ఆఖరి మాసపు ఆఖరి దినం
సర్దుకుంటున్నాను అన్నిటినీ
నన్ను నేను తప్ప:
ఉన్నాను ఇన్నాళ్ళుగా వాటితో
నేను,నాతో అవి తోడుగా నీడగా
హృదయంలోకి చేరుకున్న బల్ల
కళ్ళలో వేళ్ళూనుకుని ఎదిగిన
చెట్ల సంధ్యకాంతి.మెడ చుట్టూ
మెత్తటి చెయ్యై అల్లుకునే గాలి
పెదాలపై నీటి పరిమళం, ఎదలో
పిట్టల పిక్ పిక్ ల కలవరం
గోడపై మెరిసే గొంగళిపురుగులూ
ఎగిరొచ్చి వాలే పావురాళ్ళూ
గుడ్లున్న గూళ్ళు, గూళ్ళు చెదిరి
పగిలిపోయిన గుప్పెడు కలలు
టపటపా మని రివ్వున నింగికెగసే
కళ్ళలో చినుకులై చిప్పిల్లే పక్షుల
ఎడతెగని రెక్కలు: కొంత రాత్రి
కాంతి కొంత రాతి శాంతి.
వెళ్ళిపోతున్నాను సుదూరంగా
తపిస్తున్నాను వీడిపోలేనంతగా
సర్దుకుంటున్నాను అన్నిటినీ
నన్ను నేను తప్ప
నాకు నేను తప్ప:
=తరువాత, ఆ అతడి తరువాత
చీకట్లు ముసురుకున్న గదిలో
నిలువునా చీలిన తన మదిలో
ఒక దీపం వెలుగుతో కనిపిస్తే
అతడెక్కడో బ్రతికే ఉన్నాడని
అతడెక్కడో పదాలను కూడ
పెడుతున్నాడని గ్రహించండి=
30 June 2011
అంధ అద్దం
నువ్వు ఉంటావని వస్తాను
ఈ అంధ అద్దంలోకి
చూసే కళ్ళు వాళ్ళవి
వినే చెవులు వీళ్ళవి
అద్దంలోంచి అద్దంలోకి
దూసుకువెడుతూ
నా/ఆ ప్రతిధ్వనిని నేనే
వింటాను అతడినై
మాటలను ఇటువంటి
మూగ మాటలను
రాస్తాను మళ్ళా మళ్ళా
తిరిగి రాలేని దారిలో
వేసుకున్న ప్రతిబింబపు
అలంకరణలో=
రా నువ్వు కరిగించిన
మంత్ర దర్పణమై
అద్దాలకు చూపునిచ్చి
ఆకుపచ్చని
రంగు పులుముదాం.
ఈ అంధ అద్దంలోకి
చూసే కళ్ళు వాళ్ళవి
వినే చెవులు వీళ్ళవి
అద్దంలోంచి అద్దంలోకి
దూసుకువెడుతూ
నా/ఆ ప్రతిధ్వనిని నేనే
వింటాను అతడినై
మాటలను ఇటువంటి
మూగ మాటలను
రాస్తాను మళ్ళా మళ్ళా
తిరిగి రాలేని దారిలో
వేసుకున్న ప్రతిబింబపు
అలంకరణలో=
రా నువ్వు కరిగించిన
మంత్ర దర్పణమై
అద్దాలకు చూపునిచ్చి
ఆకుపచ్చని
రంగు పులుముదాం.
29 June 2011
అయిపోయింది
అయిపోయింది. ఇంతకాలం
కాపాడుకున్నాను
నీ కళ్ళను
గూటిలో పొదిగిన
గుడ్లలా
పొదుపుకున్నాను
కప్పుకున్నాను నిన్ను
శరీరాన్ని రెక్కలు చేసి
అందించాను నీ నోటికి
గొంతులో దాచినదానిని
పోరాడాను
ఈకలు విరిగేదాకా
తనువు
రక్తమయ్యేదాకా
నీ కలలని చంపేవాళ్ళతో
సర్పజనులతో
వేటగాళ్ళతో
దాచుకునేందుకు నిన్ను
నా చెంత నా మది కింద:
కొంత అలసిపోయాను
కొంత విరిగిపోయాను
కళ్ళు కానరానంతగా
కరిగిపోయాను:
ఇక కాలిన ఈ చర్మం నుంచి
నీకు కావాల్సిన
ఎముకల్ని తీసుకో.
ఇక నిన్ను నువ్వే
రక్షించుకోవాలి.
కాపాడుకున్నాను
నీ కళ్ళను
గూటిలో పొదిగిన
గుడ్లలా
పొదుపుకున్నాను
కప్పుకున్నాను నిన్ను
శరీరాన్ని రెక్కలు చేసి
అందించాను నీ నోటికి
గొంతులో దాచినదానిని
పోరాడాను
ఈకలు విరిగేదాకా
తనువు
రక్తమయ్యేదాకా
నీ కలలని చంపేవాళ్ళతో
సర్పజనులతో
వేటగాళ్ళతో
దాచుకునేందుకు నిన్ను
నా చెంత నా మది కింద:
కొంత అలసిపోయాను
కొంత విరిగిపోయాను
కళ్ళు కానరానంతగా
కరిగిపోయాను:
ఇక కాలిన ఈ చర్మం నుంచి
నీకు కావాల్సిన
ఎముకల్ని తీసుకో.
ఇక నిన్ను నువ్వే
రక్షించుకోవాలి.
28 June 2011
విజయం
వడలిపోయింది నీ మోములో
ఒక పూవు ఈ పూట
శరీరం జ్వలనమై నాలిక దప్పికై
కళ్ళు ఎడారులలో విలీనమై
రాలిపోయింది నీ మోము
ఈపూట
కిటికీ పక్కన ఎదిగే నీడలలో
బల్లపై మిగిలిన పాత్రలో
ఎక్వరియంలో
చచ్చి తేలుతున్న
చేపపిల్లలో
మంచంపై ముడుచుకుని
ఎక్కిళ్ళతో కలవరిస్తున్న
అశ్రువులైన పిల్లవాడిలో
కుంగిపోయింది నీ మోము
ఈ పూట
ఇక్కడికి రావడమే
నిరుడు జన్మలో
నువ్వు చేసిన పాపం
ఇంకా బ్రతికి ఉండటమే
ఈ జన్మలో
నువ్వు సాధించిన
విజయం
లేవరా నాయనా లే!
లేచి వెళ్లి
నీటిఅద్దంలో
అద్దపు
అక్షరంలో
ముఖాన్ని
ముంచు-
ఒక పూవు ఈ పూట
శరీరం జ్వలనమై నాలిక దప్పికై
కళ్ళు ఎడారులలో విలీనమై
రాలిపోయింది నీ మోము
ఈపూట
కిటికీ పక్కన ఎదిగే నీడలలో
బల్లపై మిగిలిన పాత్రలో
ఎక్వరియంలో
చచ్చి తేలుతున్న
చేపపిల్లలో
మంచంపై ముడుచుకుని
ఎక్కిళ్ళతో కలవరిస్తున్న
అశ్రువులైన పిల్లవాడిలో
కుంగిపోయింది నీ మోము
ఈ పూట
ఇక్కడికి రావడమే
నిరుడు జన్మలో
నువ్వు చేసిన పాపం
ఇంకా బ్రతికి ఉండటమే
ఈ జన్మలో
నువ్వు సాధించిన
విజయం
లేవరా నాయనా లే!
లేచి వెళ్లి
నీటిఅద్దంలో
అద్దపు
అక్షరంలో
ముఖాన్ని
ముంచు-
అంతిమ ధర్మం-
ఆశించేవి ఏవి నీవు?
శాసించని మాటలు
కావాలి నీకు
వాక్యాల మధ్య మెదిలే
నిశ్శబ్ధం కావాలి నీకు
నిర్మలమైన స్పర్శ
నిర్మోహమైన నిద్ర
కారుణ్యకర్త కావాలి నీకు
=నీ నుంచి నీ వద్దకు
రాళ్ళ వంతెన అల్లుకో
కళ్ళలోని మంచుని
దివిటీగా మార్చుకో=
నువ్వు ఇక్కడికి రావడమే
ఒక గత జన్మ ద్రోహం
ఎవరూ ఆశించని పూలు
వికసించాయి దారి పక్కన
దారితప్పిన వాడివి
దారి పక్కన వాడిన
పూలను ఏరుకుని
నిష్క్రమించడమే
అంతిమ ధర్మం-
శాసించని మాటలు
కావాలి నీకు
వాక్యాల మధ్య మెదిలే
నిశ్శబ్ధం కావాలి నీకు
నిర్మలమైన స్పర్శ
నిర్మోహమైన నిద్ర
కారుణ్యకర్త కావాలి నీకు
=నీ నుంచి నీ వద్దకు
రాళ్ళ వంతెన అల్లుకో
కళ్ళలోని మంచుని
దివిటీగా మార్చుకో=
నువ్వు ఇక్కడికి రావడమే
ఒక గత జన్మ ద్రోహం
ఎవరూ ఆశించని పూలు
వికసించాయి దారి పక్కన
దారితప్పిన వాడివి
దారి పక్కన వాడిన
పూలను ఏరుకుని
నిష్క్రమించడమే
అంతిమ ధర్మం-
మృగతృష్ణ
నువ్వు ఉంటావని వస్తాను
మృగానికీ నీడ కావాలి
తల దాచుకునే
చోటు ఉండాలి
పూవుల పదాలు
సంజ్ఞల సాగరాలు
నిశ్శబ్ధంపై వాలే
వెన్నెల వర్షం
వెన్నెల్లో చిందులేసే
పిల్లల హర్షం
ఏమీ, ఇవేమీ లేకపోయినా
మృగానికీ మృగమానవుడికి
ఆదిమ జంతువికీ
బ్రతికేందుకూ నిదురించెందుకూ
అనాదిగా
ఇన్ని మాటలు కావాలి
కనీసం నీ నిశ్శబ్ధంమైనా కావాలి:
వెళ్ళకు: ఒక మాటైనా చెప్పకుండా
వెడలిపోకు
హృదయంలో పొద్దుగుంకే వేళయ్యింది
కళ్ళలో దీపం వెలిగించే
ఇంద్రజాలపు సమయమయ్యింది
త్వరగా రా: మృగతృష్ణ వద్దకు
మరచిపోలేని పరిమళపు శరీరంతో=
మృగానికీ నీడ కావాలి
తల దాచుకునే
చోటు ఉండాలి
పూవుల పదాలు
సంజ్ఞల సాగరాలు
నిశ్శబ్ధంపై వాలే
వెన్నెల వర్షం
వెన్నెల్లో చిందులేసే
పిల్లల హర్షం
ఏమీ, ఇవేమీ లేకపోయినా
మృగానికీ మృగమానవుడికి
ఆదిమ జంతువికీ
బ్రతికేందుకూ నిదురించెందుకూ
అనాదిగా
ఇన్ని మాటలు కావాలి
కనీసం నీ నిశ్శబ్ధంమైనా కావాలి:
వెళ్ళకు: ఒక మాటైనా చెప్పకుండా
వెడలిపోకు
హృదయంలో పొద్దుగుంకే వేళయ్యింది
కళ్ళలో దీపం వెలిగించే
ఇంద్రజాలపు సమయమయ్యింది
త్వరగా రా: మృగతృష్ణ వద్దకు
మరచిపోలేని పరిమళపు శరీరంతో=
మౌనమీనం
సమీపంలో హృదయంలో
మౌనమీనం కదిలే వేళల్లో
సర్వం నిశ్శబ్దం: సర్వం దగ్ధం
శరీరమొక జలాశయం. నిండి
పోతోంది. దిగులుతో పొంగి
పొరలుతోంది. నీకు తెలుసు.
మళ్ళా వర్షం పడుతుంది
నువ్వొక తపనవై వణుకువై సాగే
సమయం దగ్గరపడుతుంది
మౌనమీనం హృదయంలో గజి
బిజీగా తిరిగే వేళల్లో
సర్వం నిశ్శబ్దం: సర్వం మరణం.
మౌనమీనం కదిలే వేళల్లో
సర్వం నిశ్శబ్దం: సర్వం దగ్ధం
శరీరమొక జలాశయం. నిండి
పోతోంది. దిగులుతో పొంగి
పొరలుతోంది. నీకు తెలుసు.
మళ్ళా వర్షం పడుతుంది
నువ్వొక తపనవై వణుకువై సాగే
సమయం దగ్గరపడుతుంది
మౌనమీనం హృదయంలో గజి
బిజీగా తిరిగే వేళల్లో
సర్వం నిశ్శబ్దం: సర్వం మరణం.
ఓటమి ౧.
వస్తుంది అది నీ వద్దకు
వేయి కాళ్ళ పురుగు
నీ నీడవలె చీకటిగా చిక్కగా
నిన్ను తినివేసేందుకు
పాదాలనునుంచి పదాలు లేని
భాషై వేయి నాలికలతో
చుట్టుకుంటోంది నిన్ను.
బండబారుతున్నాయి పెదాలు
విరిగిపోయి చినుకులుగా
చిట్లుతున్నాయి నయనాలు
ఒక ఇనుప ముద్ర పడుతోంది
నీ హృదయంపై జ్వలనమై
నవ్వుతోంది ప్రపంచం నీ ముఖాన
వికసించిన నిస్సహాయతపై
పారిపోలేవు ఎక్కడికీ
దాచలేవు నీలోని
ఎవ్వరినీ
చర్మం కింద పాకుతోంది.
రక్తాన్ని పీలుస్తో
సాగుతోంది
వేయి దంతాల విషపురుగు:
ఒరే నాయనా! చచ్చిపోకు.
నువ్వొక వెయ్యి రెక్కలతో
ఎగిరిపోయేదాకా
కాస్త బ్రతికి ఉండు. ఈ లోకాన్ని
పరిహసించే క్షణం
త్వరలో రానుంది.
వేయి కాళ్ళ పురుగు
నీ నీడవలె చీకటిగా చిక్కగా
నిన్ను తినివేసేందుకు
పాదాలనునుంచి పదాలు లేని
భాషై వేయి నాలికలతో
చుట్టుకుంటోంది నిన్ను.
బండబారుతున్నాయి పెదాలు
విరిగిపోయి చినుకులుగా
చిట్లుతున్నాయి నయనాలు
ఒక ఇనుప ముద్ర పడుతోంది
నీ హృదయంపై జ్వలనమై
నవ్వుతోంది ప్రపంచం నీ ముఖాన
వికసించిన నిస్సహాయతపై
పారిపోలేవు ఎక్కడికీ
దాచలేవు నీలోని
ఎవ్వరినీ
చర్మం కింద పాకుతోంది.
రక్తాన్ని పీలుస్తో
సాగుతోంది
వేయి దంతాల విషపురుగు:
ఒరే నాయనా! చచ్చిపోకు.
నువ్వొక వెయ్యి రెక్కలతో
ఎగిరిపోయేదాకా
కాస్త బ్రతికి ఉండు. ఈ లోకాన్ని
పరిహసించే క్షణం
త్వరలో రానుంది.
25 June 2011
ఈ/ఆ సాయంత్రం
ఊగుతున్నాయి చెట్లు లోపల
అశోకా వృక్షాలపై సాయంత్రపు
వలయాల కాంతి
చర్మం పిగిలి ఎగిరిపోయేటట్టు
వీస్తోంది గాలి లోపల
అదే గాలి. గత జన్మలో నిను
తాకిన హిమవనపు గాలి
నారింజ తొనకల ఆకాశంలోంచి
దిగి వస్తుంది
ఒక పురాతన స్మృతి. అది
నిన్ను దహించివేస్తుందా
అక్కున చేర్చుకుంటుందా?
అప్పుడే చెప్పలేను
మరొక వాన కురియబోతోంది
లోపల. కళ్ళంతా జల్లు
ఒళ్లంతా విచ్చుకుంటున్న
దిగులు పూలు
ఎక్కడికి వెళ్ళావ్ చెప్పకుండా?
అశోకా వృక్షాలపై సాయంత్రపు
వలయాల కాంతి
చర్మం పిగిలి ఎగిరిపోయేటట్టు
వీస్తోంది గాలి లోపల
అదే గాలి. గత జన్మలో నిను
తాకిన హిమవనపు గాలి
నారింజ తొనకల ఆకాశంలోంచి
దిగి వస్తుంది
ఒక పురాతన స్మృతి. అది
నిన్ను దహించివేస్తుందా
అక్కున చేర్చుకుంటుందా?
అప్పుడే చెప్పలేను
మరొక వాన కురియబోతోంది
లోపల. కళ్ళంతా జల్లు
ఒళ్లంతా విచ్చుకుంటున్న
దిగులు పూలు
ఎక్కడికి వెళ్ళావ్ చెప్పకుండా?
24 June 2011
దూరం
ఇద్దరి మధ్యా శిల్ప తెరే దూరం
విద్యుత్ కాంతి తెరలో
అశ్రువులే కనిపించవు
విడిపోయి ఉన్నాం
విదేహాలమై తాకని
విశ్వాలమై=
ఇదిగో ఈ నిప్పుని తీసుకో
దగ్ధం చేయి
దహించివేస్తున్న దూరాన్ని
దూరంగా=
విద్యుత్ కాంతి తెరలో
అశ్రువులే కనిపించవు
విడిపోయి ఉన్నాం
విదేహాలమై తాకని
విశ్వాలమై=
ఇదిగో ఈ నిప్పుని తీసుకో
దగ్ధం చేయి
దహించివేస్తున్న దూరాన్ని
దూరంగా=
మధువు దీపం వెలిగించిన వాడికి
మధువు దీపం వెలిగించిన వాడికి
లోకమంతా రంగుల కాంతి
అయ్యింది శరీరమొక విశ్వం. చేరినాయి
చెవిలో చిందులేసే చినుక్ చినుక్ శబ్ధాలు
మొగలి పూలై అల్లుకున్నాయి నక్షత్రాలు.
మధుపాత్రలో వెలిగిన చంద్రుడిలో
కనిపిస్తున్నాయి అస్థిత్వపు రహస్యాలు:
చెట్లలో ముడుచుకున్న పక్షులు
పక్షుల కలలని చుట్టుకున్న త్రాచులు
ఏటి ఒడ్దున ఏక్ ఏక్ మంటో కప్పలు=
మూసుకున్న కళ్ళ కింద గుమికూడే
స్నేహితులూ రహస్య రూపాలూ
చీకట్లో వీచే చల్లటి వర్షాకాలపు తొలి గాలిలో
చేతిపై లీలగా సోకుతున్న తన పెదాలు
వలయమైపోతున్నది అతడి మనస్సు
వివశితమైపోతున్నది అతడి వయస్సు
పాత్రలు ధరించని మధుపాత్రా సమయంలో
కరిగిపోతోన్నది అతడి నయనం
మధువు జ్వలనంలో దహించిన వాడికి
తన లోకమంతా వెన్నెల కాంతి
ఇక బయట ప్రపంచంతో అతడికి ఏమి
సంబంధం? ఇక బయటి మనుషులతో
అతడికి ఏమి ఏమి అవసరం?
లోకమంతా రంగుల కాంతి
అయ్యింది శరీరమొక విశ్వం. చేరినాయి
చెవిలో చిందులేసే చినుక్ చినుక్ శబ్ధాలు
మొగలి పూలై అల్లుకున్నాయి నక్షత్రాలు.
మధుపాత్రలో వెలిగిన చంద్రుడిలో
కనిపిస్తున్నాయి అస్థిత్వపు రహస్యాలు:
చెట్లలో ముడుచుకున్న పక్షులు
పక్షుల కలలని చుట్టుకున్న త్రాచులు
ఏటి ఒడ్దున ఏక్ ఏక్ మంటో కప్పలు=
మూసుకున్న కళ్ళ కింద గుమికూడే
స్నేహితులూ రహస్య రూపాలూ
చీకట్లో వీచే చల్లటి వర్షాకాలపు తొలి గాలిలో
చేతిపై లీలగా సోకుతున్న తన పెదాలు
వలయమైపోతున్నది అతడి మనస్సు
వివశితమైపోతున్నది అతడి వయస్సు
పాత్రలు ధరించని మధుపాత్రా సమయంలో
కరిగిపోతోన్నది అతడి నయనం
మధువు జ్వలనంలో దహించిన వాడికి
తన లోకమంతా వెన్నెల కాంతి
ఇక బయట ప్రపంచంతో అతడికి ఏమి
సంబంధం? ఇక బయటి మనుషులతో
అతడికి ఏమి ఏమి అవసరం?
పసరిక పాము
అక్కడే ఉంటుంది అది పచ్చగా
హృదయాన్ని చుట్టుకుని-
బచ్చలి ఆకుల అరచేతులలో
పొదిగిన పచ్చదీపం అది
పచ్చటి కాంతి పచ్చటి భాషా
దానిది. నింపాదిగా
కదులుతోంది. అంతలోనే ఆగి
తల తిప్పి నీ వైపు చూస్తోంది
నీవంటి పసరిక పాము:
పూలనూ ముళ్లనూ
జన్మిస్తోన్న ఆకులనూ
మెత్తగా తాకే
నీవంటి పసరిక పాము: ఇంతకు
మునుపు చూసావా దానిని?
ఎవరికీ హానీ చేయని, అలా తన
లోకంలో తాను సాగిపోయే
రూప లావణ్యమైన పసరిక
శాంతిని? దాని కళ్ళలోని
కాంతి ప్రపంచాల్ని?
స్వప్నించావు నువ్వు దానిని
స్పర్శించావు నువ్వు దానిని
అల్లుకున్న పొదరిల్లు కింద
దానితో కదులుతూ
అనేక మార్లు గమనించావు
పూల మధ్య ఆకుపచ్చ దారమై
వేలాడే దాని సొగసులని
వంకీలు తిరిగే దాని కదలికల్ని=
చిన్నవాడివి అప్పుడు నీవు
చింతలేనివాడివి అప్పుడు నీవు
సర్పప్రపంచంలో సర్పమై
తిరుగాడే బాలుడవి నీవు
దినాలు గడిచినాయి ఋతువులు
చేజారినాయి. అక్కడే
ఉంటుంది అనుకున్న పచ్చటి
పసరిక పాముని
నీ హృదయంలోంచి నిర్ధయగా
వెలుపలికి లాగి కర్రలతో
నుజ్జునుజ్జు చేసారెవరో
వెళ్లి చూడు రహదారి పక్కగా
చచ్చి పచ్చిగా పడి ఉన్న
వంకీలు తిరిగిన
కనులు చిట్లిన
అతడి శరీరాన్ని=
హృదయాన్ని చుట్టుకుని-
బచ్చలి ఆకుల అరచేతులలో
పొదిగిన పచ్చదీపం అది
పచ్చటి కాంతి పచ్చటి భాషా
దానిది. నింపాదిగా
కదులుతోంది. అంతలోనే ఆగి
తల తిప్పి నీ వైపు చూస్తోంది
నీవంటి పసరిక పాము:
పూలనూ ముళ్లనూ
జన్మిస్తోన్న ఆకులనూ
మెత్తగా తాకే
నీవంటి పసరిక పాము: ఇంతకు
మునుపు చూసావా దానిని?
ఎవరికీ హానీ చేయని, అలా తన
లోకంలో తాను సాగిపోయే
రూప లావణ్యమైన పసరిక
శాంతిని? దాని కళ్ళలోని
కాంతి ప్రపంచాల్ని?
