టిన ఆ చీకటి దుప్పట్టాని
అలా ముని వేళ్ళతో నువ్వు తొలగించగలిగితే
నీ చూపుల నీళ్ళలో తన ముఖాన్నీ
పాదాల్నీ చేతుల్నీ కడుక్కుని యిక
ఫిరోజ్ ఈ యంత్ర తంత్ర లోకంలోకి
తనని తాను బలి ఇచ్చుకునేందుకు
నీ రాహిత్యంతో వెడతాడు- యిక
ఈ కాలాన్నీ, ఈ జనాల జగజ్జెంత్రీలనీ
వేటాడేందుకు నీకేం అడ్డు- యిక
రాసుకునేందుకు అతడికేం అడ్డు?

ఎలా?
నీ కన్ను తెగి నా కంటి అంచు నుంచి
రాలి పడుతుందొక నెత్తురు బొట్టు
తొలి వెలుతురు మసక గాజు పాత్రలో
మంచు పొగ వలె
అతని కన్నీళ్ళలో
అల్లుకుంటుంది
ఆ నెత్తురు నిప్పు-
యిక అతను, యిక అతనికే
తొలిసారిగా మలిసారిగా
గుర్తుకు వస్తుంది అమ్మ, అన్నీ
అయ్యి ఏమీ కాక, అన్నీ అయ్యి
ఏమీ లేక ఏమీ కాలేక కాలపు బిలంలోకి ఇంకిపోయిన అమ్మ-
చెప్పు కన్నా
ఎలా అంతమౌతుంది
తల్లి లేని తను లేని
ఈ దిగులు దేహం?

17 May 2012
నాకు తెలియదు
రాత్రిలో
నీ ముఖాన్ని వెలిగించుకుని, ఆ కాంతిలో విస్తుపోయాను-
కన్నా యిక ఇప్పటికీ నాకు తెలియదు
గుంపైన యూకలిప్టస్ చెట్ల కదలికలతో
పూల బరువుతో పచ్చి నీటి వాసనతో సీతాకోకచిలుకల రెక్కలతో
నా గదిలోకి, నా మంచంపైకి
ఆ నిండు వెన్నెల జాబిలి
ఎలా వచ్చి చేరిందో, అలా ఎలా
అంత హాయిగా నిదురోయిందో!

తారు హృదయాలు
రావాల్సిన వాళ్లు, నేను
............రావాలనుకున్న వాళ్ళూ
ఎవరైతే ఉన్నారో
.ఎవరైతే వెళ్ళారో
ఎవరైతే ఉన్నారో
.ఎవరైతే వెళ్ళారో
వాళ్ళైతే వచ్చారు కానీ
ఇన్నాళ్ళుగా పుల్ల పుల్లనూ
సన్నటి మల్లె కాడల ఇనుప
.............తీగలనూ తెచ్చుకుని అల్లుకుంటున్న
..ఆ పక్షుల గూడే మిగలలేదు
................ఈ నలు చదరపు గదుల అంతస్తులలో-
యిక పిల్లలే యిక కనిపించని
ఆ పావురాళ్ళ గుండ్రటి కళ్ళతో
బెంగగా బెదురుగా ఇనుప చట్రాలు అమర్చిన బాల్కొనీలోంచి

ముక్కలైన ఆకాశాన్నీ
నీడ లేని నీరెండ లేని
................................చిట చిట లాడే చితి వంటి తారు దారిని చూస్తో :
యిక ఏమని చెప్పను మీకు
ఈ నల్లటి పరదాల
దిగులు దేహం/దినం గురించి-?
నీడ లేని నీరెండ లేని
................................చిట చిట లాడే చితి వంటి తారు దారిని చూస్తో :
యిక ఏమని చెప్పను మీకు
ఈ నల్లటి పరదాల
దిగులు దేహం/దినం గురించి-?
