13 June 2011

ఈ వేళ

తేలిపోతున్నాయి ఆకులు
అలలుగా

నువ్వు ఎక్కడ?
***
ప్రధమ పదాన్ని తాకిన
ప్రధమ పాదం

ఇక నీ పెదవి విచ్చుకుంటుంది
అక్షరం ముంగిట

మల్లెమొగ్గల నవ్వుతో

***

ఆకాశం నిండా మబ్బుల
బాతులు

మైదానం నిండా మెరిసే
చెట్లూ, కొమ్మల్లో

కోతులు, నీటిలో చేపలు=

వాన వచ్చే వేళయ్యింది

వేచిచూసే తల్లితండ్రుల
హృదయాలంతా

చిత్తడి చిత్తడి
చిందర వందర

కనులలో
ఎదురుచూపుల
పూల వాన

***

ఒళ్లంతా ఆకుపచ్చ రంగు
దుస్తులంతా దుమ్ము

మరికాసేపట్లో ఎగురుతాయి
పక్షులు

కేకలతో కిలకిలరావాలతో=

ఇక సూర్యుడు
చిన్నబుచ్చుకునే సమయం
ఆసన్నమయ్యింది=

***

తేలిపోయాయి ఆకులు
అలలుగా

నువ్వు ఎక్కడ?

2 comments:

  1. మళ్ళీ బడికి వెళ్ళడం మొదలైన పిల్లల చిత్రాన్ని అందంగా ఆవిష్కరించారు...

    ReplyDelete
  2. ఈ వేళ బాగుంది
    కనులకు ఇంపుగా
    మనసుకు ఆహ్లాదంగా
    తొలకరి జల్లులకు తడిసి
    ఎగిరే పక్షులవెనుక
    తేలియాడుతూ
    ఎక్కడో ఒకచోట వుండాల్సిందే!

    అభినందనలు

    ReplyDelete