స్వప్నించావు నువ్వు దానిని
స్పర్శించావు నువ్వు దానిని
అల్లుకున్న పొదరిల్లు కింద
దానితో కదులుతూ
అనేక మార్లు గమనించావు
పూల మధ్య ఆకుపచ్చ దారమై
వేలాడే దాని సొగసులని
వంకీలు తిరిగే దాని కదలికల్ని=
చిన్నవాడివి అప్పుడు నీవు
చింతలేనివాడివి అప్పుడు నీవు
సర్పప్రపంచంలో సర్పమై
తిరుగాడే బాలుడవి నీవు
దినాలు గడిచినాయి ఋతువులు
చేజారినాయి. అక్కడే
ఉంటుంది అనుకున్న పచ్చటి
పసరిక పాముని
నీ హృదయంలోంచి నిర్ధయగా
వెలుపలికి లాగి కర్రలతో
నుజ్జునుజ్జు చేసారెవరో
వెళ్లి చూడు రహదారి పక్కగా
చచ్చి పచ్చిగా పడి ఉన్న
వంకీలు తిరిగిన
కనులు చిట్లిన
అతడి శరీరాన్ని=
22 June 2011
పూవుని తెంపిన చేతులు
కొండను తీసుకువెళ్ళే నల్లని
మబ్బులు. పచ్చికలో
పరిగెత్తే తెల్లని పిల్లలు. నల్లని
చందమామలు
సంధ్యాకాశం విసిరిన వర్షపు
వలలో: హృదయమంతా
కురుస్తోన్న వెన్నెల జల్లు:
అవును. ఇప్పుడే నువ్వు
ఒక వస్త్రంతో పరిగెత్తుకుంటూ
పిల్లల వద్దకు వెళ్ళాలి
తడవకుండా వాళ్ళని ఇంటికి
చేర్చాలి: వాళ్ళతో పాటు
పూలను తెంపిన తన
చేతివేళ్ళలోకీ
నునువెచ్చని
బాహువులలోకీ
ఇంకో జన్మలోకీ
మౌనంగా ఒదిగిపోవాలి.
మబ్బులు. పచ్చికలో
పరిగెత్తే తెల్లని పిల్లలు. నల్లని
చందమామలు
సంధ్యాకాశం విసిరిన వర్షపు
వలలో: హృదయమంతా
కురుస్తోన్న వెన్నెల జల్లు:
అవును. ఇప్పుడే నువ్వు
ఒక వస్త్రంతో పరిగెత్తుకుంటూ
పిల్లల వద్దకు వెళ్ళాలి
తడవకుండా వాళ్ళని ఇంటికి
చేర్చాలి: వాళ్ళతో పాటు
పూలను తెంపిన తన
చేతివేళ్ళలోకీ
నునువెచ్చని
బాహువులలోకీ
ఇంకో జన్మలోకీ
మౌనంగా ఒదిగిపోవాలి.
మరో ముఖం
నువొక్కడివే వచ్చావా ఇక్కడికి
ఒక్కడితోనే?
చారెడు నేలలో దాగున్నాయ్
పూర్వీకుల కంకాళాలు
పుప్పొడిలో ఎముకల భస్మాన్ని
వెదజల్లుతూ ఉన్నాయ్
వారి నిలువ నీడ లేని కలలు
ఆత్మపద్మాన్ని చూసిన వాళ్ళు
అవతలి తీరం చేరిన వాళ్ళు
నేలనాలిక పై బీజాక్షరమై వెలిగి
నింగిలోకి ఎగిసిన వాళ్ళు
నువ్వొక్కడివే తెచ్చావా ఇక్కడికి
ఒక పదాన్ని?
తల ఎత్తి చూడు
తల దించి చూడు
ఎదురుగా పడగ విప్పిన నీడలో
మృత్యుదర్పణంలో
నవ్వుతోన్న నీ మరో ముఖాన్ని:
ఒక్కడితోనే?
చారెడు నేలలో దాగున్నాయ్
పూర్వీకుల కంకాళాలు
పుప్పొడిలో ఎముకల భస్మాన్ని
వెదజల్లుతూ ఉన్నాయ్
వారి నిలువ నీడ లేని కలలు
ఆత్మపద్మాన్ని చూసిన వాళ్ళు
అవతలి తీరం చేరిన వాళ్ళు
నేలనాలిక పై బీజాక్షరమై వెలిగి
నింగిలోకి ఎగిసిన వాళ్ళు
నువ్వొక్కడివే తెచ్చావా ఇక్కడికి
ఒక పదాన్ని?
తల ఎత్తి చూడు
తల దించి చూడు
ఎదురుగా పడగ విప్పిన నీడలో
మృత్యుదర్పణంలో
నవ్వుతోన్న నీ మరో ముఖాన్ని:
21 June 2011
ఎక్వేరియం
రాళ్ళు. వంకీల రాళ్ళు.
అవి కళ్ళు.
చూపొక వలయం. రాతి
వంకీల వలయం
తిరిగి వస్తుంది. తిరిగి
తిరిగి వస్తుంది
ఇక్కడికే. అక్కడకే
ఇసుకనోటిలో చిక్కిన
చేపలోకి
చేప శ్వాసలో ఎగిసే
భాషలోకి:
భగవంతుడా
పగిలిన అద్దంలో
చిట్లిన పెదాలలో
పదాలు, పలుక
లేని పదాలు
పలుకే లేని పదాలు
మూర్చిల్లుతున్నాయ్
పిల్లలు తాకిన
పదాలనీ
చేపల్నీ
ఇంద్రధనుస్సుల
నీడలలో
ఆడనివ్వు=
అవి కళ్ళు.
చూపొక వలయం. రాతి
వంకీల వలయం
తిరిగి వస్తుంది. తిరిగి
తిరిగి వస్తుంది
ఇక్కడికే. అక్కడకే
ఇసుకనోటిలో చిక్కిన
చేపలోకి
చేప శ్వాసలో ఎగిసే
భాషలోకి:
భగవంతుడా
పగిలిన అద్దంలో
చిట్లిన పెదాలలో
పదాలు, పలుక
లేని పదాలు
పలుకే లేని పదాలు
మూర్చిల్లుతున్నాయ్
పిల్లలు తాకిన
పదాలనీ
చేపల్నీ
ఇంద్రధనుస్సుల
నీడలలో
ఆడనివ్వు=
స్థితి
రంగుల వర్షం కురుస్తోంది
నిరవధికంగా
పాలరాతిని నీ నాచు ఛాతిని
ఏ చినుకూ తాకలేదు
శిలలైన ఆకులు నీ కళ్ళు
వీచే గాలి నీది కాదు
వెళ్ళే కథ నీది కాదు
అరణ్యాలలో శిధిలాలు
నీటిగర్భాన చలించే
నగరాలు
ఏ ధ్వనీ ప్రతిధ్వనీ
తాకింది నిన్ను?
ధగ్ధమయ్యే గూటితోటలో
మిగిలిపోయిన
చిలకలు వాళ్ళు.
చిన్నారులు వాళ్ళు
చీకటి చుట్టుకున్న
చిరుదీపాలు వాళ్ళు.
తేలుకుంటూ వస్తోంది
మృతవనాలకుపైగా
నువ్ తాకని చర్మం .
గుర్తుపట్టావా
చెట్ల మధ్య ఊగిసలాడే
గాలి ఎలా
మౌనంగా
మారుతుందో?
నిరవధికంగా
పాలరాతిని నీ నాచు ఛాతిని
ఏ చినుకూ తాకలేదు
శిలలైన ఆకులు నీ కళ్ళు
వీచే గాలి నీది కాదు
వెళ్ళే కథ నీది కాదు
అరణ్యాలలో శిధిలాలు
నీటిగర్భాన చలించే
నగరాలు
ఏ ధ్వనీ ప్రతిధ్వనీ
తాకింది నిన్ను?
ధగ్ధమయ్యే గూటితోటలో
మిగిలిపోయిన
చిలకలు వాళ్ళు.
చిన్నారులు వాళ్ళు
చీకటి చుట్టుకున్న
చిరుదీపాలు వాళ్ళు.
తేలుకుంటూ వస్తోంది
మృతవనాలకుపైగా
నువ్ తాకని చర్మం .
గుర్తుపట్టావా
చెట్ల మధ్య ఊగిసలాడే
గాలి ఎలా
మౌనంగా
మారుతుందో?
ఆ చేతివేళ్ళు
వెళ్లిపోవాలి పిల్లల కళ్ళలోకి
పదాల పూలహారాల్లోకి
అల్లుకుంటున్నాయి చేతివేళ్లు
వాళ్ళవే రహస్యంగా
నిండైన కొలనులోకి జారినంత
మెత్తటి హాయిగా=
చెప్పరా ఎవరైనా నీకు నీ
హృదయం ముళ్ళపొదని?
నీకు పాదు చేసి నీళ్ళు పోసే
ఆ చేతి వేళ్ళ మధ్య
నువ్ కనులు మూసే క్షణం
ఆసన్నమయ్యింది.
వెళ్ళిపో:
పదాల పూలహారాల్లోకి
అల్లుకుంటున్నాయి చేతివేళ్లు
వాళ్ళవే రహస్యంగా
నిండైన కొలనులోకి జారినంత
మెత్తటి హాయిగా=
చెప్పరా ఎవరైనా నీకు నీ
హృదయం ముళ్ళపొదని?
నీకు పాదు చేసి నీళ్ళు పోసే
ఆ చేతి వేళ్ళ మధ్య
నువ్ కనులు మూసే క్షణం
ఆసన్నమయ్యింది.
వెళ్ళిపో:
ఆ రాత్రుళ్ళు 2.
రాత్రి ఆకు అంచునుంచి రాలుతోంది
ఒక రక్తపు చినుకు
చీకటి బూజు అల్లుకున్న గదిలో
శాపగ్రస్థుడి దిగులు మదిలో
కదులుతోందొక స్త్రీ నయనం
సాగలేని జీవితపు చెమ్మతో=
ఆ రాత్రే, అస్థిత్వంలోకి బాకు
ఒకటి దిగబడి
సుడులు తిరుగుతున్న రాక్షస
రాత్రిలోనే నువ్వు వొచ్చావ్
ఆకాశం నుంచి రాలుతోన్న
కొండచిలువల ధార కింద
అతడు నిస్సహాయంగా అరుస్తో
రోదిస్తోన్న అవిటిరాత్రిలోనే
నువ్ వొచ్చావ్ ఒక దీపాన్ని
దీపపు కాలాన్నీ పుచ్చుకొని
అతడిని పొదివి పుచ్చుకునేందుకు
అతడిలో నీ శరీరాన్ని
వొదివేసేందుకు
నువ్ వొచ్చావ్ చీరికలైన వస్త్రానివై
తెల్లటి పూవువై:
చీకటి బూజులో సాలీడు అతడు
గూడు లేని గూటిలో
ఇరుక్కున్న మిడత అతడు=
నువ్ అతడిని హత్తుకొన్నప్పుడు
కొమ్మలలోని పక్షులు
అలజడిగా కదులాడాయి: దూరాన
పొదలలో సర్పమొకటి
సర్పబాహువులకై
సర్పసుందరమైన లోకంలోకి జారింది
శ్మశాన నిశ్శబ్ధంలోకీ సమాధుల
కరుణలోకీ ఒక నక్షత్ర కాంతి
రాలిపడింది. హంతకులు ముసిరిన
రహదారులలో ఒక తల్లి
అనాధ శిశువుకి స్థన్యంగా మారింది
తనకి తాను గాయంగా మిగిలింది
నువ్ నడచి వచ్చిన రాత్రిగదిలోకి
సర్వ ప్రపంచమూ కదిలింది
నువ్ వచ్చిన దారంతా
నీ నెత్తుటి పాదముద్రలు నువ్ విప్పి
చెప్పలేని చిట్లిన పదపెదాలు
భాష లేదు ఆ రాత్రికి. భావం లేదు
ఆ శోకానికి నా శాపానికీ-
చూడు. నిన్ తలుచుకున్నప్పుడల్లా
ఇప్పటికీ పదాలవెంట
సాగుతోన్న నీ రక్తపు నీడ. నా వెంట
సాగుతోన్న నీ జాడ.
ఇక ఈ వాక్యాంతాన అతడు
శరీరం లేని శరీరమై తిరుగుతాడు
ఒక ఇనుప తోటలో శిధిలమై=
చూసేందుకు నువ్ ఎప్పటికీ రాకు.
ఒక రక్తపు చినుకు
చీకటి బూజు అల్లుకున్న గదిలో
శాపగ్రస్థుడి దిగులు మదిలో
కదులుతోందొక స్త్రీ నయనం
సాగలేని జీవితపు చెమ్మతో=
ఆ రాత్రే, అస్థిత్వంలోకి బాకు
ఒకటి దిగబడి
సుడులు తిరుగుతున్న రాక్షస
రాత్రిలోనే నువ్వు వొచ్చావ్
ఆకాశం నుంచి రాలుతోన్న
కొండచిలువల ధార కింద
అతడు నిస్సహాయంగా అరుస్తో
రోదిస్తోన్న అవిటిరాత్రిలోనే
నువ్ వొచ్చావ్ ఒక దీపాన్ని
దీపపు కాలాన్నీ పుచ్చుకొని
అతడిని పొదివి పుచ్చుకునేందుకు
అతడిలో నీ శరీరాన్ని
వొదివేసేందుకు
నువ్ వొచ్చావ్ చీరికలైన వస్త్రానివై
తెల్లటి పూవువై:
చీకటి బూజులో సాలీడు అతడు
గూడు లేని గూటిలో
ఇరుక్కున్న మిడత అతడు=
నువ్ అతడిని హత్తుకొన్నప్పుడు
కొమ్మలలోని పక్షులు
అలజడిగా కదులాడాయి: దూరాన
పొదలలో సర్పమొకటి
సర్పబాహువులకై
సర్పసుందరమైన లోకంలోకి జారింది
శ్మశాన నిశ్శబ్ధంలోకీ సమాధుల
కరుణలోకీ ఒక నక్షత్ర కాంతి
రాలిపడింది. హంతకులు ముసిరిన
రహదారులలో ఒక తల్లి
అనాధ శిశువుకి స్థన్యంగా మారింది
తనకి తాను గాయంగా మిగిలింది
నువ్ నడచి వచ్చిన రాత్రిగదిలోకి
సర్వ ప్రపంచమూ కదిలింది
నువ్ వచ్చిన దారంతా
నీ నెత్తుటి పాదముద్రలు నువ్ విప్పి
చెప్పలేని చిట్లిన పదపెదాలు
భాష లేదు ఆ రాత్రికి. భావం లేదు
ఆ శోకానికి నా శాపానికీ-
చూడు. నిన్ తలుచుకున్నప్పుడల్లా
ఇప్పటికీ పదాలవెంట
సాగుతోన్న నీ రక్తపు నీడ. నా వెంట
సాగుతోన్న నీ జాడ.
ఇక ఈ వాక్యాంతాన అతడు
శరీరం లేని శరీరమై తిరుగుతాడు
ఒక ఇనుప తోటలో శిధిలమై=
చూసేందుకు నువ్ ఎప్పటికీ రాకు.
20 June 2011
ఆ రాత్రుళ్ళు 1.
ఉన్నాం మనం అప్పుడు ఆకాశంలో
మనలో ఆకాశం తన చీకటి
రంగులేని రాత్రిలోకి కొట్టుకువచ్చాం
మనం ఇద్దరం మన ఇద్దరూ
నా ఒళ్లో కుక్క నీ తలలో
దాని కలలు
మరోవైపు ఆకులను నిమురుతూ
రావిచెట్టుకు పైగా చంద్రుడు
వెన్నెల చినుకులని విసురుతూ
వర్షపు జల్లై ముంగిట రాలుతో
మనలో తనలో నల్లని చంద్రుడు
అందుకే కదా తాగాం మనం
అమృతం కురిసిన
ఆ విషరాత్రిలో
వంకీలు తిరిగిన నాలికతో
తెగిన పదాలతో:
ఇప్పటికీ ఇంత చీకటి ఇన్ని
రంగుల రాత్రి ఆకాశంలో
నీ వొంకర టింకర గీతలు లేక:
లేకపోయినా వొచ్చిపో ఒకసారి
ఒంటరి కుర్చీ ఒకటి
నిశ్శబ్దంతో నిండి
మోయలేని బరువుతో
వొణికిపొతోంది=
మనలో ఆకాశం తన చీకటి
రంగులేని రాత్రిలోకి కొట్టుకువచ్చాం
మనం ఇద్దరం మన ఇద్దరూ
నా ఒళ్లో కుక్క నీ తలలో
దాని కలలు
మరోవైపు ఆకులను నిమురుతూ
రావిచెట్టుకు పైగా చంద్రుడు
వెన్నెల చినుకులని విసురుతూ
వర్షపు జల్లై ముంగిట రాలుతో
మనలో తనలో నల్లని చంద్రుడు
అందుకే కదా తాగాం మనం
అమృతం కురిసిన
ఆ విషరాత్రిలో
వంకీలు తిరిగిన నాలికతో
తెగిన పదాలతో:
ఇప్పటికీ ఇంత చీకటి ఇన్ని
రంగుల రాత్రి ఆకాశంలో
నీ వొంకర టింకర గీతలు లేక:
లేకపోయినా వొచ్చిపో ఒకసారి
ఒంటరి కుర్చీ ఒకటి
నిశ్శబ్దంతో నిండి
మోయలేని బరువుతో
వొణికిపొతోంది=
అప్పుడు గుర్తొస్తావ్
అప్పుడు గుర్తొస్తావ్
కడుపుని నింపుకున్న నీళ్ళు
కళ్ళలో చిప్పిల్లినప్పుడు
చిగురాకు మీద చందమామ
జారి కొలనులో పడినప్పుడు
గాలి గొంతుతో వర్షం చినుక్
చినుక్ మని పాడినప్పుడు
వెల్తురు గోళీలతో పదాలతో
పాపలు గజ్జెలతో ఆడినప్పుడు
తేనెను తాగిన చీమలు
బరువుగా మంచంవైపు
కదులుతున్నప్పుడు
పసి నవ్వు విరగబడినప్పుడు
పొద్దుతిరుగుడు పూలు
అక్కడ వికసించినప్పుడు
లేత కాంతిలో మధువులో
మునిగి ఎవరో పురాకాంతితో
అరచినప్పుడు
రోదించినప్పుడు
మనుషుల కర్మాగారంలో
నిశ్శబ్ధం పదమర్మాగారంలో
మూర్చిల్లినప్పుడు
వదనం అద్దమై
అద్దం వదనమై
ప్రతిబింబాల దంతాల కింద
పగిలిపోతున్నప్పుడు
ఒక్కడినే ఒక్కడినై
పాతాళ లోకాలలోకి వెళ్లి
పోతున్నప్పుడు
అప్పుడు గుర్తొస్తావ్.
ఈ పూట ఇక్కడ నీవు లేవ్
నీ నీడ మాత్రం ఉంది.
కడుపుని నింపుకున్న నీళ్ళు
కళ్ళలో చిప్పిల్లినప్పుడు
చిగురాకు మీద చందమామ
జారి కొలనులో పడినప్పుడు
గాలి గొంతుతో వర్షం చినుక్
చినుక్ మని పాడినప్పుడు
వెల్తురు గోళీలతో పదాలతో
పాపలు గజ్జెలతో ఆడినప్పుడు
తేనెను తాగిన చీమలు
బరువుగా మంచంవైపు
కదులుతున్నప్పుడు
పసి నవ్వు విరగబడినప్పుడు
పొద్దుతిరుగుడు పూలు
అక్కడ వికసించినప్పుడు
లేత కాంతిలో మధువులో
మునిగి ఎవరో పురాకాంతితో
అరచినప్పుడు
రోదించినప్పుడు
మనుషుల కర్మాగారంలో
నిశ్శబ్ధం పదమర్మాగారంలో
మూర్చిల్లినప్పుడు
వదనం అద్దమై
అద్దం వదనమై
ప్రతిబింబాల దంతాల కింద
పగిలిపోతున్నప్పుడు
ఒక్కడినే ఒక్కడినై
పాతాళ లోకాలలోకి వెళ్లి
పోతున్నప్పుడు
అప్పుడు గుర్తొస్తావ్.
ఈ పూట ఇక్కడ నీవు లేవ్
నీ నీడ మాత్రం ఉంది.
వెళ్ళు
ఇక ఎప్పుడూ అడగను
అద్దంలో కనిపించే లోకాలు
తూలె పదాలు
నదిలోకి దుమికే నక్షత్రాలు
నీరు కదులాడే నీ నయనాలు
ముఖసమయాన్ని దాచే
అరచేతులు
ఇక ఎప్పుడూ కలగనను=
వెళ్ళు. రాత్రయింది
దీపం వెలిగించే
కరకు వేళయ్యింది.
అద్దంలో కనిపించే లోకాలు
తూలె పదాలు
నదిలోకి దుమికే నక్షత్రాలు
నీరు కదులాడే నీ నయనాలు
ముఖసమయాన్ని దాచే
అరచేతులు
ఇక ఎప్పుడూ కలగనను=
వెళ్ళు. రాత్రయింది
దీపం వెలిగించే
కరకు వేళయ్యింది.
ప్రశ్నలు
తొడిమ నుంచి వేరైన
మల్లెమొగ్గలు వాళ్ళు
తెంపిందెవరు?
పూలను మరచినది
ఎవరు?
***
గడ్డిలో వానలో గెంతే
కప్పపిల్లలు వాళ్ళు
మరి అతడు
ఎవరు?
***
ఆగి ఉన్న దాగి ఉన్న
రాత్రి సర్పం
చుట్టుకుంటోంది
వలయమై
తన చుట్టూ:
సర్పజాలరి ఎక్కడ?
***
దీపం వెలిగించలేదు
పలుక పదం లేదు
వర్షం ఆగలేదు
కంట నీరు దాగలేదు
ఇన్నాళ్లుగా
ఇంత దుఃఖ౦
ఎప్పుడూ
దిగమింగుకోలేదు:
చీకట్లోకి మసక
చంద్రుడితో
అతడు ఎక్కడ
రాలి పడ్డాడు?
***
పూవు నుంచి వేరైన
ఆకుపచ్చని ముల్లు
అతడు:
ఈదురు గాలుల్లో
నల్లని వెన్నెలలో
హృదయగ్రహణంలో
దారీ తెన్నూ లేని
అతడు:
కోల్పోయినది ఎవరు?
పొందినది ఎవరు?
*
మల్లెమొగ్గలు వాళ్ళు
తెంపిందెవరు?
పూలను మరచినది
ఎవరు?
***
గడ్డిలో వానలో గెంతే
కప్పపిల్లలు వాళ్ళు
మరి అతడు
ఎవరు?
***
ఆగి ఉన్న దాగి ఉన్న
రాత్రి సర్పం
చుట్టుకుంటోంది
వలయమై
తన చుట్టూ:
సర్పజాలరి ఎక్కడ?
***
దీపం వెలిగించలేదు
పలుక పదం లేదు
వర్షం ఆగలేదు
కంట నీరు దాగలేదు
ఇన్నాళ్లుగా
ఇంత దుఃఖ౦
ఎప్పుడూ
దిగమింగుకోలేదు:
చీకట్లోకి మసక
చంద్రుడితో
అతడు ఎక్కడ
రాలి పడ్డాడు?