15 May 2012
నీకై 13*
ఎవరూ లేక
శరీరమంతా హృదయమై, ఒక రాచపుండై సలుపుతోంది
పరిసరాల్లోనే
నువ్వు ఆపలేని ఒంటరితనం రక్తపిపాసియై
ఖడ్గ దంతాల వేట మృగమై నీకై పొంచి ఉంది-
యిక యిదే సరైన సమయం
యిక్కడ నుంచి నిష్క్రమించేందుకు
మధుశాలల్లో, నీ కన్నుల్లో
మత్తిల్లేందుకు నన్ను నేను మరచేందుకు
పూలల్లో దాగిన పచ్చిముళ్ళను
చేతి వేళ్ళ అంచున దింపుకుని
పొటమర్చిన ఆ నెత్తురు చుక్కలతో
ఈ పదాలను రాసేందుకు-
శరీరమంతా హృదయమై, ఒక రాచపుండై సలుపుతోంది
పరిసరాల్లోనే
నువ్వు ఆపలేని ఒంటరితనం రక్తపిపాసియై
ఖడ్గ దంతాల వేట మృగమై నీకై పొంచి ఉంది-
యిక యిదే సరైన సమయం
యిక్కడ నుంచి నిష్క్రమించేందుకు
మధుశాలల్లో, నీ కన్నుల్లో
మత్తిల్లేందుకు నన్ను నేను మరచేందుకు
పూలల్లో దాగిన పచ్చిముళ్ళను
చేతి వేళ్ళ అంచున దింపుకుని
పొటమర్చిన ఆ నెత్తురు చుక్కలతో
ఈ పదాలను రాసేందుకు-
ఫరీదా, యిక యింతకంటే
ఎక్కువ చెప్పడం నిషిద్ధం
ఎందుకంటే
ఈ సంబంధాలు
జీవితాంతం సపర్యలు చేసుకునే రోగులు అనీ
ఫిరోజ్ కి తెలిసింది ఇప్పుడే-
ఎక్కువ చెప్పడం నిషిద్ధం
ఎందుకంటే
ఈ హృదయమొక అంతం లేని తపన అనీ
ఈ జనులు తీరని ఒక మహా రుగ్మత అనీ
ఈ జనులు తీరని ఒక మహా రుగ్మత అనీ
ఈ సంబంధాలు
జీవితాంతం సపర్యలు చేసుకునే రోగులు అనీ
ఫిరోజ్ కి తెలిసింది ఇప్పుడే-
ఒక వాస్తవ వాచకం
ఒక వైపుకు మరలి పడుకుని
ఉగ్గ పట్టుకున్న కన్నీళ్ళతో గోడపై నీడలలో తనని తాను చూసుకుంటుంది ఒక అమ్మ
మధ్యాహ్నపు ఎండ
మధ్యాహ్నపు గాలి
మధ్యాహ్నపు శరీరపు రాతి తాకిడి, కమిలిన చెంపల వెచ్చటి ఆవిరి
దూరంగా పాప ఒక్కతే
నిశ్శబ్ధం అర్థం కాక, నిశ్శబ్ధం కాలేక ఇన్ని గిన్నెలని పోగేసుకుని ఆడుకుంటుంది
దాహమైన గొంతుకీ
ఆకలైన కడుపుకీ ఇంట్లో ఒక్కటే ఒక్క కుండ, తల్లి కుండ
బాల్కనీ లో మెలికలుగా అల్లుకున్న లత
ఇంటి వెనుకాల గూడు కట్టుకుందామన్న
....పావురాల అవిచ్చిన్న జీవితపు తపన, శ్రమ-
యిక ఆఖరుకు
జాబిలిని మింగిన చీకటి బావిలో
ఎవరో ఒకరు రాలిపడే మృత వేళల్లో
అటు మరలిన ఒక అమ్మ ఇటు తిరిగి
చిత్తడైన మనస్సునీ చీకటయ్యిన శరీరాన్నీ
....నెత్తురింకిన కనులనీ తుడుచుకుని లేస్తుంది-
తనకి తెలుసు, తనకే తెలుసు
యిక ఒక పాత్రలో తననో, బియ్యాన్నో ఈ రాత్రినో వొండాలనీ
అన్నం పెట్టి, తన గర్భ సమాధిలో
పిల్లలని పదిలంగా దాచుకోవాలనీ-

14 May 2012
నీవేనా?
నీ రెండు కళ్ళలోకి
చేతులు చాపి
నిండుగా చూపులను గుప్పిళ్ళతో తెచ్చుకున్నాను-
కన్నీళ్ళతో
చేతి వేళ్ళ మధ్యగా జారిపోయిన ఆ కథలన్నీ
నీ ఒక్క దానివేనా?
చేతులు చాపి
నిండుగా చూపులను గుప్పిళ్ళతో తెచ్చుకున్నాను-
కన్నీళ్ళతో
చేతి వేళ్ళ మధ్యగా జారిపోయిన ఆ కథలన్నీ
నీ ఒక్క దానివేనా?
