16 June 2011

అధముడు

నీ కళ్ళల్లో రెండు నాచు రాళ్ళు
నీ నాలికపై ఏళ్లుగా ఏరుకున్న

నువ్ పేర్చుకున్న, నేర్చుకున్న
బానిస పదాల పాచి

కుదురుగా కూర్చోలేవు
నింపాదిగా మాట్లాడలేవు

కీర్తి కామకుడివి సంపద
మోహితుడివి

ఒక కవితా వాక్యం రాయలేని
అధముడవి
పైగా నువ్వొక కవివి

హృదయమంతా ఈర్ష్య
జీవితమంతా ఒక కక్ష

కళ్ళలో కళ్ళు పెట్టి
చూసావా ఎప్పుడైనా
ఎవరినైనా?
కనీసం నీ బిడ్డను
కావలించున్నావా
మనసారా
ఎప్పుడైనా?

నిరంతరం భయం
నిరంతరం ద్వేషం
నిరంతరం పరనిందా
వ్యసనం=

మూర్ఖుడా పారిపో

నీకు అర్థం కాని
ఈ స్వేఛ్చాలోకం నుంచి
ఈ జ్వలనం నుంచి
ఈ పదాల నుంచి
నా నుంచి

నీకు శ్రద్ధాంజలి
ఘటిస్తున్నాను=

5 comments:

  1. వావ్ .. బలంగా ఉంది.
    వెడలిపో అన్న వాడుకతో బిగి కొంచెం సడలిందేమో.
    అక్కడ "వెళ్ళిపో" అని రాస్తేనే బాగుంటుంది.

    ReplyDelete
  2. wanted to use english words "fucker fuck off" instead of మూర్ఖుడా వెడలిపో. perhaps పారిపో would be a suitable word

    ReplyDelete
  3. srikanth ur verses r great..i think so this is my first opportunity to glance at ur telugu poem..john

    ReplyDelete
  4. is it Nunna John? If so I am damn surprised and damned.

    sreekanth

    ReplyDelete