***
పూవు నుంచి వేరైన
ఆకుపచ్చని ముల్లు
అతడు:
ఈదురు గాలుల్లో
నల్లని వెన్నెలలో
హృదయగ్రహణంలో
దారీ తెన్నూ లేని
అతడు:
కోల్పోయినది ఎవరు?
పొందినది ఎవరు?
*
18 June 2011
ఆఖరి ప్రార్ధన
నీడలతో కూర్చుంటావ్
ఒక్కడివే
నీడలలోని రంగులని
చూద్దామని
రంగులలోని నీటిని
తాకుదామని
ఒక్కడివే నిల్చుంటావు
చీకట్లలో
వెలిగే నయనాలలో
నయనాలలో కదిలే
దూరాలలో
దూరాలలో వెదికే
పద చరణాలతో
ఒక్కడివే తిరుగుతావ్
స్మశానాలన్నీ
చితిమంటలలో ఆదినీ
ఆదిలో రాత్రి అంతాన్నీ
కనుగొంటూ
ఎదురుచూస్తావ్ ఒక్కడివే
ఎవరికోసమో
ఎందుకోసమో=
సరే. రా. వచ్చి కూర్చో.
చీకట్లో రావి ఆకుల
నల్లని చల్లని ఎదలో
దప్పికగొన్న వాళ్ళు
తిరిగివచ్చే వేళయ్యింది
వొదిలివెళ్ళిన వాళ్ళు
తిరుగాడే రహస్య
సమయమయ్యింది
కనిపించని చేతులు
సేద తీర్చే వేళయ్యింది
మిణుగురులతో కళ్ళు
చెట్లల్లో ఎగిరే సమయం
ఆసన్నమయ్యింది
బాకులతో కలలతో
ఖడ్గ దంతాలతో
స్త్రీలు విహరించే
మధు వేళయ్యింది
రా. కూర్చో. హృదయాన్ని
తెరిచి. మరి కొద్దిసేపట్లో
నీడలూ, అద్రుశ్య జాడలూ
నిన్ను భక్షించే
క్రీడావినోదం అస్తిత్వ ఆనందం
మొదలవ్వనుంది.
ఇక నీ ఆఖరి ప్రార్ధన
ఆరంభించు=
ఒక్కడివే
నీడలలోని రంగులని
చూద్దామని
రంగులలోని నీటిని
తాకుదామని
ఒక్కడివే నిల్చుంటావు
చీకట్లలో
వెలిగే నయనాలలో
నయనాలలో కదిలే
దూరాలలో
దూరాలలో వెదికే
పద చరణాలతో
ఒక్కడివే తిరుగుతావ్
స్మశానాలన్నీ
చితిమంటలలో ఆదినీ
ఆదిలో రాత్రి అంతాన్నీ
కనుగొంటూ
ఎదురుచూస్తావ్ ఒక్కడివే
ఎవరికోసమో
ఎందుకోసమో=
సరే. రా. వచ్చి కూర్చో.
చీకట్లో రావి ఆకుల
నల్లని చల్లని ఎదలో
దప్పికగొన్న వాళ్ళు
తిరిగివచ్చే వేళయ్యింది
వొదిలివెళ్ళిన వాళ్ళు
తిరుగాడే రహస్య
సమయమయ్యింది
కనిపించని చేతులు
సేద తీర్చే వేళయ్యింది
మిణుగురులతో కళ్ళు
చెట్లల్లో ఎగిరే సమయం
ఆసన్నమయ్యింది
బాకులతో కలలతో
ఖడ్గ దంతాలతో
స్త్రీలు విహరించే
మధు వేళయ్యింది
రా. కూర్చో. హృదయాన్ని
తెరిచి. మరి కొద్దిసేపట్లో
నీడలూ, అద్రుశ్య జాడలూ
నిన్ను భక్షించే
క్రీడావినోదం అస్తిత్వ ఆనందం
మొదలవ్వనుంది.
ఇక నీ ఆఖరి ప్రార్ధన
ఆరంభించు=
ముఖవ్యసనం
దూసుకురా ముఖాముఖి
వ్యసనంలోకి
పిల్లల్ని వొదిలి పాపల్ని వొదిలి
పూవుల్ని వొదిలి
వర్షపు గాలిని వొదిలి
పదాల సవ్వడిని వీడి
ఈ వ్యసనముఖ ఇనుప
బాహువులలోకి
కరాళ పెదాలలోకి
త్వరగా రా: నీటి పరదాపై
లిల్లీ పూల ముఖాలు
కరుగుతున్నాయ్
వీడిపోతున్నాయ్, కను
మరుగైపోతున్నాయ్=
ఇక నీ ప్రపంచం మొదలయ్యి
రాలిపోయేది ఇక్కడే
అందుకే నీ సమాధికి జ్ఞాపికగా
రెండు పుష్పగుచ్చాలను
నువ్వే నీ వెంట తెచ్చుకో.
ఇదొక ఆదీ అంతం లేని
కనులు చెదిరే
కరకు దంతాల
శ్వేత ఊబి=
వ్యసనంలోకి
పిల్లల్ని వొదిలి పాపల్ని వొదిలి
పూవుల్ని వొదిలి
వర్షపు గాలిని వొదిలి
పదాల సవ్వడిని వీడి
ఈ వ్యసనముఖ ఇనుప
బాహువులలోకి
కరాళ పెదాలలోకి
త్వరగా రా: నీటి పరదాపై
లిల్లీ పూల ముఖాలు
కరుగుతున్నాయ్
వీడిపోతున్నాయ్, కను
మరుగైపోతున్నాయ్=
ఇక నీ ప్రపంచం మొదలయ్యి
రాలిపోయేది ఇక్కడే
అందుకే నీ సమాధికి జ్ఞాపికగా
రెండు పుష్పగుచ్చాలను
నువ్వే నీ వెంట తెచ్చుకో.
ఇదొక ఆదీ అంతం లేని
కనులు చెదిరే
కరకు దంతాల
శ్వేత ఊబి=
17 June 2011
రాయాలనిపించనప్పుడు (or how to write a bad poem 2.)
వెళ్ళిపోయేదేమీ లేదు
ఉంచుకునేదేమీ లేదు
సరే. రాయాలనిపించనప్పుడు
అలా నడువ్ కాసేపు
కొమ్మల మధ్య విచ్చుకున్న
ఎర్రటి పూలు
ఎర్రటి పూలలో చిక్కుకున్న
నీలి ఆకాశం
నీలి ఆకాశంలో పోగవుతున్న
వాన లోకం
పాదాల కింద మట్టిని పాదాలతో
తాకు. పరవాలేదు
పదాలను ఇసుక గూళ్ళలాంటి
పదాలను పిల్లలకి ఇవ్వు
ప్రతీసారీ కవితాత్మకంగా రాయక
మాట్లాడక ఈసారి కొంత
అర్థం అయ్యేటట్టు నలుగురితో
మాట్లాడు. తిరుగు.
కాసేపు నవ్వు. కాసేపు నీతో
గడుపు. పరవాలేదు
ఈ సరళత్వంలో
ఒక తెమ్మర దాగి ఉంది
అది నిన్ను రక్షిస్తుంది
పరవాలేదు
పోయేదేమీ లేదు
వచ్చేదేమీ లేదు
కంగారుపడకు
భీతి చెందకు= వర్షం వచ్చే
వేళయ్యింది. వెళ్లి కిటికీ
తెరువు. నువ్
రాయాలనుకున్నవన్నీ
రాలబోతున్నాయ్.
వేచి చూడు.
ఉంచుకునేదేమీ లేదు
సరే. రాయాలనిపించనప్పుడు
అలా నడువ్ కాసేపు
కొమ్మల మధ్య విచ్చుకున్న
ఎర్రటి పూలు
ఎర్రటి పూలలో చిక్కుకున్న
నీలి ఆకాశం
నీలి ఆకాశంలో పోగవుతున్న
వాన లోకం
పాదాల కింద మట్టిని పాదాలతో
తాకు. పరవాలేదు
పదాలను ఇసుక గూళ్ళలాంటి
పదాలను పిల్లలకి ఇవ్వు
ప్రతీసారీ కవితాత్మకంగా రాయక
మాట్లాడక ఈసారి కొంత
అర్థం అయ్యేటట్టు నలుగురితో
మాట్లాడు. తిరుగు.
కాసేపు నవ్వు. కాసేపు నీతో
గడుపు. పరవాలేదు
ఈ సరళత్వంలో
ఒక తెమ్మర దాగి ఉంది
అది నిన్ను రక్షిస్తుంది
పరవాలేదు
పోయేదేమీ లేదు
వచ్చేదేమీ లేదు
కంగారుపడకు
భీతి చెందకు= వర్షం వచ్చే
వేళయ్యింది. వెళ్లి కిటికీ
తెరువు. నువ్
రాయాలనుకున్నవన్నీ
రాలబోతున్నాయ్.
వేచి చూడు.
వెన్నెల (or how to write a bad poem)
వెన్నెల తిరిగింది
ఇక్కడే
వర్షంలో తడిచి
ఎండలో కరిగి
వెన్నెల ఆడింది
ఇక్కడే
రాత్రొక నయనం
నీటిపుట్టలో గూడు
కట్టుకుని
వెన్నెల కన్నీరు
మున్నీరు
అయ్యింది
ఇక్కడే
వెన్నెల
వెన్నెల లేక
చనిపోయిందీ
ఇక్కడే
ఈ మట్టి మీదే
ఈ దేహం మీదే=
మీరు ఎప్పుడైనా
చంపారా
వెన్నెలని ఇలా?
ఇక్కడే
వర్షంలో తడిచి
ఎండలో కరిగి
వెన్నెల ఆడింది
ఇక్కడే
రాత్రొక నయనం
నీటిపుట్టలో గూడు
కట్టుకుని
వెన్నెల కన్నీరు
మున్నీరు
అయ్యింది
ఇక్కడే
వెన్నెల
వెన్నెల లేక
చనిపోయిందీ
ఇక్కడే
ఈ మట్టి మీదే
ఈ దేహం మీదే=
మీరు ఎప్పుడైనా
చంపారా
వెన్నెలని ఇలా?
16 June 2011
అధముడు
నీ కళ్ళల్లో రెండు నాచు రాళ్ళు
నీ నాలికపై ఏళ్లుగా ఏరుకున్న
నువ్ పేర్చుకున్న, నేర్చుకున్న
బానిస పదాల పాచి
కుదురుగా కూర్చోలేవు
నింపాదిగా మాట్లాడలేవు
కీర్తి కామకుడివి సంపద
మోహితుడివి
ఒక కవితా వాక్యం రాయలేని
అధముడవి
పైగా నువ్వొక కవివి
హృదయమంతా ఈర్ష్య
జీవితమంతా ఒక కక్ష
కళ్ళలో కళ్ళు పెట్టి
చూసావా ఎప్పుడైనా
ఎవరినైనా?
కనీసం నీ బిడ్డను
కావలించున్నావా
మనసారా
ఎప్పుడైనా?
నిరంతరం భయం
నిరంతరం ద్వేషం
నిరంతరం పరనిందా
వ్యసనం=
మూర్ఖుడా పారిపో
నీకు అర్థం కాని
ఈ స్వేఛ్చాలోకం నుంచి
ఈ జ్వలనం నుంచి
ఈ పదాల నుంచి
నా నుంచి
నీకు శ్రద్ధాంజలి
ఘటిస్తున్నాను=
నీ నాలికపై ఏళ్లుగా ఏరుకున్న
నువ్ పేర్చుకున్న, నేర్చుకున్న
బానిస పదాల పాచి
కుదురుగా కూర్చోలేవు
నింపాదిగా మాట్లాడలేవు
కీర్తి కామకుడివి సంపద
మోహితుడివి
ఒక కవితా వాక్యం రాయలేని
అధముడవి
పైగా నువ్వొక కవివి
హృదయమంతా ఈర్ష్య
జీవితమంతా ఒక కక్ష
కళ్ళలో కళ్ళు పెట్టి
చూసావా ఎప్పుడైనా
ఎవరినైనా?
కనీసం నీ బిడ్డను
కావలించున్నావా
మనసారా
ఎప్పుడైనా?
నిరంతరం భయం
నిరంతరం ద్వేషం
నిరంతరం పరనిందా
వ్యసనం=
మూర్ఖుడా పారిపో
నీకు అర్థం కాని
ఈ స్వేఛ్చాలోకం నుంచి
ఈ జ్వలనం నుంచి
ఈ పదాల నుంచి
నా నుంచి
నీకు శ్రద్ధాంజలి
ఘటిస్తున్నాను=
తరువాతి రాత్రి
ఆ తరువాతి రాత్రిలో
నీ శరీరం
ఒకసారి మరొకసారి
ఆకలిగొన్న మృగం
నిను వెంటాడుతుంది
రాత్రి తరువాత రాత్రిలో
మిణుగురులు
మెరుస్తాయ్, రెక్కలు
రాలిపడతాయ్
అతడి నిస్పృహ
నిదురలోకి=
(అలాగే అలాగే
మరొక పగలు
ఎదురౌతుంది
ఎప్పుడూ_)
నీ శరీరం
ఒకసారి మరొకసారి
ఆకలిగొన్న మృగం
నిను వెంటాడుతుంది
రాత్రి తరువాత రాత్రిలో
మిణుగురులు
మెరుస్తాయ్, రెక్కలు
రాలిపడతాయ్
అతడి నిస్పృహ
నిదురలోకి=
(అలాగే అలాగే
మరొక పగలు
ఎదురౌతుంది
ఎప్పుడూ_)
అతడు
కారుణ్యం లేని చోటు నుంచి
నువ్వొక్కడివే నడిచి వస్తావ్
ఆ చీకట్లో ఆ రహదారులలో
వీధి దీపాల కింద
బిక్షగాళ్ళతో పిచ్చివాళ్ళతో
త్రాగుబోతులతో
ఇళ్ళులేని వాళ్ళతో
హృదయంలో లేని గూటితో
కొంత కరుణతో
కొంత శాంతితో
ఈ ప్రపంచం ఇవ్వలేని
ఆలంబనతో
నువ్ ఒక్కడివే నడచి వస్తావ్=
తెలుసా మీకు అంతిమంగా
అతడు ఎలా నిష్క్రమించాడో?
నువ్వొక్కడివే నడిచి వస్తావ్
ఆ చీకట్లో ఆ రహదారులలో
వీధి దీపాల కింద
బిక్షగాళ్ళతో పిచ్చివాళ్ళతో
త్రాగుబోతులతో
ఇళ్ళులేని వాళ్ళతో
హృదయంలో లేని గూటితో
కొంత కరుణతో
కొంత శాంతితో
ఈ ప్రపంచం ఇవ్వలేని
ఆలంబనతో
నువ్ ఒక్కడివే నడచి వస్తావ్=
తెలుసా మీకు అంతిమంగా
అతడు ఎలా నిష్క్రమించాడో?
14 June 2011
రాలేను నేరుగా
రాలేను నేరుగా
ఇంటికైనా ఇతరులలోకైనా
కావాలి కొంత హింస
కొంత అశాంతి
ఉండలేను నిలకడగా
ధరిత్రిపైనైనా పదాలలోనైనా
కావాలి కొంత అలజడి
కొంత అవిశ్రాంతి
సంతోష క్షణాలు వొద్దే వొద్దు
కావాలి ఎప్పటికైనా
అదే దిగులు అదే తపన
అలా వేచి చూస్తూ ఉండు
నీ నిశ్శబ్దంలోకి
నేను నిశ్శబ్దంగా వచ్చే
వేళయ్యింది=
ఇంటికైనా ఇతరులలోకైనా
కావాలి కొంత హింస
కొంత అశాంతి
ఉండలేను నిలకడగా
ధరిత్రిపైనైనా పదాలలోనైనా
కావాలి కొంత అలజడి
కొంత అవిశ్రాంతి
సంతోష క్షణాలు వొద్దే వొద్దు
కావాలి ఎప్పటికైనా
అదే దిగులు అదే తపన
అలా వేచి చూస్తూ ఉండు
నీ నిశ్శబ్దంలోకి
నేను నిశ్శబ్దంగా వచ్చే
వేళయ్యింది=
వాక్య ఋణం
ఎగబాకుతున్నాయ్ ఎద అంతా
నీటి నాలుకలు
తడిచిపోతోంది తరిగిపోతోంది
వొత్తి చివరి మంట
శరీరమంతా
పాకిపోతోంది
తెలుసా నీకు మృత్యు
మోహన గానం?
నీ వరకూ
నా వద్దనుంచి రాని
వాక్య ఋణం?
రాత్రి దాహాన్నై దాహపు
రాత్రినై తిరుగుతున్నాను
పదాలు లేని రహ
దారులలో కదిలే శిలనై.
వెళ్ళకు. ఈ విషాదానికి
ఇప్పుడే నీ పేరు పెట్టాను=
నీటి నాలుకలు
తడిచిపోతోంది తరిగిపోతోంది
వొత్తి చివరి మంట
శరీరమంతా
పాకిపోతోంది
తెలుసా నీకు మృత్యు
మోహన గానం?
నీ వరకూ
నా వద్దనుంచి రాని
వాక్య ఋణం?
రాత్రి దాహాన్నై దాహపు
రాత్రినై తిరుగుతున్నాను
పదాలు లేని రహ
దారులలో కదిలే శిలనై.
వెళ్ళకు. ఈ విషాదానికి
ఇప్పుడే నీ పేరు పెట్టాను=
త్యాగం
దగ్ధమౌతోంది గృహం:
అగ్నికీలల మధ్య
మంచుబొమ్మలు
నిలబడి అద్దం ముందు
గీస్తాయి పదాలను
చిత్ర చిత్రాలను
వేచి చూసే కన్నును
రాని నాన్నను
గడ్డి పరకల మీదుగా
వీచే గాలినూ
ఆగక తేలిపోయే
అగంతక క్షణాలనూ:
ఇక్కడే, ఇక్కడే
తెల్లటి నలుపు
మధ్య
నల్లటి తెలుపు
మధ్య
అసమాన రంగులు
కలగలసిపోయాయి.
ఇక్కడే, ఇక్కడే
ఎదురుచూడు
అతడు వస్తాడు
ఆశ్వాలతో
అతిధులతో
ఆమెతో
తన మృత్యువుతో
అగ్నికీలల మధ్య
మంచుబొమ్మలు
నిలబడి అద్దం ముందు
గీస్తాయి పదాలను
చిత్ర చిత్రాలను
వేచి చూసే కన్నును
రాని నాన్నను
గడ్డి పరకల మీదుగా
వీచే గాలినూ
ఆగక తేలిపోయే
అగంతక క్షణాలనూ:
ఇక్కడే, ఇక్కడే
తెల్లటి నలుపు
మధ్య
నల్లటి తెలుపు
మధ్య
అసమాన రంగులు
కలగలసిపోయాయి.
ఇక్కడే, ఇక్కడే
ఎదురుచూడు
అతడు వస్తాడు
ఆశ్వాలతో
అతిధులతో
ఆమెతో
తన మృత్యువుతో
13 June 2011
నీ మౌనం
ఇనుప గోళ్ళతో నా ఛాతిని
చీల్చుతోంది నీ మౌనం
అందుకు బదులుగా
ఒక పూలపొద వ్యాపిస్తోంది
హృదయంలోంచి=
నిన్ను వదలదు. నీ
సాన్నిహిత్యాన్ని వీడదు
వీడ్కోలు తెలియని
పరిమళం అది
చూడు. నీ చుట్టూతా
తిరిగిన పిట్టలే, పిల్లలే
మళ్ళీ మళ్ళీ
పూల వలయాలై
పూల చుట్టూ
ఆడుతున్నారు=
రా. ఒక పూవు తన
పరిమళాన్ని
నీకు ఇచ్చినందుకు
వడలిపోదు=
చీల్చుతోంది నీ మౌనం
అందుకు బదులుగా
ఒక పూలపొద వ్యాపిస్తోంది
హృదయంలోంచి=
నిన్ను వదలదు. నీ
సాన్నిహిత్యాన్ని వీడదు
వీడ్కోలు తెలియని
పరిమళం అది
చూడు. నీ చుట్టూతా
తిరిగిన పిట్టలే, పిల్లలే
మళ్ళీ మళ్ళీ
పూల వలయాలై
పూల చుట్టూ
ఆడుతున్నారు=
రా. ఒక పూవు తన
పరిమళాన్ని
నీకు ఇచ్చినందుకు
వడలిపోదు=
ఈ వేళ
తేలిపోతున్నాయి ఆకులు
అలలుగా
నువ్వు ఎక్కడ?
***
ప్రధమ పదాన్ని తాకిన
ప్రధమ పాదం
ఇక నీ పెదవి విచ్చుకుంటుంది
అక్షరం ముంగిట
మల్లెమొగ్గల నవ్వుతో
***
ఆకాశం నిండా మబ్బుల
బాతులు
మైదానం నిండా మెరిసే
చెట్లూ, కొమ్మల్లో
కోతులు, నీటిలో చేపలు=
వాన వచ్చే వేళయ్యింది
వేచిచూసే తల్లితండ్రుల
హృదయాలంతా
చిత్తడి చిత్తడి
చిందర వందర
కనులలో
ఎదురుచూపుల
పూల వాన
***
ఒళ్లంతా ఆకుపచ్చ రంగు
దుస్తులంతా దుమ్ము
మరికాసేపట్లో ఎగురుతాయి
పక్షులు
కేకలతో కిలకిలరావాలతో=
ఇక సూర్యుడు
చిన్నబుచ్చుకునే సమయం
ఆసన్నమయ్యింది=
***
తేలిపోయాయి ఆకులు
అలలుగా
నువ్వు ఎక్కడ?
అలలుగా
నువ్వు ఎక్కడ?
***
ప్రధమ పదాన్ని తాకిన
ప్రధమ పాదం
ఇక నీ పెదవి విచ్చుకుంటుంది
అక్షరం ముంగిట
మల్లెమొగ్గల నవ్వుతో
***
ఆకాశం నిండా మబ్బుల
బాతులు
మైదానం నిండా మెరిసే
చెట్లూ, కొమ్మల్లో
కోతులు, నీటిలో చేపలు=
వాన వచ్చే వేళయ్యింది
వేచిచూసే తల్లితండ్రుల
హృదయాలంతా
చిత్తడి చిత్తడి
చిందర వందర
కనులలో
ఎదురుచూపుల
పూల వాన
***
ఒళ్లంతా ఆకుపచ్చ రంగు
దుస్తులంతా దుమ్ము
మరికాసేపట్లో ఎగురుతాయి
పక్షులు
కేకలతో కిలకిలరావాలతో=
ఇక సూర్యుడు
చిన్నబుచ్చుకునే సమయం
ఆసన్నమయ్యింది=
***
తేలిపోయాయి ఆకులు
అలలుగా
నువ్వు ఎక్కడ?
ఈ దినాలు
ప్రతి నిర్మానుష్యపు వీధి చివర చీకట్లో నువ్వు నీకై ఎదురు చూస్తావు. ఓపికగా ఒక ఉన్మాద హంతకుడిలా మాటువేసిన పులిలా నిన్ను నువ్వు భక్షించేందుకై నువ్వు నీకై ఎదురు చూస్తావు.
తెలియనిదానికై తెలిసినదానిని వొదిలివేసి స్వహింసతో గాయపడే మూర్ఖపు జ్ఞానివి నీవు. ఇతరులని సంతకం చేసే ఈ పదాల ప్రపంచపు అద్దాలలో తిరుగాడే దెయ్యానివి నీవు. నీ జీవితం ఎలా గడుస్తున్నదో నీకు తెలుసా?