రెండు
రెండు
దయ గల కనులు చాలు
రెండు
దయ గల చేతులు చాలు
రెండు
దయ గల పాదాలు చాలు
రెండు
దయ గల పెదాలూ
రెండు
దయ గల మాటలూ
చాలు, చాలిక
నిజంగా-
చలించక
నేను
రెండుగా కాకుండా
ఉండేందుకు
ఇంకొంత కాలం
బ్రతికేందుకు-
దయ గల కనులు చాలు
రెండు
దయ గల చేతులు చాలు
రెండు
దయ గల పాదాలు చాలు
రెండు
దయ గల పెదాలూ
రెండు
దయ గల మాటలూ
చాలు, చాలిక
నిజంగా-
చలించక
నేను
రెండుగా కాకుండా
ఉండేందుకు
ఇంకొంత కాలం
బ్రతికేందుకు-
13 May 2012
కదలకు
కదలకు.
ఒక సీతాకోకచిలుక
నిదురోతోంది యిక్కడ, నీ మెడ చుట్టూ చేయి వేసుకుని-
అయితే ఇంతకూ
ఆ రాత్రి వానలో
ఆ వాన నీటిలో, నీ గదిలో
రాలిన
ఆ నిండు జాబిలిని
నువ్వు చూసావా?
ఒక సీతాకోకచిలుక
నిదురోతోంది యిక్కడ, నీ మెడ చుట్టూ చేయి వేసుకుని-
అయితే ఇంతకూ
ఆ రాత్రి వానలో
ఆ వాన నీటిలో, నీ గదిలో
రాలిన
ఆ నిండు జాబిలిని
నువ్వు చూసావా?
08 May 2012
నీకేం పని?
నీ నుదిటిన వెలుగుతుందొక నలుపు దీపం-
చూసుకుంటాను కంకాళంగా మారిన
నా ముఖాన్ని ఆ ఆకుపచ్చటి కాంతిలో
చిక్కటి చీకటి కమ్ముకున్న రాత్రుళ్ళలో
అప్పుడే గర్భంలోంచి బయట పడ్డ శిశువు
తొలిసారిగా ఈ లోకపు శ్వాసని
తల్లి చూచుకాన్నీ గుప్పిళ్ళ నిండుగా
తన గుండెలోకి పీల్చుకున్నట్టూ అందుకున్నట్టూ

చినుకులకు చిత్తడైన నీడల ప్రాంగణంలో
నిన్న విరిసి ఇవాళ రాలే
...పూల అంతిమ ప్రార్ధనలనూ
రేపు అకస్మాత్తుగా వీడిపోయే ఆకుల సవ్వడిని భీతితో వింటూ
నీ హృదయ ధ్వనిని కొద్దిగా కాపాడుకుంటూ, ఆ దిగంతాలలో
నీ అరచేతులను పుచ్చుకుని
అలాగే అక్కడే కూర్చుంటాను
నలుపు మంటలపై నా పెదాల్ని ఆన్చి అలాగే విస్తుపోతాను-

నీ శరీరంలో వెలుగుతుందొక దీపం
రెక్కల అలజడితో కదులుతుందొక
రెక్కల అలజడితో కదులుతుందొక
కువకువలాడే నల్లటి పావురం
ఆ లేత ఎరుపు కళ్ళతో బెంగగా
కాళ్ళకు అడ్డం పడుతుంది ఒక హిరణ్యం-
ఆ లేత ఎరుపు కళ్ళతో బెంగగా
కాళ్ళకు అడ్డం పడుతుంది ఒక హిరణ్యం-
ఏడవకు, వెళ్ళిపోయిన వాళ్ళూ
.......అలా వెళ్ళలేక ఆగిపోయిన వాళ్ళూ
.......అలా వెళ్ళలేక ఆగిపోయిన వాళ్ళూ
నిన్ను నల్లటి దుస్తులతో
పరామర్సించేందుకు, చితులతో సమాదులతో వచ్చే వేళయ్యింది
యిక ఈ శవంతో, యిక ఈ శాపంతో
నీకేం పని?
పరామర్సించేందుకు, చితులతో సమాదులతో వచ్చే వేళయ్యింది
యిక ఈ శవంతో, యిక ఈ శాపంతో
నీకేం పని?
06 May 2012
ప్రాధమిక సందేహం
రోజూ
ఇన్ని నీళ్ళు పోస్తే ఎండిన మొక్కైనా చిగురిస్తుంది
తనువెల్లా లతలతో అల్లుకుంటుంది, గాలితో నిన్ను ఆదుకుంటుంది
తండ్రీ, మరి
ఏం చేస్తే ఈ మనుషులు చిగురిస్తారు?
