28 June 2011

మౌనమీనం

సమీపంలో హృదయంలో
మౌనమీనం కదిలే వేళల్లో

సర్వం నిశ్శబ్దం: సర్వం దగ్ధం

శరీరమొక జలాశయం. నిండి
పోతోంది. దిగులుతో పొంగి

పొరలుతోంది. నీకు తెలుసు.
మళ్ళా వర్షం పడుతుంది

నువ్వొక తపనవై వణుకువై సాగే
సమయం దగ్గరపడుతుంది

మౌనమీనం హృదయంలో గజి
బిజీగా తిరిగే వేళల్లో

సర్వం నిశ్శబ్దం: సర్వం మరణం.

1 comment:

  1. 'మౌనమీనం'బావుంది పదబంధం.ఆ మధ్య ఏదో కవితలో సర్పజాలరి అన్నారు అది కూడా...

    ReplyDelete