అసంకల్పితంగా నీ దినాలు గడచిపోతాయి. సంవత్సరాలు దొర్లిపోతాయి. క్రమంగా నీ చర్మం ముడతలుపడి చిక్కగానూ చీకటిగానూ మారుతుంది. నువ్వు జన్మించినప్పుడు
నిన్ను అంటిపెట్టుకుని ఉన్న వాసన ఇప్పటికీ నీ శరీరాన్ని తన మార్మిక హస్తాలతో కప్పి ఉంచుతుంది. ఇక నీ గదిలో అందరికీ తెలిసిన రహస్య అరలలో అస్థిపంజరాలూ పుస్తకాలూ స్నేహితులూ
నిన్ను వొదిలివేసిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా రక్తం నిండిన కనులతో నీపైకి దుమికే స్త్రీలూ దాగి ఉంటారు.నువ్వు ఇప్పటికీ పిచ్చివాళ్ళతోటీ భిక్షగాళ్ళతోటీ
జీవితంచే శిరచ్చేధన కావింపబడి రోదించే మనుషులతో నిండిన నాసిరకపు ఇరానీ హోటళ్ళలో భోజనం చేస్తావు. ఈలోగా పచ్చిరాత్రిలో పచ్చి గాయాల్లా మెరిసే వ్యభిచారిణులు
బయట రహదారుల్లో ఎదురు చూస్తారు. నువ్వు అప్పటికే పదాలను వింటుంటావు: పదాల ప్రతిధ్వనులనూ రక్తమూ అస్థిత్వమూ లేని పునరావృతమయ్యే పురాణాలుగా మారిన పదాలను
పెదాలరహిత ముఖాలలోంచి వాచాకాలలోంచీ వాగ్ధానాలలోంచీ విన్తున్తావు. "లింగరహితాలు" అటువంటి పదాల గురించి నువ్వు అనుకోదగినదల్లా "లింగరహిత పదాలు తల్లులు లేని శిశువులు."
ఇక నీ గది బయట బలిష్టమైన బాహువులతో ఊగే వృక్షాలు, సర్పాలు భక్షించిన పక్షులతో కొమ్మలలోంచి నేల రాలి పగిలిపోయిన అనాధ పక్షి గుడ్లతో ఇంకా జీవంతో చలిస్తూనే ఉంటాయి.
ఈలోగా వృక్షాల మధ్య గుమికూడే నీడలు నీతో సంభాషిస్తాయి. రోదిస్తాయి. రక్తాన్ని స్రవిస్తాయి. నువ్వు చేయగలిగినది ఏమీ లేదు. ఏదైనా ఉంటె అది ఈ ప్రపంచపు మరో అంచు నుంచి నిన్ను చేరుకుంటున్న కుక్క రోదనలా
నువ్వు కూడా నీలో ముడుచుకుని భీతావాహకమైన కనులతో దుఃఖించాలి. ఎవరికి తెలుసు? చనిపోతూనో రోదిస్తూనో ఊళ పెట్టె కుక్క నీవు కాదని ఎవరికి తెలుసు?
శాంతి. అదొక విలాసవంతమైన, నీకు అందని విషయమనీ నీకు ఎప్పటినుంచో తెలుసు. ఇక నీకు ఈ ఒంటరి రాత్రికి మిగిలినదల్లా ఈ రాత్రిని దాటేందుకు ఉన్న ఒక పాత్ర నాసిరకపు మధువు.
నీకై దు:ఖించే స్నేహితుడు మరెక్కడో ఒంటరిగా ఒక పదం అంచున ఒక ఖడ్గం అంచున కొన ఊపిరితో జీవిస్తుంటాడు. అతడు ఇప్పటికీ ఆ ఒకే ఒక్క స్త్రీకై హృదయ కంపనతో అద్దాలలో వెదుకులాడుకుంటాడు.
అతడు శతాబ్దపు సమాధుల మధ్య ఆమెకై తడుముకులాడతాడు. సమయపు ఖడ్గం నిర్భయంగా, అప్రతిహతంగా అతడివైపు దూసుకువస్తుండగా బహుసా మరెంతో సమయం మిగిలి లేదు అతడు శిరచ్చేధం కావింపబడేందుకు
ఆమెకై చెక్కిన పదాలతో సమాధి కావింపబడేందుకు మరెంతో సమయం మిగిలి లేదు. ఇక ఇక్కడ నీవు, ఇతరుల
ఆలోచనలచే శిరచ్చేదం కావింపబడి అన్ని ఇళ్ళ చీకటి గుహలలో ఎదురు చూస్తావు. ఎప్పుడు రాలిపడతావో ఎప్పుడు మరణిస్తావో తెలీక పదాల అంచులను పట్టుకుని కొనఊపిరితో వేలాడతావు.
నీ స్నేహితుడివైపు దూసుకువచ్చే ఆ సమయపు ఖడ్గమే నీ వైపూ నిష్పాక్షికంగా దూసుకువస్తుండగా, తెలియనిదానికై వెదుకుతూ, దాని స్మృతిలో చెక్కిన పదాలతో నువ్వూ సమాధి అయ్యేందుకు మరెంతో సమయం లేదు.
విగ్రహాలు. ప్రతి పదం నువ్వు ప్రార్ధించే ఒక విగ్రహం. ప్రతి పదం నీకై నిన్ను నువ్వు బలి ఇచ్చుకునే శ్వాసించే ఒక శిలావిగ్రహం.
ఏమీ మారలేదు. ఏమీ మారదు కూడా. సంతాపానికై సంతాపం వ్యక్తం చేస్తూ, ఎదురుచూపుకై ఎదురుచూస్తూ, రాయటానికై రాస్తూ,
ముందే ఎన్నిక చేయబడ్డ వాటి మధ్య ఎన్నుకోమంటే ఎవరైనా ఏం చేస్తారు?
(ఆంధ్రజ్యోతి "వివిధ". 03.04.2006. *ఇప్పటికీ ఇన్నేళ్ళ తరువాత కూడా ఏమీ మారినట్టు లేదు*)
తెలియనిదానికై తెలిసినదానిని వొదిలివేసి స్వహింసతో గాయపడే మూర్ఖపు జ్ఞానివి నీవు. ఇతరులని సంతకం చేసే ఈ పదాల ప్రపంచపు అద్దాలలో తిరుగాడే దెయ్యానివి నీవు. నీ జీవితం ఎలా గడుస్తున్నదో నీకు తెలుసా?
అసంకల్పితంగా నీ దినాలు గడచిపోతాయి. సంవత్సరాలు దొర్లిపోతాయి. క్రమంగా నీ చర్మం ముడతలుపడి చిక్కగానూ చీకటిగానూ మారుతుంది. నువ్వు జన్మించినప్పుడు
నిన్ను అంటిపెట్టుకుని ఉన్న వాసన ఇప్పటికీ నీ శరీరాన్ని తన మార్మిక హస్తాలతో కప్పి ఉంచుతుంది. ఇక నీ గదిలో అందరికీ తెలిసిన రహస్య అరలలో అస్థిపంజరాలూ పుస్తకాలూ స్నేహితులూ
నిన్ను వొదిలివేసిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా రక్తం నిండిన కనులతో నీపైకి దుమికే స్త్రీలూ దాగి ఉంటారు.నువ్వు ఇప్పటికీ పిచ్చివాళ్ళతోటీ భిక్షగాళ్ళతోటీ
జీవితంచే శిరచ్చేధన కావింపబడి రోదించే మనుషులతో నిండిన నాసిరకపు ఇరానీ హోటళ్ళలో భోజనం చేస్తావు. ఈలోగా పచ్చిరాత్రిలో పచ్చి గాయాల్లా మెరిసే వ్యభిచారిణులు
బయట రహదారుల్లో ఎదురు చూస్తారు. నువ్వు అప్పటికే పదాలను వింటుంటావు: పదాల ప్రతిధ్వనులనూ రక్తమూ అస్థిత్వమూ లేని పునరావృతమయ్యే పురాణాలుగా మారిన పదాలను
పెదాలరహిత ముఖాలలోంచి వాచాకాలలోంచీ వాగ్ధానాలలోంచీ విన్తున్తావు. "లింగరహితాలు" అటువంటి పదాల గురించి నువ్వు అనుకోదగినదల్లా "లింగరహిత పదాలు తల్లులు లేని శిశువులు."
ఇక నీ గది బయట బలిష్టమైన బాహువులతో ఊగే వృక్షాలు, సర్పాలు భక్షించిన పక్షులతో కొమ్మలలోంచి నేల రాలి పగిలిపోయిన అనాధ పక్షి గుడ్లతో ఇంకా జీవంతో చలిస్తూనే ఉంటాయి.
ఈలోగా వృక్షాల మధ్య గుమికూడే నీడలు నీతో సంభాషిస్తాయి. రోదిస్తాయి. రక్తాన్ని స్రవిస్తాయి. నువ్వు చేయగలిగినది ఏమీ లేదు. ఏదైనా ఉంటె అది ఈ ప్రపంచపు మరో అంచు నుంచి నిన్ను చేరుకుంటున్న కుక్క రోదనలా
నువ్వు కూడా నీలో ముడుచుకుని భీతావాహకమైన కనులతో దుఃఖించాలి. ఎవరికి తెలుసు? చనిపోతూనో రోదిస్తూనో ఊళ పెట్టె కుక్క నీవు కాదని ఎవరికి తెలుసు?
శాంతి. అదొక విలాసవంతమైన, నీకు అందని విషయమనీ నీకు ఎప్పటినుంచో తెలుసు. ఇక నీకు ఈ ఒంటరి రాత్రికి మిగిలినదల్లా ఈ రాత్రిని దాటేందుకు ఉన్న ఒక పాత్ర నాసిరకపు మధువు.
నీకై దు:ఖించే స్నేహితుడు మరెక్కడో ఒంటరిగా ఒక పదం అంచున ఒక ఖడ్గం అంచున కొన ఊపిరితో జీవిస్తుంటాడు. అతడు ఇప్పటికీ ఆ ఒకే ఒక్క స్త్రీకై హృదయ కంపనతో అద్దాలలో వెదుకులాడుకుంటాడు.
అతడు శతాబ్దపు సమాధుల మధ్య ఆమెకై తడుముకులాడతాడు. సమయపు ఖడ్గం నిర్భయంగా, అప్రతిహతంగా అతడివైపు దూసుకువస్తుండగా బహుసా మరెంతో సమయం మిగిలి లేదు అతడు శిరచ్చేధం కావింపబడేందుకు
ఆమెకై చెక్కిన పదాలతో సమాధి కావింపబడేందుకు మరెంతో సమయం మిగిలి లేదు. ఇక ఇక్కడ నీవు, ఇతరుల
ఆలోచనలచే శిరచ్చేదం కావింపబడి అన్ని ఇళ్ళ చీకటి గుహలలో ఎదురు చూస్తావు. ఎప్పుడు రాలిపడతావో ఎప్పుడు మరణిస్తావో తెలీక పదాల అంచులను పట్టుకుని కొనఊపిరితో వేలాడతావు.
నీ స్నేహితుడివైపు దూసుకువచ్చే ఆ సమయపు ఖడ్గమే నీ వైపూ నిష్పాక్షికంగా దూసుకువస్తుండగా, తెలియనిదానికై వెదుకుతూ, దాని స్మృతిలో చెక్కిన పదాలతో నువ్వూ సమాధి అయ్యేందుకు మరెంతో సమయం లేదు.
విగ్రహాలు. ప్రతి పదం నువ్వు ప్రార్ధించే ఒక విగ్రహం. ప్రతి పదం నీకై నిన్ను నువ్వు బలి ఇచ్చుకునే శ్వాసించే ఒక శిలావిగ్రహం.
ఏమీ మారలేదు. ఏమీ మారదు కూడా. సంతాపానికై సంతాపం వ్యక్తం చేస్తూ, ఎదురుచూపుకై ఎదురుచూస్తూ, రాయటానికై రాస్తూ,
ముందే ఎన్నిక చేయబడ్డ వాటి మధ్య ఎన్నుకోమంటే ఎవరైనా ఏం చేస్తారు?
(ఆంధ్రజ్యోతి "వివిధ". 03.04.2006. *ఇప్పటికీ ఇన్నేళ్ళ తరువాత కూడా ఏమీ మారినట్టు లేదు*)
12 June 2011
నీ నిరీక్షణలో
నీ నిరీక్షణలో మునిగిన
నా కళ్ళు పాలరాతి రాళ్ళు
రాలే చినుకుల చీకటి తడి
వాటిని కదపలేవు
శిలవంటి గాలి శిలువ వంటి
రాత్రి= నువ్వు ఎక్కడ
శిధిలమయ్యావో తెలియదు:
ఒళ్ళు పులిచిపోయింది
ఎడారిగా నాలిక
మారింది
నావికుడెక్కడో తెలియదు
నక్షత్రాలు హృదయాన్ని
వదలవు
నీడలు కమ్మిన దారిలో
నిర్ధయగా ఆమెతో నేను
ఇద్దరికీ తేడా లేదు
ఇద్దరికీ గూడు లేదు
ఇద్దరికీ తెలియదు
శరీరాన్ని అమ్ముకునే
తనకూ
మిత్రుడిని నమ్ముకున్న
నాకూ
ఇక ఈ రాత్రి అంతం
అవుతుందో లేదో
చివరాఖరకు చివరి
రాత్రికీ తెలియదు
నా కళ్ళు పాలరాతి రాళ్ళు
రాలే చినుకుల చీకటి తడి
వాటిని కదపలేవు
శిలవంటి గాలి శిలువ వంటి
రాత్రి= నువ్వు ఎక్కడ
శిధిలమయ్యావో తెలియదు:
ఒళ్ళు పులిచిపోయింది
ఎడారిగా నాలిక
మారింది
నావికుడెక్కడో తెలియదు
నక్షత్రాలు హృదయాన్ని
వదలవు
నీడలు కమ్మిన దారిలో
నిర్ధయగా ఆమెతో నేను
ఇద్దరికీ తేడా లేదు
ఇద్దరికీ గూడు లేదు
ఇద్దరికీ తెలియదు
శరీరాన్ని అమ్ముకునే
తనకూ
మిత్రుడిని నమ్ముకున్న
నాకూ
ఇక ఈ రాత్రి అంతం
అవుతుందో లేదో
చివరాఖరకు చివరి
రాత్రికీ తెలియదు
చూపించు
దిగులు గూడు అల్లుకుంటోంది
తొలి చినుకులు రాలే వేళల్లో=
నిష్క్రమించక మునుపు
మసక చీకటి ఎగిరే గదిలో
తన దేహదీపంని వెలిగించాను
తన దేహధూపంని
శ్వాసించాను. జలతాకిడి తాకిన
రాత్రిలో తనలో మునిగాను
తన రెక్కలని నరికాను. కలలు
కమ్ముకున్న కళ్ళని పెరికాను
తన హృదయాన్ని భక్షించాను.
తను నిష్క్రమించక మునుపు
ఓ మధుపాత్రధారీ
మధుశాలల్లో కాక, మామూలుగా
నేను బ్రతికే ఉన్నాను.
శాపగ్రస్తుడికి విమోచనం కలిగించే
దారేటొ చూపించు=
తొలి చినుకులు రాలే వేళల్లో=
నిష్క్రమించక మునుపు
మసక చీకటి ఎగిరే గదిలో
తన దేహదీపంని వెలిగించాను
తన దేహధూపంని
శ్వాసించాను. జలతాకిడి తాకిన
రాత్రిలో తనలో మునిగాను
తన రెక్కలని నరికాను. కలలు
కమ్ముకున్న కళ్ళని పెరికాను
తన హృదయాన్ని భక్షించాను.
తను నిష్క్రమించక మునుపు
ఓ మధుపాత్రధారీ
మధుశాలల్లో కాక, మామూలుగా
నేను బ్రతికే ఉన్నాను.
శాపగ్రస్తుడికి విమోచనం కలిగించే
దారేటొ చూపించు=
వెళ్ళే తీరాలి
చీకటి గాలి వీస్తోంది
నిర్ధయగా
వెళ్ళాలి కొంత దూరం
వెళ్ళే తీరాలి
దూరం అంత దూరం
ఒక ప్రమిదెను
తన మోమునూ
వెలిగించేందుకు
వెళ్ళాలి ఆమె ఉన్నంత
దూరం. ఒక తీరం:
నక్షత్రాలు మాత్రమే
మెరిసే రాత్రిలో రాత్రిని
చుట్టుకున్న ధరిత్రిలో
నింగి నుంచి జాలువారే
దిగులునీ తపననీ
నిరంతరం హత్తుకునే
అనామక అస్తిత్వాన్ని
వొదుల్చుకుని
విదుల్చుకుని
వెళ్ళాలి కొంత దూరం
వెళ్ళే తీరాలి
దూరం కాని దూరంలోకి
సుదూరమై
అసంపూర్ణమై=
నిర్ధయగా
వెళ్ళాలి కొంత దూరం
వెళ్ళే తీరాలి
దూరం అంత దూరం
ఒక ప్రమిదెను
తన మోమునూ
వెలిగించేందుకు
వెళ్ళాలి ఆమె ఉన్నంత
దూరం. ఒక తీరం:
నక్షత్రాలు మాత్రమే
మెరిసే రాత్రిలో రాత్రిని
చుట్టుకున్న ధరిత్రిలో
నింగి నుంచి జాలువారే
దిగులునీ తపననీ
నిరంతరం హత్తుకునే
అనామక అస్తిత్వాన్ని
వొదుల్చుకుని
విదుల్చుకుని
వెళ్ళాలి కొంత దూరం
వెళ్ళే తీరాలి
దూరం కాని దూరంలోకి
సుదూరమై
అసంపూర్ణమై=
11 June 2011
హృదయ నయనం
నిదుర బాహువులు
కలల నీటిలో నడిచొచ్చే
నీ పాదాలు
రాతిరి ఒడ్డున ఎదురు
చూసే జాలరికి
తెల్లారి దొరుకుతాయి
అతని బాహువులలోంచి
రాలిన తన
మంచుపూల మాటలు
ఎవరికీ చూపించని
హృదయ నయన
గాయాలు=
కలల నీటిలో నడిచొచ్చే
నీ పాదాలు
రాతిరి ఒడ్డున ఎదురు
చూసే జాలరికి
తెల్లారి దొరుకుతాయి
అతని బాహువులలోంచి
రాలిన తన
మంచుపూల మాటలు
ఎవరికీ చూపించని
హృదయ నయన
గాయాలు=
10 June 2011
వెళ్ళే వేళయ్యింది
వెళ్ళే వేళయ్యింది
అన్నిటినీ వొదిలి
అందరినీ వొదిలి
ఒక్కడే ఒక్కడితో
వెళ్ళే వేళయ్యింది=
నిన్నే- మరవక
దీపం ఆర్పివేయి
అన్నిటినీ వొదిలి
అందరినీ వొదిలి
ఒక్కడే ఒక్కడితో
వెళ్ళే వేళయ్యింది=
నిన్నే- మరవక
దీపం ఆర్పివేయి
తెంపుకుంటావ్ నువ్వు పూలను
తెంపుకుంటావ్ నువ్వు పూలను
ఆ కనకాంబరం పూలను, ఉదయపు కాంతి మెరిసే వేళల్లో. మరి అందుకే
మెరిసిపోతోంది నీ ముఖం ఈ దినం
నీ కాంతిలో కనకాంబరపు రంగులో.
ఇక తెంపుతావు ఒక్కో పూవునే, రెండు వేళ్ళ మధ్య మెత్తగా ఒడిసి పట్టి
బంగారు రంగు మెరిసే నీ చేతులతో, పెదాల చివర వాలిన
చల్లని చిర్నవ్వుతో, పచ్చటి పల్చటి స్వరంతో
కదులుతావు ఆ పూల మధ్య అలా అలా అలా.
ఇక అందుకే, ఇక అప్పుడే దూసుకువస్తుంది ఎక్కడి నుంచో ఒక వర్షపు
గాలి నీ శి/రోజాలను చెరిపేందుకూ
నీ శరీరంతో అలా ఆడుకునేందుకూ.
మరి నిన్నూ నీ చుట్టూతా వెన్నెల వలయమై తిరుగాడే నీ పిల్లల నవ్వుల
ముఖాల్ని చూస్తో, కూర్చుని ఉన్నాడు
అక్కడే ఈ అపరిచితుడు, శాపగ్రస్థుడు
నిన్ను ప్రేమించినవాడు, నిన్ను దాటి
ఎక్కడికీ పోలేని వాడు, ఎవరూ లేని వాడు, దారీ తెన్నూ లేక నీ దయ తాకక
నీ వీక్షణ సోకక, ఒక మధుపాత్రధారియై
వేచి ఉన్నాడు అక్కడే, నీ చేతివేళ్ళ మధ్య
తెంపబడే పూవై, హృదయంలోంచి సూదివై
నువ్ చొచ్చుకుపోయి అల్లే హారానికై, ఆపై అలంకరణంగా మారేందుకై, మారి
అంతిమంగా వడలిపోయే౦దుకై, ఇక్కడే నీ వద్దే నీతో రాలిపోయే౦దుకై-
అ/జ్ఞానం 35.
ఎలా చూపించను
ఈ ముఖాన్ని?
దర్పణంలో సర్పమయ్యే
దినంలో పడగ నీడయ్యే
ఈ ముఖాన్ని
ముఖ్యంగా నీకు
అరచేతులలో నీటితో
కళ్ళల్లో తడితో వచ్చిన
నీకు ఎలా చూపించను
ఈ ముఖాన్ని?
సంధ్యాసమయంలో
వొళ్ళు విరుచుకునే మృగాన్ని
రాత్రిళ్ళల్లో తనని తాను మరచి
పారవేసుకునే భిక్షువుని
చాచిన చేతుల నుండి
పారిపోయే పిల్లవాడిని
నేరస్థుడిని
ఎలా చూపించను
నీకు ఆ ముఖాన్ని?
ఎలా పరచను
నీ ముందు నిలువెత్తు
విషాదాన్ని?
వెళ్ళిపో త్వరగా
ఈ సర్పసుందరమైన
మనిషి నుంచి సర్ప
పాషాణమైన విష
నయనాలనుంచి=
ఈ ముఖాన్ని?
దర్పణంలో సర్పమయ్యే
దినంలో పడగ నీడయ్యే
ఈ ముఖాన్ని
ముఖ్యంగా నీకు
అరచేతులలో నీటితో
కళ్ళల్లో తడితో వచ్చిన
నీకు ఎలా చూపించను
ఈ ముఖాన్ని?
సంధ్యాసమయంలో
వొళ్ళు విరుచుకునే మృగాన్ని
రాత్రిళ్ళల్లో తనని తాను మరచి
పారవేసుకునే భిక్షువుని
చాచిన చేతుల నుండి
పారిపోయే పిల్లవాడిని
నేరస్థుడిని
ఎలా చూపించను
నీకు ఆ ముఖాన్ని?
ఎలా పరచను
నీ ముందు నిలువెత్తు
విషాదాన్ని?