ఇన్ని నీళ్ళు పోస్తే ఎండిన మొక్కైనా చిగురిస్తుంది
తనువెల్లా లతలతో అల్లుకుంటుంది, గాలితో నిన్ను ఆదుకుంటుంది
తండ్రీ, మరి
ఏం చేస్తే ఈ మనుషులు చిగురిస్తారు?
అవిద్య
యింకా వొద్దు, యిక వొద్దు -
ఇంకొంత నొప్పి చాలు
యిక ఈ శరీరం తన తీరాన్ని దాటి తానే వొలికిపోతుంది
అప్పుడేనా? అంత తొందరగానా?
వృద్ధాప్యపు పుష్పం
మరికొంత కాలం బ్రతికే ఉంటుంది
నీ ద్వేషాన్ని
ప్రేమగా స్వీకరిస్తూనైనా
నీ నిర్ధయకై
తిరిగి నీ వద్దకు వస్తూనైనా-
ఒక పిల్లవాడిని ఆపడం
నీకైనా నాకైనా
ఎవరికైనా ఎలా సాధ్యం?
ఇంకొంత నొప్పి చాలు
యిక ఈ శరీరం తన తీరాన్ని దాటి తానే వొలికిపోతుంది
ఇన్నాళ్ళుగా ఒరిమిగా పట్టుకున్న పాత్ర
నెమ్మదిగా జారి త్రుటిలో పగిలిపోతుంది-
నెమ్మదిగా జారి త్రుటిలో పగిలిపోతుంది-
అప్పుడేనా? అంత తొందరగానా?
..భాస్కరుని భస్మం, చినుకుల హర్షం
...శీతల పవనం, వసంత రుతు జననం
.......నా చేతులతో కాలంలో మరి కొన్నిసార్లు
.....వెదజల్లనిదే, తనువంతా నింపుకోనిదే
అప్పుడే అంత తొందరగానా
అలా వెళ్ళిపోవడం? మరచిపోవడం?
ఇదిగో ఇపుడే చెబుతున్నా విను
ఈ కమిలిన లోకపు ప్రేమా రాహిత్యపు చారికల కళ్ళ సాక్షిగా -
ఈ అంతిమ దినాల...శీతల పవనం, వసంత రుతు జననం
.......నా చేతులతో కాలంలో మరి కొన్నిసార్లు
.....వెదజల్లనిదే, తనువంతా నింపుకోనిదే
అప్పుడే అంత తొందరగానా
అలా వెళ్ళిపోవడం? మరచిపోవడం?
ఇదిగో ఇపుడే చెబుతున్నా విను
ఈ కమిలిన లోకపు ప్రేమా రాహిత్యపు చారికల కళ్ళ సాక్షిగా -
వృద్ధాప్యపు పుష్పం
మరికొంత కాలం బ్రతికే ఉంటుంది
నీ ద్వేషాన్ని
ప్రేమగా స్వీకరిస్తూనైనా
నీ నిర్ధయకై
తిరిగి నీ వద్దకు వస్తూనైనా-
ఒక పిల్లవాడిని ఆపడం
నీకైనా నాకైనా
ఎవరికైనా ఎలా సాధ్యం?
రాత్రి లత
దిగులు దీపం పెట్టుకుని
ఒంటరిగా ఒక్కడే అ/తను - అద్దంలోంచి తన ముఖాన్ని తనే లాక్కుని
గాలిలోకి వెదజల్లుదామని
తెలిసి ఉండటం వల్ల తెలియక
ఒక మహా నీలి జాబిలి ఆకాశంలో బద్ధలైన వేళ
ఒంటరిగా ఒక్కడే అ/తను - అద్దంలోంచి తన ముఖాన్ని తనే లాక్కుని
గాలిలోకి వెదజల్లుదామని
...ఒంటరిగదిలో నెత్తురు శిల వలె వలయమై అ/తను *-
ఈ చదరపు గోడలలో విత్తనాలు నాటలేమని
అ/తనకి తెలుసు
ఈ లోహపు దారులలో చినుకులు ఇంకవని
అ/తనకి తెలుసు
ఈ చదరపు గోడలలో విత్తనాలు నాటలేమని
అ/తనకి తెలుసు
ఈ లోహపు దారులలో చినుకులు ఇంకవని
అ/తనకి తెలుసు
బాల్కానీలో కుండీలో గాలికి చల్లగా కదులుతూ ఇనుపు చట్రాలను అల్లుకునే
పూలు పూయని లతవు నువ్వనీ
.......................మృతుల కాలంలో శ్వాసవి నీవనీ ఇద్దరికీ తెలుసు
పూలు పూయని లతవు నువ్వనీ
.......................మృతుల కాలంలో శ్వాసవి నీవనీ ఇద్దరికీ తెలుసు
తెలిసి ఉండటం వల్ల తెలియక
ఒక మహా నీలి జాబిలి ఆకాశంలో బద్ధలైన వేళ
వెన్నెల అంచులను దాటి భూమిని ముంచెత్తిన వేళ
ఒంటరిగా గదిలోని దీపాలను ఆర్పుకుని
అవి మిగిల్చిన ధూపదర్పణాల అంచులపై
తమ మణికట్టులను ఉంచుతో
మృత్యువు ఎలా మొదలవుతుందో
ఒంటరిగా గదిలోని దీపాలను ఆర్పుకుని
అవి మిగిల్చిన ధూపదర్పణాల అంచులపై
తమ మణికట్టులను ఉంచుతో
చీకటికి అటువైపు తనూ
..చీకటికి ఇటువైపు నువ్వు-
..చీకటికి ఇటువైపు నువ్వు-
మృత్యువు ఎలా మొదలవుతుందో
యిక చెప్పేదేముంది
వాళ్ళకైనా మీకైనా-?
