నువ్వు ఉంటావని వస్తాను
మృగానికీ నీడ కావాలి
తల దాచుకునే
చోటు ఉండాలి
పూవుల పదాలు
సంజ్ఞల సాగరాలు
నిశ్శబ్ధంపై వాలే
వెన్నెల వర్షం
వెన్నెల్లో చిందులేసే
పిల్లల హర్షం
ఏమీ, ఇవేమీ లేకపోయినా
మృగానికీ మృగమానవుడికి
ఆదిమ జంతువికీ
బ్రతికేందుకూ నిదురించెందుకూ
అనాదిగా
ఇన్ని మాటలు కావాలి
కనీసం నీ నిశ్శబ్ధంమైనా కావాలి:
వెళ్ళకు: ఒక మాటైనా చెప్పకుండా
వెడలిపోకు
హృదయంలో పొద్దుగుంకే వేళయ్యింది
కళ్ళలో దీపం వెలిగించే
ఇంద్రజాలపు సమయమయ్యింది
త్వరగా రా: మృగతృష్ణ వద్దకు
మరచిపోలేని పరిమళపు శరీరంతో=
శ్రీకాంత్!
ReplyDeleteకవిత బాగుండటమే కాక, బ్లాగ్ కూడా చాల చాలా అందంగా వుంది..
పోయెం ఎలా పబ్లిష్ చేయాలో నీ బ్లాగ్ ఒక మోడల్..