వెళ్ళిపో త్వరగా
ఈ సర్పసుందరమైన
మనిషి నుంచి సర్ప
పాషాణమైన విష
నయనాలనుంచి=
చివరి చినుకైన రాత్రిలో
చివరి చినుకైన రాత్రిలో
విరిసిన పూవు ఒకటి
అరచేతులు చుబుకం
చుట్టూ చుట్టుకుని
చివరి రాత్రైన చినుకులో
ఆ మోముకై చూస్తాయి
ఇక విచ్చుకుంటుంది
ఒక అగ్నిపుష్పం
నీటి బాటలో బాటసారిలో
వ్యాపిస్తోంది ఒళ్లంతా
మోములో మోహంతో
దాగిన ఆమె తలపు
మబ్బులు తొలగవు. దిగులు
నీడలు వీడవు
ఆ సమయాన
చివరి చినుకైన
ఆమెలో వడలిన పుష్పాన్ని
చూసారా ఎవరైనా?
విరిసిన పూవు ఒకటి
అరచేతులు చుబుకం
చుట్టూ చుట్టుకుని
చివరి రాత్రైన చినుకులో
ఆ మోముకై చూస్తాయి
ఇక విచ్చుకుంటుంది
ఒక అగ్నిపుష్పం
నీటి బాటలో బాటసారిలో
వ్యాపిస్తోంది ఒళ్లంతా
మోములో మోహంతో
దాగిన ఆమె తలపు
మబ్బులు తొలగవు. దిగులు
నీడలు వీడవు
ఆ సమయాన
చివరి చినుకైన
ఆమెలో వడలిన పుష్పాన్ని
చూసారా ఎవరైనా?
వాళ్లకు తెలుసు
హృదయాన్ని భక్షించడమెలాగో
వాళ్లకు తెలుసు
చూడు. చినుకులు మొదలయ్యాయి
చిరు చీకటి కమ్ముకుంది
చలిగా ఉంది. చిక్కగా ఉంది.
శరీరం బరువుగా ఉంది
కవిత్వ పాదాలు రాయలేనంత
క్లిష్టంగా కరకుగా కాలం ఉంది
దారి తప్పిన వాడి కలవి నీవు
దారే లేని అరణ్యాన్ని నేను
చూడు. రాత్రవ్వుతోంది.
నరమాంసభక్షకులు నిన్ను
పిలిచే వేళవుతోంది
ఇంటికి వెడతావో
ఆటవికుల వద్దకు
నీ హృదయాన్ని
పణంగా పెట్టి వెడతావో
ఇక నీ ఇష్టం.
వాళ్లకు తెలుసు
చూడు. చినుకులు మొదలయ్యాయి
చిరు చీకటి కమ్ముకుంది
చలిగా ఉంది. చిక్కగా ఉంది.
శరీరం బరువుగా ఉంది
కవిత్వ పాదాలు రాయలేనంత
క్లిష్టంగా కరకుగా కాలం ఉంది
దారి తప్పిన వాడి కలవి నీవు
దారే లేని అరణ్యాన్ని నేను
చూడు. రాత్రవ్వుతోంది.
నరమాంసభక్షకులు నిన్ను
పిలిచే వేళవుతోంది
ఇంటికి వెడతావో
ఆటవికుల వద్దకు
నీ హృదయాన్ని
పణంగా పెట్టి వెడతావో
ఇక నీ ఇష్టం.
08 June 2011
సర్ప సంగమ వేళ
సర్ప సంగమ వేళ
ఇది=
పౌర్ణమి గుండెలో
అలజడి
అల్లాడుతున్నాయి
వెన్నెలకి ఆకులు
నలుగుతున్నాయి
తొవ్వలో నీడలు
తొడలు గుహల్ని
చంకల చీకటిని
చుట్టుకునే ఆదిమ
సువాసన
ఎర్రటి నాలికతో
బుసలు కొడుతోంది
ఆమె నోరు
నింగి నుంచి రాలే
నెత్తురు శబ్దాలలో
నల్లటి బురదలో
వివశితమౌతోంది
అతడి ఆత్మ=
సర్ప సంగమ
విషామృత వేళ
ఇది
పలువురిగా, పలు
మార్లు వ్యాపిస్తోన్న
ఆ ఇద్దరిలో ఎవరు
జీవించి ఉంటారు
రేపటి ఉదయానికి?
ఇది=
పౌర్ణమి గుండెలో
అలజడి
అల్లాడుతున్నాయి
వెన్నెలకి ఆకులు
నలుగుతున్నాయి
తొవ్వలో నీడలు
తొడలు గుహల్ని
చంకల చీకటిని
చుట్టుకునే ఆదిమ
సువాసన
ఎర్రటి నాలికతో
బుసలు కొడుతోంది
ఆమె నోరు
నింగి నుంచి రాలే
నెత్తురు శబ్దాలలో
నల్లటి బురదలో
వివశితమౌతోంది
అతడి ఆత్మ=
సర్ప సంగమ
విషామృత వేళ
ఇది
పలువురిగా, పలు
మార్లు వ్యాపిస్తోన్న
ఆ ఇద్దరిలో ఎవరు
జీవించి ఉంటారు
రేపటి ఉదయానికి?
07 June 2011
పురాకృతం
తేలికగా ఉండడమంటే ఏమిటి?
బహుశా నాకు తెలీదు. అది సాయంకాలపు ఎండ కావొచ్చు. దేహంలోకి చొచ్చుకుపోయే గాలీ కావొచ్చు.ఒక అద్భుతం. నీరులానూ తుంపరలానూ వుండటం. అది ప్రేమ కూడా. తేలికగా వుండటం అదే కావొచ్చును.
ప్రేమించడం నిర్మలంగా నవ్వడం మృదువుగా మాట్లాడటం నాకు తెలీదు. ప్రతిక్షణం ముక్కలుగా రాలిపడటం యితరులను గాయపరచటం నాకు తెలిసిన జీవితం. అది యీ వాచకం కూడా
మరెప్పుడో మొదలయ్యింది సంఘర్షణతోనే. యిక్కడే అంతమవుతుంది సంఘర్షణతోనే. కానీ, పాదాల చుట్టూ చుట్టుకొనే నీడా దేహంపై కదులాడే ఎండా? యివి కూడా వాస్తవాలు.
ప్రేమ కూడా వాస్తవం.
యీ శాపగ్రస్థ పదాల ముందు ఆమె నిర్లిప్తంగా కదులాడింది. యీ శాపవిమోచనం లేని పదాలతో పాటు ఆమె నిరాసక్తతగా నడుస్తూ వుంది. సగం తెరుచుకున్న పెదవులు. కనులలో రోగగ్రస్థమైన ఎర్రటి జీర ఒక స్పర్శ. ప్ర్రాణప్రదమైనదాన్ని ఒడిసిపట్టుకున్నట్టు లేదా తల్లినుంచి విడిపోతున్న తల్లి చూపూ:
ద్రోహం: వుండకపోవడం . ఉండటమూ నేరం.
ఉండటం ఉండకపోవడం మధ్య, హస్తాల మధ్య తడిలా పారిపోయే నీరులా అదృశ్యమైనది ఏమిటి?
వుండటం. వుండకపోవడం.
భౌతికమైన ప్రేమ. ప్రేమ నుంచి మరింత దీర్ఘంగా,ఎండాకాలంలో పల్చనయ్యి బలహీనంగా తడిమే సన్నటి నదీ చారికలా ఆవిరవ్వకుండా మాయమయ్యే ఇంద్రజాలపు రూపం. ఒక సూర్యకిరణం లేదా చిట్లి సప్త రంగులుగా బయల్పడే సౌందర్యవంతమైన చిరునవ్వు, హింసాత్మకంగా ఏడు రంగులలో ప్రతిబింబించే వెక్కిళ్ళ రోదన. నొప్పి కూడా. అర్థరాత్రి ఎండాకాలం తన పాదం ముంగిట మోపే సుదూర సమీప సమయాన, ఎండాకాలం తన తొలిపక్షి పిల్లలతో చల్లటి వేడి రెక్కలతో వీచే దిగులు పారిజాత పరిమళ గాయపు సమయాన
వొక స్వరం. లేదా వొక భాష.
సుదూరం నుంచి, మరచిపోయిన లేదా మరచిపోయినదేదో వొదిలి వెళ్ళిన సువాసనలాగా, అప్పుడెప్పుడో వర్షాకాలపు మధ్యాహ్నపు సాయంత్రం పూట, మేఘాలు మృదువుగా, కదులుతున్న రక్తంలా, గడ్డ కడుతున్న చేతివేళ్ళల్లా కదలాడుతున్నప్పుడు పెదాలపై వొదిలివెళ్ళిన వుమ్మిలా లేతగా జారుతున్నప్పుడు
సుదూరం నుంచి
మరచిపోవాలనుకొన్నదేదో, మరచిపోతే మరణిస్తాననుకున్నదేదో, తిరిగి వున్మత్త వుద్రేక వృత్తాలుగా దేహాన్నీ, దేహం లోపల సమయపు నదుల మధ్య నింపాదిగా కదులుతున్న కలలనీ పిచ్చితనంతో , హింసాత్మక ప్రేమతో కత్తుల్లా
గాయపరుస్తుంది.
సుదూరం లేదా దూరం (ప్రశ్న: దూరం అంటే ఏమిటి?)
సముద్రం నుంచి మేఘాల దాకా మేఘాల నుంచి సముద్రం దాకా భూమిపై నుంచి భూమి పొరల్లోని సున్నితమైన నదీ ప్రవాహాల్లా అచ్చు నాన్నాలా అమ్మలా, గోరింటాకు విచ్చుకున్న రక్తపు పత్తిపూవులా అరచేతంతా అలుముకున్నట్టు అర్థరాత్రి చీకటినొప్పిలో, నాదైన నాదికాని యీ దేహంలో
నువ్వు
నిశ్శబ్దంగా యుద్ధ భీభత్స తీవ్రతతో, వూహించీ వూహించలేనంతగా, వర్షపు చుక్కలు మట్టిని గాయపర్చిన తీవ్రతతో, అపస్మారకపు సాయంత్రం ఆకస్మికంగా నోరు నొక్కి గుండెల్లో దింపిన కత్తిమత్తు వాస్తవంతో, గోరువెచ్చని నీటిలాంటి రాత్రిపూట దేహం లోపలంతా నలుమూలలా నింపాదిగా ముళ్ళ రక్తపు ఙ్ఞాపకాలతో దిగబడే, లోతుగా విత్తనాల్లా నాటుకుని మొలుచుకువచ్చే
నువ్వు:
=ప్రశ్న రెండు=
నువ్వు అంటే ఎవరు? వొట్టి ప్రతీకలు. నగిషీల భాషా ప్రతీకలు. సౌందర్యాత్మక భాష, సౌందర్యాత్మక హింస . హింసా సౌందర్యం. సౌందర్యపు హింస.
యిప్పుడే యిక్కడే వున్నంత సుదూర సమయాన
నాలుగు చినుకులు చూరు నుంచి జారి అంతదాకా కురిసి వెళ్ళిపోయిన వర్షాన్ని ఙ్ఞాపకం చేసినట్టు, ఒక వర్షాకాలపు తొలి గాలిరోజుల మధ్య నుంచి, అదే వర్షాకాలపు తొలి సజల రాత్రుళ్ళు మేఘాల మధ్య చిక్కుకుపోయిన చందమామను వెతుక్కుంటున్నట్టు ఒక దేహం గురించీ, దేహంలాంటి దిగులు కలల్నీ, వొదిలివేసి వెళ్ళిన కొడుకుల్ని మృత్యునయనాలతో ఆ వృద్ధుడు హింసాత్మక కరుణతో కంపిస్తూ గుడ్డిగా కళ్ళ వేళ్ళంచులతో గరుకుగా తడుముకూంటూ ఎదురు చూస్తున్నట్టు నేను నాకోసం ఎదురు చూస్తున్నప్పుడు చాలా మామూలుగా ఎదురుపడ్డ
నువ్వు.
I was simple
I was simpler then
It was smplicity
which seemed so sensual.
అవి పదాలన్నీ నువ్వే అయిన రోజులు. నువ్వే అయిన పదాలు అస్థిత్వాన్ని కమ్ముకున్న రోజులు. అవి గుసగుసల అమాయకత్వపు ధ్వనుల రోజులు. కనిపించనిదేదో కదలి, గడ్డి మృదువుగా రాత్రితో సన్నటి నీటి కోతలా వూగులాడినట్టు అనేకానేక సుధీర్ఘ నలుపు వర్షాల తర్వాత తిరిగి ప్రత్యక్షమయ్యే వ్యతిరేకాలు: పునరావృతమయ్యే పురాతన ప్రశ్నలు: subject and the other. అతడు అన్నాడు.
=other is the సెల్ఫ్=
అవి కొన్ని సమయాలు. అవి కొన్ని వ్యక్తిగత సమయాలు. దేహం లోపల నదులు అంచులదాకా ప్రవహించి, ఏమాత్రం కదలినా ఏ మాత్రం శబ్ధించినా దేహం జ్వలిస్తూ వొలికిపోయేంతగా నిండిపోయిన దేహపు అలల-యిద్దరిదీ అయిన – యిద్దరిదీ కాని వ్యక్తిగత పరిమళ కలల సమయాలు.
“నేనొక క్రిష్టియన్” ఆమె అంది. ”నీకు తెలుసా బైబిల్ లోని ఆమె కథనాన్ని గురించీ?” అతడు చిర్నవ్వుతో అడిగాడు. ఆరుబయట అశోక చెట్ల గాలులతో పాటు గాలిలా మారుతూ ఆమె చిర్నవ్వింది
దేహం . రహస్య దేహం. బహిర్గతమయ్యీ రహస్యంగా మిగిలిపోయే దేహం.
దేహం మారుతుంది. అశొక చెట్ల గుంపుగానూ, మేఘావృత వుద్యానవపు గులాబీల సందడిగానూ, సముద్ర తెరల నిండైన మెత్తటి పాదాల స్పర్శలగానూ, యింకా ప్రేమపూరితమైన పక్షుల కేరింతలగానూ లేదా సాయంత్రంపూట బేబీకేర్ సెంటరల నుంచి వడివడిగా పొర్లే పిల్లల హృదయాల్లానూ, విశ్వంగానూ సమయంగానూ సర్వరహితంగానూ దేహం మారుతుంది.
“body is a universe in itself” అతడు అన్నాడు.
నక్షత్రాల బిందువుల కింద, అరతెరచిన కిటికీ లోంచి సన్నగా పొగలా జొరపడుతున్న వెన్నెలలా వేకువ ఝామున వుండే నింపాది ఉన్మాద, చిక్కటి చీకటి రక్తంలాటి మంచూ, దేహం నలువైపులా వీడిపోయి మరొక దేహాన్ని ఊదారంగు సర్పంలా చుట్టుకొని మరలా అంతలోనే కరిగి పోయి, తరచూ తడిమే
ఎవరు ఎవరు?
ఆమె దేహం అతడి దేహమయ్యేంతవరకూ అతడి దేహం ఆమె దేహమయ్యేంత వరకూ కలగలిసిపోయి వ్యతిరేకార్థాలైన ఏక భాషలా మారిన పలవరింతల మత్తుసమయాలు
” నన్ను హిందువని అంటారు కానీ మగ పందినని నా అనుమానం ” అతడు అన్నాడు.
ఒక రాత్రిపూట దేహాన్ని పూర్తిగా చూడాలనే వాంఛతొ దుస్తులను, పొలాల మధ్య కలుపు మొక్కలను ముక్కలు ముక్కలుగా చేసినట్టు, బంగారు రంగు ద్రావకపు వున్మాద మెరుపుల మధ్య తునాతునకలు చేసినప్పుడు, ఆ ముస్లిం ప్రియురాలు అంది
” నేను రజస్వలను. మతపరంగా అపవిత్రను. వొద్దిప్పుడు, నిజంగా వొద్దిప్పుడు.”
అతడు చెప్పాడు: మనం నిజంగా మతాన్ని పునర్ నిర్వచించుకోవాలి. నిజంగా మనకు తెలియని, తెలిసీ తెలియని అస్పష్ట ఆకారపు రాముడ్నీ, జీసస్ నీ అల్లానూ.
నీకు గుర్తుందా? అతడిలోని అతడు ప్రశ్నించాడు.
ఆ తెల్లటి గులాబీపూల చందమామని నువ్వేమని పిలిచే వాడిని? తెరుచుకున్న తెరచాపల రెక్కల సుతిమెత్తని శబ్దాల కలకలమని కదా.
ఏదో వొకటి వుంటూనే వుంటుంది
నాకు తెలియని దుఃఖంనుంచి నీకు తెలిసిన భయ దుఃఖపూరితమైన నమాజ్ దాకా ఏదో ఒకటి వుంటూనే వుంటుంది. వెనక్కు వెడితే, దేహం లోపల వానపాముల్లా కదలాడే ఙ్ఞాపకాల వెంట నిశ్శబ్దశబ్దంగా మెలికలు తిరుగుతూ వెడితే, మొదటి రక్తస్పర్శపు ఎర్రగులాబీ పరిమళమా
మొదటి దేహంకోతలో నన్నుమృదువుగా యింకించుకున్నదానా, ఒకానొక మధ్యాహ్నంపూట నాకేమీ తెలియని, నాకు తెలిసీ తెలియని నీ దేహం లోపల నన్ను పిల్లల ఆటలలోని బొమ్మల్లా, మిఠాయి పొట్లంలా దాచుకున్నదానా
ఒకానొక రాత్రిపూట నువ్వు
జాబిలి మధ్యగా రక్తపుచారికలా పగిలితే, ఎవరూ లేని ఒంటరి వేసవి ఆకు అల్లాడని పనస ఆకుల రాత్రి మధ్య నేను ఒంటరిగా గాయపడితే, నా మొదటి అర్థంకాని చందమామా నువ్వు నా ఎదురుగా గాజుగ్లాసులోని సూర్యజలంలాంటి పాపలా తిరిగి వస్తే , నేనేం చేయను? నా చేతి వేలు నుంచి, నింపాదిగా జారిపడుతున్న రక్తంబొట్లలా నేనెవరో తెలియని ఙ్ఞాపకం మృదుమెత్తగా రాత్రిలా కదులాడుతుంటేనూ, నువ్వూ, పగటి మధ్యాహ్న సమయాలలోనూ కదులాడిన క్రైస్తవ బిడ్డ కూడా, గుండెలో యింకించుకున్న బాధలా ఎదురుపడితేనూ, యీ సముద్రమంతానూ, యీ పొంగిపోవడమంతానూ:
చాలా రోజుల క్రొతం పేరులేని, ‘నేను’లేని రోజుల క్రితం నాదయిన ‘నేను’ లేని వ్యక్తావ్యక్త రోజుల గాఢమైన అలల మధ్య నిశ్శబ్దశబ్దంగా తేలాను. తేలికగా, మోయలేనంత తేలిక బరువుగా కదలాడాను.
గది ఎదురుగా కూర్చుని ఎదురుగా కదలాడే మామిడాకుల బాషను అనువదించటం నైరాశ్యం. అదృశ్యంగా దేహాన్ని పలుకరించే గాలి వేళ్ళను కళ్ళతో స్పృశించటం నైరాశ్యం. అస్థిత్వమంతా కరిగిపోయి, ఒక చిన్ని నీటి చినుకులోకి యింకిపోయి వుండటం నైరాశ్యం. వైద్యులు దానిని ఖచ్చితంగా నైరశ్యమే అన్నారు.
మరి ,ఒక దాగుడుమూతల మత్తు రాత్రి మధ్య నువ్వేమన్నవు?”నువ్వెప్పుడూ ఎందుకంత దిగులుగా వుంటావు”
నా భాషలో చెప్పాలంటే అస్థిత్వం= దేహం=దిగులు=అనంతం. ఎందుకంటే జీవితానికి ఒక గతం భవిష్యత్తు లేదని నమ్మినందుకు కావొచ్చు. యిప్పుడు యిక్కడ వుండేదే జీవితం అని విశ్వసించినందుకూ కావొచ్చు. కానీ, యివన్నీ మరో జీవితపు శకలాలు. తునాతునకలయిన నా భాష మధ్య యిరుక్కున్న ప్రియురాలు తరువాత అతడితో చెప్పింది. ” నేను కూడా యిప్పుడు శకలాలలో జీవిస్తాను. ప్రతి తునకలోనూ పూర్తిగా యిమిడిపోయి, దేహంలోని రక్తాన్ని మరికొద్దిగా దానిలోకి వొంపి నిశ్శబ్దశబ్దంగా జీవిస్తాను. కారా మీరందరూ నా దేహ జీవితపు, జీవిత దేహపు శకలాలు?”
ఏమయినా అయి వుండవచ్చు
విసురుగా పగిలిన గ్లాసుగాయపు వెలుతురులాంటి మధ్యాహ్నపు అంధకారంలో వేగంగా కమ్ముకుంటున్న ప్రాచీన కోరిక. ఒకటి: నువ్వు మరుగుతున్న రక్తపు భూమిలా వున్నావు.bరెండు: నువ్వు ఆవిరయ్యిన వెన్నెలలా, జాబిలి నల్లటి మేఘాల మధ్య మాయమయ్యి ఆకాశమంతటా వొదిలివేసిన వెన్నెల పరిమళంలా ఉన్నావు.
మొదటి భాష ఆమెది.రెండవ పలవరింత అతడిది
Metaphors of desire.
"నేనిప్పుడు రజస్వలను మతపరంగా అపవిత్రను”
తెరకమ్మిన ముస్లిం జాబిలి నవ్వుతో ఆపై వొదిగిపోయిన కోరికతో గూటి మధ్య కదులాడే పక్షి పిల్లలాంటి దేహాల కంపనతో ఆపై వర్షపు సాయంత్రం వర్షానంతరాన మట్టి రహదారుల పక్కగా ప్రవహించే సన్నటి నీటి పాయల్లాంటి వేళ్ళతో ప్రవహించింది. అతడు అన్నాడు:
“నీ లోపల అంతం కాని చెలమొకటి వుంది. యీ రోజది రక్తంతో నిండి వుంది. యింకా యీరోజు నేనొక రక్తపిపాసిని.”
సరిహద్దులు లేని కోరిక. ప్రేమ. నా సారాంశం మొత్తమూ రక్త భరితమయ్యేదాకా అదొక ఎరుపు గులాబీల నదిలో పురాతనమైన విరామపు నిదుర. నిదుర నుంచి నిదురలోకి, కలలోంచి కలలోకి, ఆ పై
చాలా రోజుల తర్వాత అనేకానేక వున్మత్త వుద్రేక పసుపుపచ్చటి సమయాల తరువాత గాయం. దేహం బ్రతికి వున్న గాయం.
ఆమె తన గురించి కొద్దిగా చెప్పుకొన్నప్పుడు తన తల్లిదండ్రుల గురించి పూర్తిగా కన్నీళ్ళతో శబ్దించినప్పుడు ఆమె దేహం మట్టిపై పారాడే మేఘం. యింకా మరింతగా పదమూడేళ్ళ వయస్సులో బలాత్కరింపబడిన పెనుగులాట రాత్రి గురించీ, చీకటిలో ముళ్ళ పొదలా దేహంలోకి చొరబడిన కంఠం తెగిన చీకటి గురించీ ఆమె చెప్పుకున్నప్పుడు, తండ్రికి తెలియకుండా తల్లి చేయించిన అబార్షన్ గురించీ, తెల్లటి పింగాణి వంటి ప్లేటులో కదలకవున్న ఎదిగీ ఎదగని పిండం గురించి తలుచుకున్నప్పుడల్లా యిప్పటికిన్నూ ఆమె కళ్ళలో రెండు రక్తం బావులు.