_______________________________________
అ/తను = అతను+తను (used to mean both 'him' and 'her')
_______________________________________
అ/తను = అతను+తను (used to mean both 'him' and 'her')
05 May 2012
statutory warning
ఎవరైతే నీ కనులపై నుంచి
నువ్వు మారావో
ఎవరి కోసం అయితే
నువ్వు శబ్ధాన్ని వీడి
నిశ్శబ్దపు ఎదురు చూపువి అయ్యావో
వాళ్ళే, వాళ్ళే
తనువుతోనో, కరుణతోనో
ఉంటూనో లేకుండానో
రహస్యంగానో బహిరంగంగానో
నిన్ను రాత్రుళ్ళుకూ గాలులకూ
ఉరివేస్తారు
నీ హృదయాన్ని చీల్చి, ప్రేమగా
నింపాదిగా నములుతారు-
స్నేహితుడా, కొద్దిగా జాగ్రత్త!
.. వేకువ కన్నీటి తెరలను తొలగించారో
ఎవరైతే నిన్ను దగ్గరగా హత్తుకుని
ఎవరిగా అయితేఎవరైతే నిన్ను దగ్గరగా హత్తుకుని
... రాతి మార్గాలలో నీకు పూలను పరిచారో
ఎవరైతే నీ పెదాలపై చిరునవ్వై
ఎవరైతే నీ పెదాలపై చిరునవ్వై
.......... వేళ్ళతో నీ చేత
పదాల తోటలను విరబూయించారో
ఎవరైతే నువ్వైయ్యారో
పదాల తోటలను విరబూయించారో
ఎవరైతే నువ్వైయ్యారో
నువ్వు మారావో
ఎవరి కోసం అయితే
నువ్వు శబ్ధాన్ని వీడి
నిశ్శబ్దపు ఎదురు చూపువి అయ్యావో
వాళ్ళే, వాళ్ళే
తనువుతోనో, కరుణతోనో
ఉంటూనో లేకుండానో
రహస్యంగానో బహిరంగంగానో
నిన్ను రాత్రుళ్ళుకూ గాలులకూ
ఉరివేస్తారు
నీ హృదయాన్ని చీల్చి, ప్రేమగా
నింపాదిగా నములుతారు-
స్నేహితుడా, కొద్దిగా జాగ్రత్త!