ఆమె పరిపూర్ణమైన గులాబి. ముస్లిమ్ గులాబి. రేకులపై ఎండుతున్న రక్తపు చారికలు గల శబ్ధించే గులాబి. ఎప్పటికి గుర్తుండే వొళ్ళు విరుచుకున్న మసక చీకటి మధ్యాహ్నం వర్షపు చుక్కల సవ్వడి సమయాలలో సుదూరం నుంచి వస్తున్న నక్షత్రాల కాంతి గొంతుతో రాలిపోతున్న వుల్కల మంద్రమైన వేగంతోనూ, అశాశ్వత శాశ్వతమైన స్వరంతో ఆమె చెప్పింది.
“నేను చేసిందేమిటి? యింటి చూట్టూ వున్న మట్టిలో కదులాడిన మొక్కల్ని ప్రేమించినట్టు మనుషులను ప్రేమించటం నేరమా? నాకు ఏమీ అక్కరలేదు. కొద్దిగా ప్రేమ . మరికొద్దిగా ప్రేమ. మరికొద్దిగా నమ్మకం. జీవించేందుకు.”
పెదాలపై ఎండిపోయిన సముద్రం. ఉప్పు. కంపిస్తున్న దేహం. అటువంటి మహొద్రేకమైన రోజుల తర్వాత కడుపు చుట్టూ కడుపు లోపలా సుడిగుండాల్లా అలుముకున్న రోజుల తర్వాత: ప్రశాంతత.
వర్షం వెలసిపోయి వుండవచ్చు. కాటుక మేఘాలు కరిగి దేహపు ఆకాశం తెరపిగా మారి ఉండవచ్చు. బీభత్స అలజడులను దేహం నిశ్శబ్దంగా తట్టుకొని వేపవృక్షంలా పరావర్తనం చెంది వుండవచ్చు. పల్చటి ఎండ కనుల మైదానాలపై లేతగా అలుముకొని, సంధ్యా సమయాన ఎటువంటి ఘర్షణా లేకుండా నిండుగా వున్న సరస్సులా ఆమె మౌనంగా అతడి వేళ్ళతో పెనవేసుకొని కూర్చింది.
ప్రశాంతత
చిర్నవ్వు
శాంతి
అవి సమయాలు. రక్తం సన్నటి సెలయేరులా ప్రవహించే సమయాలు. దేహం మృదుగమ్మత్తు కాంతితో ప్రసరించే సమయాలు. శూన్యం తన చూట్టూ తాను ముడుచుకున్న శంఖంలా, సముద్రపొడ్డున సముద్రం ఘోషను తనలో మౌనంగా యిముడ్చుకొంటున్న శంఖంలా మారుతున్న సమయాలు. అతడు చెప్పాడు.:
” శాంతి వుండవచ్చు. ప్రాచీన కాంతిపుంజంలా శాంతి మన చుట్టూతా కప్పుకొని వుండవచ్చు. దానిని తనువుతో స్పృశించేందుకు ప్రేమ కావాలి. ఓర్పు కావాలి. అంతకు మించి దుఃఖాలకు కారణాలు వెతుక్కునే ధైర్యమూ కావాలి”
ఆకాశానికి నిర్లక్ష్య స్వేచ్ఛతో ఎగిరిన ఒక పక్షి. చందమామను మధ్యగా ముద్దాడుతూ వెడుతున్న మేఘమొకటి. మేఘం వెనకగా నల్లటి తడితో కదలాడుతున్న నక్షత్రమొకటి. సమస్తాన్నీ కౌగలించుకొంటూ రెపరెపలాడుతున్న గాలి కూడా. నిశ్శబ్దపు ప్రేమ కూడా.
అతడు చెప్పాడు.”అత్యంత ముఖ్యమైన విషయాలన్నీ దాగుని వుంటాయి. వాటి సరళత్వంచేత సాన్నిహిత్యంచేత. మనమొకదాన్ని గమనించనిదెందుకంటే అదెప్పుడూ మన నయనాల ముందు వుండటం వలన”
అంతకంటే సరళమైన భాషలో అతడు చెప్పాడు ఒక చిర్నవ్వు సంఘర్షణతో: “కొన్ని ప్రియమైన రూపాల విలువ వాటి సమక్షంలో తెలియదు. తెలిసే లోపల దేహపు రూపాలు మిగిలివుండవు”
యిప్పుడే ఉన్నటువంటి దూర సమయాల తర్వాత
ఆమె సాన్నిహిత్యపు దూరంలోకి వెళ్ళిపోయింది. యిప్పటిదాకా యిక్కడే వున్నదేదో వున్నట్టే మాయమయినట్టు, ఆ వేకువఝామున అంతదాక అక్కడే కనిపించిన మనిషి ఆకస్మికంగా కత్తుల దెబ్బలకు వొరిగినట్టు ఆ తర్వాత హిందుత్వపు గుంపొకటి తెల్లటి దూడలాంటి, ఆ ముస్లిమ్ కుర్రాడి షాపు తగులబెట్టినప్పుడు, ఆ ముస్లిమ్ జాబిలి కంపిస్తూ, రెక్కలు విరిగిపోతున్న పావురంలా అడిగింది:
“వీళ్ళెందుకిలా మనుషుల్ని చంపుతారు. ఆ ముస్లిమ్ అమాయకుడు. తల్లి లేని అతడి షాపును తగులబెట్టి వాళ్ళు ఎటువంటి ఆనందాన్ని పొందుతారు?”
అతడు మాట్లాడలేకపోయాడు. అటువంటి హింసాత్మక జుగుప్సాభరిత క్షణాలలో ప్రపంచ మొత్తం మంటల్లోపడ్డ పాప పెన్సిల్ చిత్రమయినప్పుడు మరొక మూల యిరవైవేల మంది బోస్నియా ముస్లిం యువతులను చెరచినప్పుడు, దేహం రెండూ కళ్ళుగా మారి రెండు కళ్ళు రెండు అల్లకల్లోల నదులుగా మారి నదులు హిమపర్వతాలై భరించలేనంత స్వంత హిందువు వునికిగా మారినప్పుడు అతడు మాట్లాడలేకపోయాడు.
ముస్లిమ్ సీతా మాగ్దలీనా
తెలుపు నలుపు గులాబీ పరిమళమా
నా దేహం నాకే పరాయిగా మారుతుంది. అటువంటి కాంతి తెగిన సమయాలలో దేహం తునాతునకలవుతుంది. అస్థిత్వం నుదుటి మీద బొట్టూ, వేసుకున్న దుస్తులుగా మారిన జుగుప్సాభరిత సమయాలలో నా హిందూత్వపు దేహం నగ్నంగా మారి నడివీధిలో నిలబడుతుంది. జీవితపు అర్థం కుంకుమబొట్లలోనూ గణేష్ నిమజ్జనాలలోనూ పాతిక రూపాయలు పెట్టి కొనుక్కోబడుతున్న గంగాజలంలోనూ, మణికట్టు తెగి ఆత్మహత్య చేసుకోబడుతుంది. ఆమె కళ్ళనుంచి రాలిపడ్డ రెండు రక్తం బొట్లలోనూ యింకిపోతుంది. ఆమె అంది:
“నా అస్థిత్వం నా మతమేనా? నేనంటే వొట్టి నా పేరేనా, నేను మాట్లాడే నా భాషేనా?”
నేనేమి అర్థం చేసుకోగలను. నేనొక నీలాంటి , నీ ఆలోచనలాంటి శకలపు చీకటి మరక నీడను మాత్రమే. నువ్వు నన్నొక తుఫాను సముద్రంగా మార్చినప్పుడు గిలగిలా తన్నుకులాడుతున్న మేఘాల మధ్య యిరుక్కుని మెరుపులా బయటపడుతున్న కాంతి రేఖలా మార్చినప్పుడు, ముస్లిం ధరిత్రీ నేనొక నాకర్థమయ్యీ కాని స్వప్నంలా మారాను. నేను నీ స్వప్నంలా మారాను. నీ వేళ్ళ చివర్ల అసంఖ్యాకంగా మొలకెత్తి కదలాడే యింద్రజాలపు వెదురు పూలపొదల స్వరాల్లాగా కూడా మారాను.
తరువాత
ఒక స్వప్నం వుండింది. రెండు కళ్ళు (నీ నిష్కల్మషపు కళ్ళు) సుధీర్ఘంగా అనంతంగా సాగిన ఆకాశపు చారికలలాంటి హస్తాలూ వుండినాయి. వాటిని కుదించినట్టు, ఒక వేడి శీతలమయపు కౌగిలీ వుండింది. అన్నింటినీ మించి నిరంతరం దేహాన్ని రెండు పెదాల్లా మార్చి, రెండు పెదాలయి అద్దుకునే మెత్తటి మంద్రభరితమైన పెదాలూ వుండినాయి.
ఒక స్వచ్ఛమైన ప్రదేశం:దేహం
రెండు దేహాలు కలసి పోయి వొక దేహంగా మారేంత వరకూ, రెండు కలలూ కలసి పోయి వొక చీకటి స్పర్శలా మారేంతవరకూ లేదా రెండు ప్రపంచాలూ మిళితమైపోయి వుధృతమైన ప్రశాంతమైన అమ్మమ్మలాంటి దుఃఖభాజన పరివాహక ప్రాంతంలా మారేంతవరకూ,లేదా ఆ సాయంత్రపు సముద్రపొడ్డున పక్కపక్కనే ఆనుకొని నడుస్తున్న వృద్ధ దంపతుల మగ్గిన జీవితపు సుగంధపు ప్రేమలా మారేంతవరకూ ప్రేమించిన అనేకానేక యుద్ధాలతో సంఘర్షించిన దేహం ఇది.
ఈ దేహం ఎవరిది.? నీదా?(నీ ముస్లీం మంసపు మల్లెల పరిమళాలదా?) లేక నాదా? ఇప్పటికీ ఇటువంటి అనామధేయపు క్షణాలలో నాన్న కళ్లలా లేదా అతడు మృదువుగా నేర్పించిన ఆటల్లా తిరిగి వచ్చే జ్ఞాపకాలు ఎవరివి? ఖురాన్ను తృణీకరించిన రజస్వలరతి ప్రియురాలా ,నేనెవరిని?నా దేహం ఎవరిది? నేను స్త్రీత్వాన్నా లేక పురుషత్వాన్నా? ప్రతిసారి ధూళిలో లేదా వర్షంలో మిళితమయ్యే వానపాములాంటి జీవితంలా పునరావృతమయ్యే ప్రశ్న.జవాబు కూడా.
నాకున్నదంతా నీ దేహం. నీ స్వప్నం. నీ కోరిక. నీ వాంఛ. నిజానికి నేను నీలా మారాను. ముస్లీం రక్తం. వేకువఝామున పొడిచే నమాజ్. దర్గాలో ప్రశాంతంగా నాపక్కన చేపపిల్లలా తాకుతూ ఈదులాడిన పాదపు స్పర్శ. యింతియాజ్ నువ్వెవరు? నేనెవరు? యీ రెంటి మధ్యలో సాలెగూడు లతల్లా కొట్టుకులాడుతూ గడుస్తున్న జీవితపు మిణుగురు మహా కాంతి ఎవరు? యిన్నాళ్ల తర్వాత -మొలకెత్తిన అనాథ మొక్కలా- నిశ్శబ్ధశబ్ధంగా యింకుతున్న సత్యం. నీ జాబిలి రక్తపు గాఢమైన వుమ్మిలాంటి స్పర్శ లాంటి సత్యం. నా ముస్లీం రంజాన్ తొలి జాబిలి
other is the self
మార్పుకు మరోవైపు.
self is the other. Reversal.
జీవితం కూడా అదే అయి వుండవచ్చు. self నుంచి other కు లేదా other నుంచి self కు మారేందుకు సంఘర్షించడం. పున్నమి నాడు సముద్ర తోకలపై రౌద్రంగా లేచిన సర్పాల అలల్లా పైకెగసి వెన్నెల వృత్తాన్ని అందుకునేందుకు ప్రయత్నించినట్టు: ప్రపంచమంతా వెన్నెలతో దహించివేస్తున్నప్పుడు కూడా చీకటి వుంటుంది. నెగళ్ళ మధ్య రాత్రి అదృశ్యమైనట్టు, నువ్వు గమనించగలిగితే, మౌనంగా నిశ్చలంగా ఉన్న పనస చెట్టులా నిశ్సబ్ధంగా గమనించగలిగితే నేను ఆ చీకటిని లేదా మంటల నాలికల మధ్య కదలాడే రాత్రి ఉమ్మిని, లేదా లాలాజలంతో లోపలికి ఇంకుతున్న పెదవి తెగిన రక్తపు చుక్కను కూడా.
మార్పుకు మరొక వైపు
ఇటువంటి నైరాశ్యపు స్తబ్దత రాత్రిళ్ల నడక తర్వాత
మత్తుభరితమైన లేదా మత్తుభరిత స్థితానంతరం ఉండే ప్రశాంతమైన సముద్ర నైరాశ్యపు స్థితిలొ ఆకాశంలో మరో మూలగా రాలిపోయిన నక్షత్రమొకటి. పురాతన లిపి మధ్య మానవుడొకడు జన్మించాడు. తర్వాతర్వాత అతడ్ని దేవుని బిడ్డని అన్నారు. మరో భాషలొ విప్లవకారుడు కూడా. reversal. నేను మరొక భాషలో, మరొక sexలోకి దానిని మార్చుతాను. దట్టంగా మబ్బులు కమ్మిన దిగులు పూరిత రాత్రి మధ్య స్త్రీత్వపు రూపమొకటి అంబరం మధ్య చీకటిలో గీసిన అగ్గిపుల్లలా సన్నగా మండుతూ కదలాడింది. లేదా ,సాగదీసిన మెరుపు నక్షత్రంలా దేహాకాశపు మధ్య కత్తి కోతలా గీయబడింది. జీసస్ జీవించినప్పుడు వాళ్ళు చెప్పారు కదా “ప్రేమ జనించింది. యీ భారమయపు దుఃఖాల్ని దూరం చేసే ప్రేమ లేదా యిటువంటి హింసాత్మక కమిలిన చర్మంపై శీతలంగా తిరుగాడి settle అయ్యే మృదువైన స్పర్శొకటి జనించింది”.
ముస్లిమ్ ఊర్మిలా మాగ్దలీనా
నేను నీ గురించి ఆలోచిస్తాను. దేహంతోటి రక్తంతోటి నాకున్న వొట్టి కలల దీపపు వృత్తాకారపు కాంతితోనూ నీ గురించి నేను నీడలా ఆలోచిస్తాను. మార్పు వస్తుంది. బాధైనా కానీ కన్నీటి తెరల వుప్పు మట్టిపెళ్ళలాగైనా కానీ కానీ ప్రేమ వస్తుంది. నిశ్శబ్ద శబ్దంగా, ఒక రాత్రి పూట సడీ సవ్వడీ లేకుండా దేహం పక్కగా కదులాడుతున్న చీకటి గాలిలాగైనా మృత్యువులాంటి ప్రేమ వస్తుంది.
వేకువ ఝామున అమ్మలేచి పాతిక సంత్సరాల ప్రేమైక జీవితపు ఙ్ఞాపకాల దుప్పటిని కప్పుకుని వెచ్చగా పిల్లల్ని గమనిస్తూ, అతడి గురించి ఆలోచించినట్టుగా కూడా ప్రేమ వస్తుంది.
ప్రేమ. ఏమిటిది?
నేను పలుమార్లు నాలోకి నేనే పారిపొయి నాలోకి కూడా నేను పారిపోలేని దాక్కునే క్షణాలలో నీలోకి వొదిగి ప్రశ్నించుకున్నట్టు, నా ప్రేమైక దుఃఖ వూబి పూలు విచ్చుకున్న అసంఖ్యాక కౌగిళ్ళ వక్షోజాలదానా
ప్రేమ. ఏమిటిది?
నిజానికి యింతమందినీ యిన్నివేల సంవత్సరాలుగా బ్రతికిస్తున్న ప్రేమ మొగలిపూల యింద్రజాల మత్తు పరిమళమేమిటి? యింకా, యిప్పటికీ దుప్పటిపై అదృశ్య స్పర్శలా పరుచుకున్నట్టు నువ్వు లేని నీ దేహ స్పర్శపు ఙ్ఞాపకపు ప్రేమ వాంఛా గాఢ పిచ్చితనమేమిటి? ఎక్కడనుంచి మొదలుపెట్టాలి? ఎక్కడ నుంచి అర్థం చేసుకోవాలి? అర్థపు జీవన సారమంతా వేళ్ళ మధ్య నుంచి జారిపోయే నీటిపాయల్లా పారిపోతున్నప్పుడు
మాగ్దలీనా
బైబిల్ నుంచి వొళ్ళు విరుచుకుంటూ కలల మత్తుతో నిదుర తుంపర కళ్ళతో లేచొచ్చి, నగ్నంగా నన్ను రక్తంలో కలుపుకునేంతగా గాఢంగా కౌగిలించుకున్న
మాగ్దలీనా
స్వప్నమేఘపు చెలిమిలో కదులాడే నెలవంకా
నీవంటి, నువ్వే ఐన వర్షంలా తుంపరలా తుఫానులా దేహం పీల్చి పిప్పి అయ్యెటట్టు దేహాన్ని ఆవిరిగా మార్చి దేహంలోకి యింకించుకునేంతగా
ప్రాణప్రదమైనదాన్నెదో వొడిసిపట్టుకున్నట్టు నన్నూ నాజీవితాన్ని నీ కనుల అంచుల కింద పదిలంగా దాచుకున్న అమ్మయీ, యిన్నిరోజుల తర్వాత నిన్ను మరొకసారి రక్తపు వుద్రేకతనంతో గాయపర్చుకుని తలుచుకున్నప్పుడల్లా, నేను మరోసారి దారితప్పి నా దేహపు అపరిచిత వీధుల్లో అనాధలా విలవిలలాడుతూ అయోమయంగా తన్నుకులాడుతున్నప్పుడల్లా
మాగ్దలీనా సీతా
నీదేహం మరోసారి గుర్తుకు వచ్చి మరొకరితో గడపలేని అర్థవంతమైన ప్రేమ గుర్తుకువచ్చి
సీతా మాగ్దలీనా
వర్షపు అరణ్యాల జలపాతాల పుత్రికా, నేనేం చెయగలను, రాత్రిపూట ఎవరూ లేని, ఒంటరితనంలో ఒక్కడ్నే ఒక బంగారు కాంతి తరంగపు గ్లాసుతో కూర్చుని, వృద్ధుడిలా, అందరూ ఉండి అందరూ వదిలేసిన ఎవరూ లేని భాష లేని మనిషిలా యిలా వుండటం తప్ప ఏం చేయగలను?
ముస్లిమ్ మాగ్దలీనా
అసంఖ్యాక రోజుల సంవత్సరాల తర్వాత కూడా, యీ అక్షరాలు వెంట వున్న రక్త తీవ్రత కూడా చెప్పక మిగిలినదేదో కూడా ప్రేమ కావొచ్చు. యిదంతా అనివార్యమైన ఋతువుల్లాంటి జీవితానుభవం కావొచ్చు. యిదంతా, నా తల్లీ తండ్రీ కావొచ్చు. యిదంతా నా తరతరాల చరిత్ర సారాంశాం కావొచ్చు.
తిరిగి చూసుకున్నప్పుడల్లా నాదేహంలో లోతుగా దిగబడ్డ నీ పాదముద్రలు. ఆ మృదు కఠిన పాదాల ముద్రలలో లోతుగా మిళితమైన అమ్మ పాదముద్రలు. వాటిలో కలసి పోయిన అమ్మమ్మ కలల పాదాల సజల వృత్తాలు. నాదేహాన్ని నేను పరికించుకుంటే గూడు కట్టుకున్న దట్టమైన అరణ్యాల జలపాతాల తండ్రి గూళ్ళు. వాటిలో పక్షి పిల్లల్లా కదలాడే నా తండ్రి చిర్నవ్వు కలలు. మట్టి కలలు. చెమట కలలు. చుట్టూరా కురుస్తున్న అతడి తండ్రి కనుల వర్షపు మేఘాలు.వాటికి పైగా మృదువుగా కాంక్షించి గమనిస్తున్న నా తండ్రి తల్లి దయాపురిత కనులు.
మాగ్దలీనా
నా అర్దాంతరపు వృద్ధాప్యపు తల్లీ! నేనేం చెప్పాలి? నేనేం చెప్పగలను? యీ దారీ తెన్ను లేని అపస్మారక అక్రమ క్రమంలో వొట్టిగా నిన్ను కాంక్షించడం తప్ప నువ్వు నేర్పించిన రంగులలోంచి నా జీవితాన్ని పునర్ నిర్వచించుకోవడం తప్పితే నేనేం చేయగలను?
నీ వలన నా తల్లిని మరింతగా అర్థం చేసుకోగలను.నా తల్లి వలన నిన్ను మరింతగా అర్థం చేసుకోగలను. నువ్వూ నా తల్లీ కలసి వొక రూపంగా కలగలసి పోయి నన్నొ దీపపు ధూళి పొగలా మార్చినపుడు ఆ ఉదయం పూట శాంతియుతమైన చర్చి ముందు నిశ్శబ్దంగా మూసుకున్న నీ కనురెప్పల పైన నేను మౌనంగా మోకరిల్లడం తప్పితే చర్చి లాంటి నా తల్లి పాదాలపై నేను నా తల వాల్చడం తప్పితే
ద్రౌపదీ మగ్దలీనా
నా రక్తమూ నేను వాంచించిన అస్థిత్వపు స్వప్నమూ అయినదానా, నేను శాంతంగా నీ ముందూ యిద్దరి మధ్యా నిశ్సబ్దపు కంపనగా వొరిగి పోతాను.మత్తుగా తడిసిన మట్టి పొరల మధ్యకు వొక నీటి చినుకులా యింకిపోతాను. నిశ్శబ్దంగా భాషను దాటిన వొక అనుభూతి మధ్యలోకి కూడా కుంగిపోతాను. మరోమారు భాషను అనుభూతి చెందుతాను. నేనే నువ్వు. నేనే నా తల్లిని. నువ్వు నా అస్థిత్వపు నేత్రానివి. వైరుధ్యాలు లేని సీమల మధ్య రెండనుకున్నవీ, రెండుగా భావించినవన్నీ వొకటీగా కలగలసిపోయి కలలలోని కలల్లా,భూమిలోని నీటి పొరల్లా నువ్వేదొ నేనేదో తెలియని ప్రశాంతమైన సమయాల్లో మిగిలే యీ వాస్తవం
యింతకు మునుపే చెప్పాను
other is the self, self is the other
కానీ రెండింటి మధ్యా మిగిలే గాఢమైన ఖాళీల మధ్యే జీవితం నీటి చెలిమలా వూరుతుంది. రెండింటి మధ్యా నిర్వచించలేని, నిర్వచించకుండా మిగిలి పోయిన రహస్య ఖాళీల మధ్య జీవితపు కలలు,కనురెప్పల ఆకుల అంచులకు వేళ్ళాడే మంచు బిందువుల్లా కదులుతాయి. కలలు ప్రేమ కావొచ్చు. వుద్రేకమైన కోరికలూ కావొచ్చు. స్వచ్ఛమైన ప్రక్షాళన దుఃఖం కావొచ్చుఅన్నీ అయిన కవిత్వమూకావొచ్చు. ఆమె ఆ రెండింటి మధ్యగా వున్న ప్రపంచాలలో సంచరించింది.
ఆమె ఆమె దేహం కూడా. అందుకే, యింకా వెనక్కు వెడితే ఆమె అంది:
“నువ్వు మనుషుల్నెప్పుడూ ధైర్యంగా ప్రేమించి వుండవు. అందుకే నీకు మనుషుల్నేం చేసుకోవాలో తెలియదు . నువ్వొక ఎదిగిన బాలుడివి”
అది అతడి మూర్ఖత్వం అయి ఉండవచ్చు. మరింత సూక్ష్మంగా తన ప్రపంచం నుంచి బయటకు రాలేని ఒక బలహీనతయి వుండవచ్చు. అయినప్పటికీ, సుదూర సమీప సమయాల తర్వాత వ్రాసుకొనే నాలుగు నలుపు అక్షరాల మధ్య నుంచి కదలాడే గాయం; మొదటి స్వప్నాక్షరం నుంచి వెనువెంటే వస్తున్న గాయపు నీడలు కూడా
There’s no point in agonizing for nothing
అతడు తనకు తనే చెప్పుకొన్నాడు. యింకా పలుమార్లు యితరులకు.’యీ భూమిని మించి యీ ప్రపంచాన్ని మించిన మహత్తరమైన బహుమతి మానవుడికి మరొకటి లేదు.ఆ తరువాత నీడలు వొరుసుకున్న యినప గొలుసుల్లా గాలికి పాదం ముందు కదలాడితే వాటికి పైగా సన్నటి జాబిలికోత దీర్ఘంగా సాగితే యింకా ముందుకు సాగేందుకు పడే తపన ముందు కొద్దిగా ప్రేమ మరికొద్దిగా రాజకీయాలు.
చాలా దూరం నడచామనుకున్న ప్రయాణించామనుకున్న అలసట విరామం మధ్యలో, ఆకస్మికంగా బయలుదేరిన చోటనే వున్నామని గ్రహించిన అసహనపు స్థితి. ఒక నిస్సహాయత. ఒక అకారణ కోపం జీవితపు రంగుల గీతలు అస్తవ్యస్తంగా మారిన దిగులు దుఃఖం కూడానూ.
ప్రయాణమంటే ఏమిటి?
Between the points, life and death, lies this scorching earth
వొక ద్వీపంపై ఒంటరిగా నిలబడి, నలువైపులా అనంతానంతంగా పరుచుకున్న ఆకాశపు ప్రతిబింబపు నీటి మెరుపుల్ని గమనించడంలాంటి స్థితి. ప్రపంచమంతా, మనుష్యులంతా జంతు దిగులు కళ్ళ ప్రేమ స్పర్శంతా అదృశ్యమయ్యి ఒంటరిగా, ఙ్ఞానంలేని చేష్టలుడిగిన స్థితిలో స్తంభించిన మానవుడి స్థితి కూడా. నగ్నఛాతిపై బిడ్డొకడు లేతహస్తాలతో పాకినప్పుడు ఆ తండ్రి వొక్కసారిగా లోనైన ఆనందపు నిర్లిప్త నిర్వికారపు స్థితి కూడా కావొచ్చు.
అనేక రకాల నిర్వచనాలు. ప్రవచనాలు.
నిశ్శబ్దంగా వున్నందుకు. నటించకుండా మునుపే ఇవ్వబడిన పాత్రల ప్రతీకలలో జీవించనందుకు. ఒకటి: ముందుగా వైద్యం,వాళ్ళు నైరాశ్యమన్నారు. రెండు: స్నేహితుడొకడు’నీకేం కావాలో నీకు తెలీకపోవడం వలన”న్నాడు.మూడు: అతడి తండ్రి అకారణ నైరూప్య విషాదమొద్ద”న్నాడు. అతడి ప్రియురాలు “నువ్వు నాకర్థంకావన్న”ది. మరికొంతమంది దుఃఖమనీ. మరి కొద్దిమంది తాత్వికతనీ అన్నారు.
నిర్వచనాలు. నీ వచనాలు.
వచనాలు చాలు. విచ్చుకునే పగటికాంతి కిరణాల్లా,ముందుకువచ్చి వెనక్కి వెళ్ళిపోయే అలల కాంతి తరంగాల్లా,వొట్టి వేదనలు. తమదైన ఙ్ఞానపు పరిధిలో other ని అర్థం చేసుకునే ప్రయత్నం కూడాను. జీవితమింతే అయివుండవచ్చు.
నిర్వచనాలు. నీ వచనాలు. ప్రతీకలు.
అతడిలోని మరొకడు మరొక సమయంలో వ్రాసుకున్న అక్షరాలు.
“I have lived, laughed and cried over a few images”
అసంఖ్యాక ప్రపంచాలు. అసంఖ్యాక దట్టమైన అడవుల మధ్య ఎవరి పాదాలు తాకని దారికై వెతుక్కునే ఒక multiple single vision విశ్వంకై తన్నుకులాడే నావికుడను కూడా నేను. అదే అతడు కూడా.
ఆ తరవాత సమయాలలో సమయాలు కలగలసి పోయినాయి.
సంధ్యా సమయపు దుమారపు గాలిలో కొట్టుకు పోతున్న రంగు వెలసిన చిన్న ఆకుల్లా,ధూళి రేణువుల్లా దేహం కూడా తునకలయ్యి నలుదిశలా అదృశ్యంగా చిలకరించబడుతుంది.అటువంటి సంధ్యాచీకట్లలో,వొకడు అసంఖ్యాకంగా విడిపోయే క్షణాలలో పనస చెట్టు మధ్యలో వాలుతున్న మసక వెన్నెల పావురాలను గమనిస్తూ అతడు అడిగాడు.
నేను అంటే ఏమిటి?
మట్టిలో కదిలే దేహమా లేక యీ దేహం ప్రదర్శించే క్రియలా,లేక యీ దేహం లోపల కదలాడే పదాల పరిమితులా?యివన్నీ అయిన,యివన్నీ కానిదేదో కూడా నేను.
రాత్రి పూట దీపపు కాంతిలో వృత్తాలుగా గిరికీలు కొట్టే పురుగు.సాగిన నీడలలోకదలాడే అదృశ్యరహశ్య తెమ్మెర. నీడల అంచులను తాకుతూ స్తబ్దుగా వున్న గడ్డిరెమ్మలు. అక్కడక్కడా అస్పృశ్యంగానిశ్చలమైన కనులతో చూస్తున్న పొదలు. రాత్రిని మించిన సౌందర్యం మరొకటి లేదు. రాత్రి చీకటిని మించిన సౌందర్యాత్మకమైన హింస మరొకటి లేదు. అటువంటి సమయాలలో మరొకచోట ఆమె మౌనంగా గాయపడుతూ ఉంది. ఆసుపత్రి తెల్లటి గోడల సమాదుల మధ్య అపస్మారకంగా పడి ఉంది.కడుపులోని బిడ్డ వాంతి చేసుకొని,ఆ ద్రవం,ప్రేమా తప్ప మరేమి లేని గుండెలోకి బురదలా చొచ్చుకవచ్చినపుడు అందరు ఉండి ఎవరూలేక మరణపు మునివేళ్ళను తాకుతూ ఆమె నిశ్శబ్ధ సంబాషణ సాగిస్తూ ఉండింది.
ఆమెకు రక్తం కావాలి
రక్తపు ఊపిరి కావాలి.మరణపు మంచు కొండల మధ్య రక్తపు మంట కావాలి.దేహాన్ని వొణికించే గ్లూకొజ్ తెరల మధ్య యీ జీవితాన్ని జివించేందుకు రక్తపు ప్రియుడు కావాలి.
“ఎంతమందికి యీదేహాన్ని యిచ్చాను.ఎంతమందియీదేహపు గుహలో ఆదిమ మానవుల్లా తలదాచుకున్నారు.దేహం ప్రాచీన గుహగా మారేంతవరకూ గుహ గోడలపై వీర్యపు ఉలులతో చెరగిపోని చిత్రాలను చెక్కేంతవరకూ మరెంతమంది యీదేహాన్ని సృష్టించుకున్నారు.నిజానికి ప్రేమ భాషలో ప్రియుళ్ళంతా ఆదిమ కట్టెల మంటలయితే నేనొక వేటాడబడి కాల్చబడే జంతువును అయ్యాను. నేను దారి తప్పిన ప్రయాణికురాలి నయినప్పుడుల్లా వాళ్ళు నన్ను భక్షించారు”.
మాంసపు రుచి.దేహం.మాంసపు పురాతన స్మృతి
ఆ తర్వాత అతడు చెప్పాడు. “యిదంతా అవ్యక్త చరిత్ర..పగటి పూట కనిపించని వెన్నెల పూల కథ.రాత్రి కీచు రాళ్ళతో ఉదయించేదాకా నువ్వు జ్ఞాపకం రావు.అందుకనే విసిగి వేసారిన ప్రతీకలతో పౌరాణిక స్త్రీ కూడా విచ్చుకున్న భూమి పొరల మధ్యకు వెళ్లిపోయింది.
ఆ తరువాత సూదులు నరాల్లోకి పలుగూ పారల్లా దిగబడక మునుపు ఆమె నవ్వుతో(వొక హిందుత్వపు గుడి ముందు) కుండలోంచి ముంచిన చక్కని నీటి లాంటి మాటలతో చెప్పింది.
“విసుగు పుట్టించే పునరావృతాలు.విసుగు పుట్టించే ప్రతీకలు.నేను అలసి పోయాను.నా దేహపు చందమామలతోటీ,సీతాకోక చిలకలతోటీ కనుల సముద్రాలతోటీ వక్షోజాల పరిమళాలతోటీ హస్తాల ప్రశాంత నదులతోటీ అలసి పోయాను.ఈ చరిత్ర ఎవరిది?ఈభాష ఎవరిది?ఈ తత్వం ఎవరిది? ఏది నా కీర్తన? ఏది నా ప్రార్థన?ఏది నాకోరిక? History is linear, like a desiring phallus.చివరికి భాష కూడా మర్మాంగమే. History can’t be – leave alone being the touch of warmth menses -even a sanitary napkin “ఆమె,తన తల్లి కూడా.ఆమె తల్లి ఆమె కూడా.
ఆమె ఎవరు?
ఆమె అంటే ఎవరు?
వొకప్పుడు ఆమె ప్రశాంత ఆకాశాన రెక్కలు నీలి తెరచాపల్లా పరచి తిరుగాడే రహస్యడేగ. మరోసారి క్షుద్ర ప్రతీకల భాషలో, ఆమె సౌందర్యపు పెదాలతో సమస్తాన్నీపరిమళంతో అద్దే వెన్నెల గులాబి.
తరవాతర్వాత
వొంటిగంట రాత్రి పూట వేసవి శీతల వెచ్చటిగాలిని నింపాదిగా గాట్లు పెట్టే సారంగి.అతడొకనాడు నైరాశ్యపు నిశ్శబ్దంలో చిక్కుకొని చేపలా విలవిల లాడుతున్నప్పుడు లేదా నైరాశ్యపు స్తబ్దతలొ మరణపు మత్తుతో మూతలు పడుతున్న కనులతో వొక పలవరింత.ఎక్కడకన్నా వెళ్లాలి.వెళ్ళిపోవాలి.ఎక్కడకైనా,యిక్కడనుంచి,నాకే తెలియని ,నేనూహిస్తున్న అవ్యక్త అదృశ్య ప్ర్రపంచంలోకి తునకలు తునకలుగా రాలిపోవాలి.అని అంటున్నప్పుడు,
ఆమె మరణపు సరిహద్దుల మధ్య మెత్తటి పాదాల గజ్జెలతో తచ్చట్లాడుతూ మౌనంగా చెప్పింది;”ఎక్కడకు వెడతావు.యిక్కడ నుంచి మరెక్కడకు?యీ మనుషుల్ని వొదలి యీ దేహాలనుంచీ,గుండె చప్పుడ్ల నుంచీ కాంతి నుంచీ మెరుపుల్నుంచీ,ప్రేమ పూల కనకాంబరపు వర్షంనుంచీ కాంతి నుంచి మెరుపుల్నుంచీ కన్నీళ్ళ మేఘాల్నుంచీ నువ్వు ఎక్కడకు పారిపోతావు.నేను తిరిగి రావాలి, యీ ప్రపంచం నుంచి మరలా భూమి పైకి రావాలి.మరలా మనుషుల్ని ప్రేమించాలి.మరలా గాయ పడాలి.మళ్ళీ ప్రేమించాలి.నన్ను చూడు. నిశితంగా గమనించు.నన్నూయీ దేహాన్ని.”
రంగు కోల్పోతున్న ఆకాశంలా రూపం.వొక అస్పష్టపు శ్వేత కాంతి.నెమ్మదిగా కుంచించుకు పోతున్న ప్రమిదల కాంతి.మృదువుగా నదిలోకి జారిపోతున్న యిసుక కాంతి.చాలా నెమ్మదిగా కారి పోతున్న రక్తంలా.ఆమె నుదుటిపై రూపరహితంగా కదలాడుతున్న గాలి తెరలేవో ఆమెతో గుసగుసలాడుతూ ఆమె చేతి వేళ్ళ అంచులను పట్టుకొని తమతో పారాడించుకొంటూ,తీసుకొని వెళ్ళేందుకు సిద్దమయినట్టు కూడా పల్చగా తెర మరుగవుతున్న ప్రియ స్నేహితుడి నీడలా మసకబారిన మధ్యాహ్నం మహానగరాన్ని చీకటి వలల అలల్లా కమ్ముకుంటున్న సూర్యగ్రహణపు చీకటి తుఫానులా
అతను అన్నాడు “వెళ్ళకు నన్నువొదిలి.నేను నీకు చెప్పాలి.నేను చెప్పని కథల్ని.నావీ,నా తల్లివీ.వెళ్ళకు నన్ను వొదిలి.నేను నీకు చెప్పాలి.నేను చెప్పని కలల్ని.నేను నీతో సంభాషించాలి.మరొక్కసారి.పూర్తిగా.సంపూర్ణ శాంతితో.వెళ్ళకు”.
పెదవులపై ఎండి పోయిన రక్తపు బొట్టు.మూసుకున్న కళ్ళపై నుంచి దీర్ఘమవుతున్న నీడల వృక్షాలు.కళ్ళ కింద అగాధాలవుతున్న నెగళ్ళు.
“వెళ్లకు .నేను నీతో చెప్పాల్సిన విషయమొకటుంది.నువ్వొకసారి కనులెందుకు విప్పార్చవు?నీ ఎదురుగా దిగులుగా వీక్షించే నీటి చెలమల్ని ఎందుకు తాకవు? రా, హస్తాల్నందుకొని ,నీ హస్తాల్ని నువ్వే బలంగా అదుముకొని నిద్రా తెరల్ని చీల్చుకొని బయటకు రా,నువ్వొక సారి యీ భూమిపైకి తిరిగి రా.నేను నీకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.
మిత్రురాలా,నేను నిన్ను ప్రేమించాల్సిన సమయాలు చాలా ఉన్నాయి.నిన్ను నేనూ నీవాళ్ళందరూ మోసగించాల్సిన సమయాలు చాలా ఉన్నాయి.తిరిగి రా.మరణించకు.నేను నిన్ను ప్రేమించాను.నేను నిన్ను గాయపర్చాలి.నిన్ను మరొక్కసారి చిర్నవ్వు కన్నీళ్ళతో చూడాలి.నిన్ను మరొక్కసారి నగ్నంగా గమనించాలి.నిన్ను మరొక్కసారి రజస్వలగా రమించాలి.వెళ్ళకు.రా మరణించకు. అన్నింటికంటే నువ్వు వినాల్సిన, వ్రాయాల్సిన చరిత్రలున్నాయి.అసంఖ్యాకంగా.”
మరోదారి లేదు
అప్పుడే స్నానం చేసి వచ్చిన సబ్బు వాసన దేహం చుట్టూ అగరొత్తుల పొగల పాముల్లా చుట్టుకున్నట్టు మరింతగా,ఆమెకు మాత్రమే వచ్చే సువాసన.అప్పుడే ఆర్పి వేయబడిన దీపపు మెరుపు లాంటి జ్ఞాపకం లాంటి మెత్తటి పాదాల తడి.మరింత దూరంలో మరింత నిశ్శబ్ద దూరంలో కూడా వెనువెంటే చిటికెన వేలు పట్టుకొని తడబడే అడుగులతో నడిచే పాప లాంటి స్పర్శ.
అతడు ఆమెకోసారి చెప్పాడు.”నేనొకసారి తప్పక నీవొక అద్భుతమైన నీలాంటి సౌందర్యవంతమైన కవిత రాస్తాను.వొక కవిత.శ్వాసించే,మృదు మదురంగా విచ్చుకొనే గడ్డి పూవు లాంటి కదలికలు గల కవిత”
మరో దారి లేదు
రాత్రి పూట గదంతా ప్రశాంత స్తబ్దతతో ప్రాణం పోసుకుంటున్నప్పుడు లయబద్దంగా వినిపించే గుండె చప్పుడు.కలల గుండె చప్పుళ్ళతో కలలను తట్టి లేపుతున్నప్పుడు,పెదాలపై పెదాలను ఆన్చి వూపిరిని పోస్తున్నప్పుడు
మరో దారి లేదు
వచ్చి వెళ్లిపొయే గాలిలా యిటువంటి వెచ్చని పనస ఆకుల రెప్పల సవ్వడి సువాసనలా,నిజానికి మరోదారి లేదు.నువ్వు వెళ్ళిపొతావు.ముఖ్యంగా సమయంలో చిట్లే సూర్య కాంతిలా;నలువైపులకు,మట్టినీ నీటినీ వృక్షాలానూ జంతువులనూ (ముఖ్యంగా నామృగ తృష్ణనూ) కమ్ముకొనే సూర్య సాలీడు గూడులా నువ్వు వెళ్లిపొతావు.ఆతరువాత అతడిలోకి అతడే,వొక పేడ పురుగులా,వడ్రంగి పిట్టలా తవ్వుకుంటూ లోపలికి లోలోపలికి
మరోదారిలేదు
అదే అతడు కూడా చెప్పింది.నేను నిశ్శబ్దగానే వెళ్లిపోతాను.ఆ తరువాత నేను దానిని పొడిగిస్తాను.ఎవరూ గమనించని గాలిలా,వున్నంతసేపూ గమనించని ప్రేమలా, నేనూ నిశ్శబ్ధంగానే వెళ్లిపోతాను. మా అమ్మమ్మలా, తాతయ్యలా, నిశ్శబ్ధంగానే మధ్యాహ్నపు మట్టి తవ్వుకుంటూసాగుతున్న ఎడ్ల నాగలి నదిలా, పగుళ్ళిచ్చిన పురాతనమైన నా పూర్వీకుల కలల్లా, మరో సమయంలో విచ్చుకునే, మట్టిలో నాటిన కలలు, ప్రేమ కలలు విచ్చుకోవడం చూడకుండానే వెళ్ళిపొతాను.నిశ్శబ్ధంగానే ,మృదు నిశ్శబ్ధంగానే .
మరో దారి లేదు
యీ రాత్రి.ముఖ్యంగా యీ రాత్రి.
మరో దారి లేదు
సుదూరంలో అదృశ్యమైన కాంతి తరంగాలు;వొక వృత్తంలా తిరిగి వచ్చే సందర్భపు రాత్రి.వచ్చి మెరుపులా శిరస్సులోంచి పాదాల్ని చీలుస్తూ భూమిలోకి వెళ్ళిపోయే కాంతి తరంగాలు.వెళ్ళిపోవడం నిశ్సబ్దంగానే,కానీ ,బ్రతికుండగానే వేటాడే నీదైన శరీర భాషా స్పర్శ.దానిని నేనేం చేయగలను? సతమతమయ్యే తాత్విక ప్రశ్నల మధ్య ,సరళంగానైనా “నేను” ఏమిటి? “నువ్వు” ఏమిటి? అనే తాత్విక ప్రశ్నల మధ్య,శ్లేష్మంలో ఈగలా విలవిలలాదుతున్నప్పుడు,నేను ఏం చేయాలి?
కొల్పోవడమంటే ఏమిటి? వుండడమంటే ఏమిటి?
భౌతికమంటే ఏమిటి? భౌతికం కానిదేమిటి?
ఆ రోజుల్లాంటి పసుపు పచ్చని రెక్కల్లాంటి నిమ్మ రంగు పారదర్శకపు శీతాకాలపు పగటి మధ్య వజ్రపు కత్తుల్లా మెరుస్తున్న నీటి మధ్యకు జారినపుడు పైకెలా తేలాలో తెలియక ,నీటి తునకల విశ్వపు ప్రపంచాలమధ్య పైకి రావాలో లేదో కూడా తెలియక నిశ్చలమవుతున్న వూపిరి స్థితి.
మళ్ళా మళ్ళా మళ్ళా పునరావృతమయ్యే, యుగాల నుంచీ నీడల్లా వెంటాడే ప్రశ్న.నేను. ప్రపంచం.రెండింటి మద్యా ఊగిసలాడే వంతెన లాంటిదేదో
Between life and death lies this scorching earth
కానీ యిదంతా యెలా మొదలైంది? యిదంతా మొదలైందా లేదా కొనసాగుతున్నదేదో మొదలుగా పొరపడ్దానా?కానీ మొదలేదో,కొనసాగుతున్నదేదో లేదా అంతమేదో తెలిసేదెలా?
నిర్వికారంగా నేలకు రాలిపొయిన ఆకులు.స్తంబించి కూడా తాకుతున్న గాలి.అదృశ్యంగా తాకుతున్న జ్ఞాపకం.అదే అతడు కూడా.కానీ,అతడు? అతడు ఎవ్వరు? నువ్వెలా అతడెవరో నిర్ణయించగలవు? యీ నిర్మానుష్యపు కర్ఫ్యూ వీధులలో తిరుగాడే పోలీసు గన్నులా లేక రాత్రికి రాత్రి తన యిద్దరు పాలు తాగే పిల్లలను కోల్పోయిన పచ్చి పాల తల్లి రోదన అతడా? కోల్పోయిన తనానికి జెండర్ ఉంటుందా? రాత్రికి రాత్రే కోల్పోయిన బిడ్డ గురించి గుండెను కన్నీటి కత్తులతో కోసుకొని రోదిస్తున్న ముస్లీం అస్పృశ్యపు కేకలా?
ఏది నిజంగా otherness?
దేహం లోపల వొక భీతావహపు అగ్నిపర్వతం బద్దలయింది.ప్రేమను కలగాపులగం చేసే వీధి దారుల మధ్య రక్తపు నెమళ్ళను పరిచే హింసాత్మక వర్షమూ మొదలయింది.అరలలో రహస్యంగా దాచుకున్న బల్లిగుడ్లు చిట్లినట్లు అరల మధ్య భద్రంగా వుంచిన బల్లిగుడ్లను వొక చీపురు తెమ్మెరతో ఊడ్చి వేసినట్లు,పదిలంగా ఉందనుకున్నదేదో ,పదిలంగా ఉండిన దనుకున్నదేదో మాయమవ్వడం ప్రారంభమయ్యింది.
వొక land slide :లేదా పునరావృతమయ్యే landslides.