04 May 2012
నీకై 12*
విచ్చుకుంటున్న అర మల్లె మొగ్గలో నీ మోమును చూసాను
పడగ విప్పిన త్రాచులో నీ నీడను కలగన్నాను
నిదురను నీ కనురెప్పల ద్వారాల వద్ద కాపలా ఉంచాను
మెలుకువను నీ బాహువుల ప్రాంగణంలో నిదుర పుచ్చాను
ఎదురపడిన ప్రతి స్త్రీలో నిన్నే చూసాను
ప్రతి స్త్రీకీ పదాల ధూపంతో నీ పవిత్ర నామ స్మరణమే చేసాను
ఇల్లిల్లూ తిరిగాను, వీధులన్నిటినీ అడిగాను
పక్షుల రెక్కలపై ఆకాశానికి ఎగిరాను
పగటి రహస్యం తెలిసిన రాత్రి జాబిలినీ
రాత్రి మర్మం తెలిసిన పగటి సూర్యరశ్మినీ అడిగాను
నీవు ఉండే చోటు చెప్పమని, నిన్నోమారు
కలగానైనా, ఖడ్గంగానైనా చూపించమని
నీ శరీరపు జ్ఞాపకంతో
మొగలి పూల మోహపు అత్తరుని తయారు చేసాను
నీ హృదయపు సంజ్ఞతో
పాలరాతి మహల్లుని మించిన తపనని సృష్టించాను
నీ పెదాలతో నమాజు చేసాను, పవిత్ర పదాలను పలికాను
నీ అరచేతులకై
నా ఇంటి ముందు కన్నీటి తెరలను అల్లాను
నీ పాదాలకి వాటిని కాలి పట్టాలుగా తొడిగాను
అడిగిన ప్రతి వెధవకీ
నీవు లేని నా మొండి చేతులను చూయించాను
నెత్తురుతో నా అరచేతులను
నీ చేతులకు గాజులుగా మలిచాను
నిప్పుని అయ్యాను నీరుని అయ్యాను
నింగిని అయ్యాను గాలిని అయ్యాను
ఇరువై నాలుగు గంటల రాత్రయ్యాను
ఒక స్వపిపాసినీ స్వద్వేషినీ అయ్యాను
నీ చుట్టూతే తిరుగుతూ ఒక చితి మధుశాలనయ్యి
నీ నిండైన వదనపు
వెన్నెల మధుపాత్రకే బలి అయ్యాను, దహించుక పోయాను
ఫరీదా, యిక యింతకంటే
ఎక్కువ చెప్పడం నిషిద్ధం
ఎందుకంటే
తిరిగిన చోటూ, తిరగని చోటూ అంటూ ఏదీ లేదు-
అన్ని చోటులా ఉంటూ
కనిపించక అనుభూతమయ్యే దానివి నువ్వే అని
అల్లాహ్ కీ నాకూ తప్ప
మరింకెవరికి తెలుసు?

03 May 2012
అంతే!
పాడుబడిన బావి తొవ్వలో
నిండా విరిసిన గన్నేరు పూలను చూసావా ఎన్నడైనా?
గమ్మత్తుగా గుర్తుకు తెస్తాయి అవి మరి
కొన్ని మహా విషపు ప్రేమలనూ
కొన్ని కారుణ్యం లేని కౌగిళ్ళనూ
తన కాలి పట్టాలనూ, ఆ గోరింటాకు అరచేతులనూ
పూల దండలై నిన్ను చుట్టుకున్న పసి చేతులనూ-
మదిలో
గుబులు గుబులుగా మెసులుతోన్న పావురాళ్ళ అలజడి
శరీరంలో
బెదురు బెదురుగా కదులుతోన్న నల్లటి తెరల సవ్వడి
శ్వేత మేఘ మాలికలై పారుతున్న ఆకాశంలో
విచ్చుకున్న నిండు జాబిలి
నీ మెడ చుట్టూ కృష్ణ సర్పమై బిగుసుకునే ఉరి-
ఏంటంటావా ఇది? ఆహ్ ఏమీలేదు
ఇదంతా, అంతా ఇంతకు మునుపు చూడక
పాడుబడిన బావిలో రాలిన తొవ్వలో
నడుద్దామని బయలుదేరిన జీవికి
ఎదురైన నిండు గన్నేరు పూల వద్ద
ఆగిన పదాల విలాపం
క్షణకాలం మృత్యు విరామం- అంతే!

01 May 2012
ముసలి పసి తండ్రి
ఒస్తాడు అతను
కడసారి చూపుగా మారిన నేను బ్రతికి ఉన్నానో లేదో చూద్దామని
ఒక తండ్రి
దారుల భారంతో కాలం శోకంతో కమిలీ కమిలీ
ఒంటరిగా
వేసవి కాలం వేడిమి గాలితో, పున్నమి రాత్రుళ్ళతో
వడలిన పూల దినాలతో, స్మశానాలయిన బిడ్డలకై
ఒంటరిగా
అలసిన ఆ ముసలి పసి తండ్రి
చిరిగిన చిగురాకుల వంటి కళ్ళతో
పిల్లల్ని కని చేసుకున్న పాపంతో
జీవిత కాటిన్యపు మహా పుణ్యంతో-
ఎవరు చెబుతారు అతనికి
నేను జన్మించగానే అతను
మరణించాడని?

Subscribe to:
Posts (Atom)