అపుడెప్పుడో వేలిని కరుచుకున్న వుంగరం సంవత్సరాల తరువాత వేలిని కోస్తున్నంతగా చాలా నెమ్మదిగా చర్మం మట్టి పొరల్లోకి దిగబడుతుంది.కిటికీ పక్కగా మొక్కలా ప్రారంభమైన వొక పచ్చదనం సంవత్సరాల తర్వాత చీకటి బెరడులతో నిశ్సబ్దంగా వ్యాపిస్తుంది.కిటికి కనుగుడ్డుపై బిరబిరా పాకి తొగి చూసి తటాలున వెనక్కి తిరిగి అదృశ్యమయ్యే వుడత.దీపపు కాంతిలో మృదు చలనంతో సంఘర్షించే నీడలు సంవత్సరాల క్రితం స్వచ్చమైన చీకటిలో జన్మించలేదు.కొన్ని విషయాలు పునరావృతమవ్వకుండా పునరావృతమవుతాయి.
ఆమె ప్రేమలా
మరొక రోజు
మరొక సమయం.అప్పటికింకా ఎండిపోని నగరానికి కలలతో వచ్చినప్పుడు,యింకా కమలని గాయపు రక్తంలా సెప్టిక్ కాని పుండులా నగరం పచ్చిగా వున్నప్పుడు నెత్తి మీద వొట్టి కలల మూటతో,సుదూర ప్రదేశాలకు పనికై నెత్తి మీద చద్ది మూట చంకలో పిల్లాడ్నేసుకొని పలుగు పారలతో కదలివెళ్ళినట్లు దేదీప్యమానంగా సుర్య కాంతిలో యీ నగరానికి వొచ్చినపుడు గతంలేదు.గతం అర్థాన్ని సంతరించుకోని వొక యిప్పుడు వొక రేపు మాత్రమే ఉండింది.
ఆమె నిశ్శబ్ధంగా నిశ్శబ్ధ యుద్ధ తీవ్రతతో అతడ్ని వాంచించినప్పుడు,వొక యిప్పుడు వొక రేపు మాత్రమే వుండింది. సమయం మంద్రమైన ప్రవాహంలా వర్షానంతరం బురదగా మారి పక్కగా విస్తరించిన గడ్ది గుప్పిళ్ళ మధ్య వృత్తాలుగా చేరిన నీటిలానూ వుండింది. రాత్రిళ్ళ పూట, చిట్లి అద్దపు తునకల్లా వుధృతంగా జారి పడే జలపాతంలాగా కూడా వుండింది.
వర్షమొచ్చినప్పుడు తడవడం,ఎండలో ఆవిరవ్వడం ,వొక పక్షి కూతలా మారి గాలిలోకెగిరితే వెనువెంటనే తనువు కూడా గానంలా మారడం.ముట్టుకుంటే స్పర్శగా మారి,వెదికితే సముద్రంలా,వూదితే అడవి వేణువులా మారడం తప్పితే నిజానికి ఏమీ లేదు.
ప్రవాహంతో పాటు పోవడమే తప్పితే ప్రవాహపు సౌందర్యాన్ని అనుభవించడం తప్పితే ఏమీలేదు.వున్నదంతా విత్తనంలా చిట్లే శరీరం.దట్టమైన కాటుక మేఘాల మధ్య మెరిసే మెరుపు పల్వరుసలాంటి చిరునవ్వు. సమయరహిత సమయంలా అలా నిలిచి పోయే ప్రశాంతత.వొక నదీమ పారిజాతాల కళ్ల ఆనందం. వొక మాట .వొక స్పర్శ.వొక స్వప్నం.అంతిమంగా మిగిలే వొక స్వచ్చమైన సారాంశం.
ఆ సుదీర్ఘమైనమధ్యాహ్న సమయాలలో,తన చుట్టూ దిగులు,దిగులు లాంటి కళ్ళతో నిలబడ్డ “పెద్ద పిల్లల్ని జ్ఞాపకాలలోనే,జ్ఞాపకాలుగానే చూచిన ఎనబై ఏళ్ళ వృద్ధుడు.తన చుట్టూ వృత్తాకారంలో బావిలోని నీటి వృత్తంలా పరుచుకున్న కన్న పిల్లల్ని ఆ నలబై యాబై ఏళ్ళ పిల్లల్ని ముప్పై ఏళ్ల క్రితపు భౌతిక రూపాలలొ కాంచి,తడబడుతూ మాట్లాడిన ఎనబై ఏళ్ళ కలల ముదుసలి.
అతడు చెప్పాడు. వూపిరి కోసం గాలిలో తడుములాడుకుంటూ “మీరు సంతోషంగా ఉండండి.నేను మీకు ఏమీ ఇవ్వలేక పోయాను.”బ్రతికి ఉన్న అస్థి పంజరం,సగం తెరచిన నోరు,కొసతాళ్ళ మంచం మీద వెళ్ళికల్లా పడుకోబెట్టిన,పై తాటాకుల కప్పు కేసి స్తబ్దుగా చూస్తున్న ఎండిన నయనాలు.
వేసవి.దేహం చుట్టూ అదృశ్యంగా కమ్ముకొనే చెమ్మ.యింతి వెనుక పచ్చగా వుండిన మామిడి చెట్టు మాయమై,భూమిపై వొట్టి మరకగా మిగిలినట్లు మరికొన్ని రోజుల తరువాత వొట్టి మంచం తప్పితే మరేమీలేదు.అక్కడక్కడా అతడు కదలాడిన పొగాకు వాసన తప్పితే మరేమీ లేదు.ఆవాసనలోంచీ సాగి నలుమూలలా స్థిరపడ్డ పిల్లలు తప్పితే మరేమీ లేదు.
మిగిలి లేదు. ఊహ తెలిసినప్పటినుంచీ అంతకు మునుపు నుంచీ నడుం వంచడం తప్ప విరామంగా పడుకున్న వూహ తెలీని,ముదుసలి పగుళ్ళిచ్చిన దేహం తప్ప,ఆ చిట్లిన నల్లటి ముఖంలో కనిపించే అమ్మ ముఖం తప్ప ఎండిన గీతల్లా పగులుతున్న అమ్మ ముఖం అమ్మమ్మ ముఖంలా మారుతున్నదృశ్యం తప్ప మరేదీ లేదు.మరెప్పుడో పక్షవాతంతో కదల్లేక మంచంపై నిశ్చలంగా పడి ఉన్నవృద్ధుడి మనస్సులో సంఘర్షణ తండ్రి హృదయంగా పరావర్తనం చెందుతున్న మార్పు వేగం తప్ప మరేమీ లేదు.వొక జీవితం.వొక కల. వొక ప్రేమ. మరెక్కడో మొదలయ్యి సాగి,నిశ్చలంగా పలు ప్రపంచాల్ని తడుపుతున్న వొక నది కూడా.
అదే అతను కూడా చెప్పింది. యితరులకు చెప్పినట్టుగా బలీయంగా ఊహించినది స్వప్నించినదికూడా,కాని అసంఖ్యాకమైన దారులున్నప్పుడు అసంఖ్యాకమైన దారులు చిక్కుపడి కలగాపులగంగా దారే లేనంతగా మారిపోయినప్పుడు,దేహమూ దేహంలోని సారాంశమూ కలలేవీ లేక,లేక కలలపై నమ్మకం కోల్పోయినప్పుడు,మరింత సూక్ష్మంగా కలలకూ వాస్తవాలకూ మధ్య ఉన్న,ఉన్నదనుకున్న సూక్ష్మమైన పరిధేదో చెరిగి పోయి.
ఉనికి క్షణక్షణపు మనుగడ అవుతున్నప్పుడు,స్నేహితుడా సౌందర్యం హింస కాదా? జీవించడం హింస కాదా? యిమడలేని మరొ వాస్తవమేదో అదాటున తలుపు తట్టి అనుమతి లేకుండా జొరబడినప్పుడు,ప్రతి చర్యా హింసాత్మకంగా విచ్చుకొనే ఎర్ర గులాబీలు కావా? దేహం చుట్టూ పొరల్లా ఉన్న ప్రపంచమూ ప్రేమలూ మనుషులూ హింసాత్మక ప్రతికలు కారా? రాత్రి అనుకోకుండా ఎదురు పడ్డ ప్రశాంతమైన మృదు చిరునవ్వు హింస కాదా?అయి ఉండవచ్చు.కాక పోవచ్చునుకూడా.
అతను అలా మంచంపై ఈగలతో పొర్లుతున్నప్పుడు మల మూత్రాలతొ అభిషిక్తుడై స్పర్శ కోల్పోయి,వొక్క చూపులాంటిదేదో మిగిలి ఉన్నప్పుడు,మిగిలేది వొక కల.అది గతమయి వుండవచ్చు. భవిష్యత్తు అయి ఉండవచ్చు.మరింత సూక్ష్మంగా వొక కలా గతమూ భవిష్యత్తు కలగలసిన చర్యకు మరోపేరు అయి ఉండవచ్చు.
అవి క్షణాలు
యిప్పుడు నాకున్నటువంటివి.సూర్యోదయం సూర్యాస్తమాయమైనప్పుడు సూర్యాస్తమయం సూర్యోదయమైనప్పుడు,అటువంటి కలగలసిన రహస్యపు ఉనికి క్షణాలలొ మిగిలేది వొట్టి సంధ్యా సమయం మాత్రమే.అప్పుడప్పుడూఎల్లప్పుడూ అసంఖ్యాక పొరల మధ్య దారి తప్పిపోతున్నప్పుడు,వొక దారి ఉందనుకొని మరచి పోతున్నప్పుడు రాత్రి పగలుగా మారుతుంది.పగలు రాత్రిగా మారుతుంది.రెండూ కాని సమయాలలో ప్రపంచమంతా కాంతి పుంజాలతో నిండి పోతుంది.
అది స్వప్నమా?
అతడు ప్రశ్నించాడు.కానీ, ఏది స్వప్నం ఏది వాస్తవం?రెంటీనీ విడదీయగలిగిన అంతిమ సత్యమేదైనా వుందా?ఏదీ లేనపుడు ప్రియురాలా నిజానికి నేను ఏమిటి?నువ్వుఏమిటి?
నేను ఊహిస్తాను. స్నేహం గురించీ స్వప్నం గురించీ. ఆ తర్వాత మిగిలేదంతా అనంతం కాదా?గాలిలో కదలాడే అదృశ్య ఆకుల తునకల వేళ్ళ చివర్ల పరామార్శ కాదా?యివన్నీయివి అన్నీ ఏమయినా అర్థం చెపుతాయా?ఏమయినా?వేళ్ళ మధ్య యిరుక్కున్న బ్లేడు తునక నుంచి,యింకా తెగని మనికట్టు నరందాకా,మధ్యలో వుండే దూరాన్ని గురించి చెప్పటాన్ని చెప్పలేకపొవటం మధ్య వున్న ప్రాణమైన ప్రాణరహిత రక్తం మృదువుగా యింకిపోయే సౌందర్యపు హింసాత్మకపు ప్రక్రియ గురించీ నువ్వు చెప్పాలి.నేనైనా చెప్పాలి. అర్థమూ అర్థ రాహిత్యం గురించి
జీవితం గురించి,జీవితం లాంటి దేన్నో గురించి
కొద్దిగా విరామం.యీ యుద్ధఖండికల మధ్య వొద్దనుకున్నా గుమిగూడే జల తాకిడిల మధ్య నుంచి విరామం.విరామం స్పర్శ.విరామం ఉనికి.వునికి స్పర్శ.స్పర్శ జ్ఞాపకం.జ్ఞాపకం తిరిగి వునికి.అది అంతే.
అంటే ఏమిటి?
మళ్ళా నేను అర్థ రాత్రి దగ్గరకే వస్తాను.నేను మళ్ళా చీకటి సమయాలలోకే వస్తాను.దీనిని మించి నాకు మరో సమయము లేదు కనుక.నాలోకి నేను అదృశ్యమయ్యే సమయాలలోకి,నాలోకి నేను దారి తెలిసి తెలియని గుడ్డివాడిలా కరిగి పోయె సమయ రహిత సమయాలలో నా అంతట నేను “నేను”లా మిగిలే సమయాలలో నేను మరలా నా పాత ప్రాచీన ప్రతీకలలోకే వస్తాను.
Does one know what one is?
Does one know what the other is?
ఎప్పటికీ ఏమీ లేదు.
వుంది.యిదంతా వొక వున్మాద మత్తు సారంగి నావికుడి వున్మత్త ప్రేలాపన.ఆకాశమంతా స్తబ్దుగా మారిన తర్వాత మిగిలే నిశ్శబ్ధ శబ్ధం.ఏమీ లేదు.అంతా వుండీ ఏమీ లేదు.మరొక పదజాలంలో,అంతా వుండినట్లు వుండి ఏమీ లేదు.దేని గురించి యిదంతా?యీ భరించీ భరించలేనంత ప్రయత్నమంతా?యీ జీవిత ప్రేమ సంఘర్షణ దుఃఖ సంతోషమంతా?
ఆ తరువాత యీ ప్రశ్నల తరువాత
అతడు తిరిగి వస్తాడు.
(incomplete)
30.01.1999 నుంచి 25.08.1999.
CIEFL, Hyd.
అ/జ్ఞానం 34.
మిణుగురుల కాంతి
నీ చర్మానిది
ఇసుకని రేపిన వర్షం
సముద్రాలపై నుంచి
వచ్చే మెత్తటి వాసనా
నీ శరీరానిది=
ఆదిమ గుహల రహస్య
రుచి నీ పెదాలది
యూకలిప్టస్ చెట్లు కదిలే
చిరు చీకటి గాలి
నీ పదాలది
నేను తల దాచుకుని
రోదించిన కౌగిలి
నీ వక్షోజాలది
పగటి రాత్రుళ్ళలో
రాత్రుల పగటిలో
నేను రాలిపోయిన
సంధ్యా సమయపు గూడు
నీ యోనిది=
కొంత హింస నాది
కొంత శాంతి నీది
కొంత నిర్ధయ నాది
కొంత కరుణ నీది=
దిగంతాలనుంచి వచ్చిన
దిగులు దారిలో
తప్పిపోయినది నేను
వెడలిపోయినది నువ్వు=
గుర్తుంచుకో అప్పటినుంచి
ఇప్పటిదాకా
నేను మరిక రోదించలేదు
నేను మరిక నవ్వలేదు=
నీ చర్మానిది
ఇసుకని రేపిన వర్షం
సముద్రాలపై నుంచి
వచ్చే మెత్తటి వాసనా
నీ శరీరానిది=
ఆదిమ గుహల రహస్య
రుచి నీ పెదాలది
యూకలిప్టస్ చెట్లు కదిలే
చిరు చీకటి గాలి
నీ పదాలది
నేను తల దాచుకుని
రోదించిన కౌగిలి
నీ వక్షోజాలది
పగటి రాత్రుళ్ళలో
రాత్రుల పగటిలో
నేను రాలిపోయిన
సంధ్యా సమయపు గూడు
నీ యోనిది=
కొంత హింస నాది
కొంత శాంతి నీది
కొంత నిర్ధయ నాది
కొంత కరుణ నీది=
దిగంతాలనుంచి వచ్చిన
దిగులు దారిలో
తప్పిపోయినది నేను
వెడలిపోయినది నువ్వు=
గుర్తుంచుకో అప్పటినుంచి
ఇప్పటిదాకా
నేను మరిక రోదించలేదు
నేను మరిక నవ్వలేదు=
06 June 2011
మీకు
తవ్వుకుపోండి హృదయాన్ని
హృదయ జలాన్ని
అక్కర్లేదు మీకు కన్నీళ్లు
కలలూ కనుల కారణాలు
శవాలు కావాలి మీకు.స్మశాన
పోషకులు మీరు.
తరలించుకుపోండి.
తవ్వుకుపొండి.
మిమ్మల్ని పరిహసించి
నవ్వే ఒక పూవు
పూస్తుంది ఇక్కడ.
హృదయ జలాన్ని
అక్కర్లేదు మీకు కన్నీళ్లు
కలలూ కనుల కారణాలు
శవాలు కావాలి మీకు.స్మశాన
పోషకులు మీరు.
తరలించుకుపోండి.
తవ్వుకుపొండి.
మిమ్మల్ని పరిహసించి
నవ్వే ఒక పూవు
పూస్తుంది ఇక్కడ.
అప్పుడు నువ్వో జంతువ్వి
అప్పుడు నువ్వో జంతువ్వి
కోరలు చాపి అరుస్తోంది
మనస్సులో మృగం ఒకటి
తెలీదు దయ,ఆనదు ప్రేమ
దానికి. జ్వలించే
కళ్ళూ ముళ్ళ నాలికా దాని
సొంతం. అవుతాయ్
ఆయుధాలు దాని మాటలూ
చేతులూ: అరుస్తోంది
పిల్లల మీద పడీ పడీ
నముల్తోంది
వాళ్ళని మరలా మరలా
విదిలించివేస్తోంది నిర్ధయగా
కసురుకుంటోంది కరకుగా=
ఆ పిల్లలు, పూలను కళ్ళలో
నింపుకుని ఎగిరే ఆ పిల్లలు
ఒళ్లంతా కన్నీళ్ళయ్యి, పగలు
రాత్రవ్వగా మృగానికి
దూరంగా ఎక్కడకని
పారిపోవాలి?
కోరలు చాపి అరుస్తోంది
మనస్సులో మృగం ఒకటి
తెలీదు దయ,ఆనదు ప్రేమ
దానికి. జ్వలించే
కళ్ళూ ముళ్ళ నాలికా దాని
సొంతం. అవుతాయ్
ఆయుధాలు దాని మాటలూ
చేతులూ: అరుస్తోంది
పిల్లల మీద పడీ పడీ
నముల్తోంది
వాళ్ళని మరలా మరలా
విదిలించివేస్తోంది నిర్ధయగా
కసురుకుంటోంది కరకుగా=
ఆ పిల్లలు, పూలను కళ్ళలో
నింపుకుని ఎగిరే ఆ పిల్లలు
ఒళ్లంతా కన్నీళ్ళయ్యి, పగలు
రాత్రవ్వగా మృగానికి
దూరంగా ఎక్కడకని
పారిపోవాలి?
03 June 2011
అ/జ్ఞానం 33
ఏం చేసాం మనం?
స్మృతికి దుస్తులు తొడిగి
విస్మృతిలోకి నెట్టాం=
ఆ అవతలవైపే ఉంటాయి
పదాలు
వాక్యానికి అటూ ఇటూ
సరిహద్దుల్లా
సమాధుల్లా
పూలని మట్టిలోంచి
విరజిమ్ముతూ
కాంతి కరుణతో ఒక
చీకటి నిశ్శబ్దంతో
నిను దీవిస్తో=
తెలుసా మరి మనం
ఇతరులమై
ఏం చేసామో
ఆ రాత్రి?
స్మృతికి దుస్తులు తొడిగి
విస్మృతిలోకి నెట్టాం=
ఆ అవతలవైపే ఉంటాయి
పదాలు
వాక్యానికి అటూ ఇటూ
సరిహద్దుల్లా
సమాధుల్లా
పూలని మట్టిలోంచి
విరజిమ్ముతూ
కాంతి కరుణతో ఒక
చీకటి నిశ్శబ్దంతో
నిను దీవిస్తో=
తెలుసా మరి మనం
ఇతరులమై
ఏం చేసామో
ఆ రాత్రి?
అ/జ్ఞానం 32.
మరులుతోందక కన్ను నీ వైపు
కదులుతోందొక చేయి సర్పమై
నీ మెడ చుట్టూ
ఊపిరి:జ్వలించే ఊపిరి వ్యాపిస్తోంది
రగులుకున్న అరణ్యమై
నీ నడుము చుట్టూ
చిట్లుతోంది దేహం విత్తనమై
ఆర్చుకుపోతోంది నాలిక
ఎడారియై
తపించిపోతోంది హృదయం
రాలిపోతోంది నీ శరీరంపై
బింబమై,మానని గాయమై=
అందుకనే వొదిలి వేసాను
ప్రమాద సూచికను.
అందుకనే నలుగురిలో
నవ్వుల పాలయ్యాను.
మధుశాలల్లో పాత్రధారిగా
రూపాంతరం చెందాను.
స్నేహితులను గాయపరిచాను
శత్రువులను ఆదరించాను
అదమరిచాను. రాత్రి పొదలకు
నిప్పంటించి నిన్ను స్మరించి
పగటిలో నిస్పృహతో నిద్రించాను
పలుమార్లు మరణించాను=
ఇక విస్మృతికి స్మృతివైపు మరలే
మరో కన్ను ఎప్పటికీ దొరకదు.
కదులుతోందొక చేయి సర్పమై
నీ మెడ చుట్టూ
ఊపిరి:జ్వలించే ఊపిరి వ్యాపిస్తోంది
రగులుకున్న అరణ్యమై
నీ నడుము చుట్టూ
చిట్లుతోంది దేహం విత్తనమై
ఆర్చుకుపోతోంది నాలిక
ఎడారియై
తపించిపోతోంది హృదయం
రాలిపోతోంది నీ శరీరంపై
బింబమై,మానని గాయమై=
అందుకనే వొదిలి వేసాను
ప్రమాద సూచికను.
అందుకనే నలుగురిలో
నవ్వుల పాలయ్యాను.
మధుశాలల్లో పాత్రధారిగా
రూపాంతరం చెందాను.
స్నేహితులను గాయపరిచాను
శత్రువులను ఆదరించాను
అదమరిచాను. రాత్రి పొదలకు
నిప్పంటించి నిన్ను స్మరించి
పగటిలో నిస్పృహతో నిద్రించాను
పలుమార్లు మరణించాను=
ఇక విస్మృతికి స్మృతివైపు మరలే
మరో కన్ను ఎప్పటికీ దొరకదు.
02 June 2011
అ/జ్ఞానం 31.
ఇక చూడవు నువ్వు
ఎప్పటికీ
నావైపు=
కాలసర్పం కదిలే
వేళల్లో రమించాం
అనాధ పిల్లలవలె
ఒకరిలోకొకరం
నల్లగా విహరించాం
ఒకరినొకరు
తెల్లగా గాయపరుచు
కున్నాం. మనల్ని
మనం కన్నాం=
అయిపోయింది
అ సమయం.
ఇక చూడవు నువ్వు
ఎప్పటికీ
నావైపు=
ఎప్పటికీ
నావైపు=
కాలసర్పం కదిలే
వేళల్లో రమించాం
అనాధ పిల్లలవలె
ఒకరిలోకొకరం
నల్లగా విహరించాం
ఒకరినొకరు
తెల్లగా గాయపరుచు
కున్నాం. మనల్ని
మనం కన్నాం=
అయిపోయింది
అ సమయం.
ఇక చూడవు నువ్వు
ఎప్పటికీ
నావైపు=
లిప్తకాలం
వేసవి అంతాన వలయమవుతున్నాయి నల్లటి మబ్బులు -
ఆ సంధ్యారుణిమ కాంతిలో మెరిసే వదనంతో
వెన్నెల వంటి ఐదేళ్ళ పిల్లవాడు
నా చేతి వేలు పుచ్చుకుని నడుస్తూ అడుగుతాడు:
"నాన్నా నేను నీ అంత అయ్యాక, నువ్వు ఎంత అవుతావు?"
నేను అంటాను కదా: "అప్పటికి నేను
ఉండను కన్నా." "ఎక్కడికి వెళ్లిపోతావు నాన్నా?"
నిశ్శబ్దం మరోమారు అనుభవమై అంటాను నింగిని చూయిస్తూ:
"రాత్రైతే వస్తాయి కదా నక్షత్రాలు ...
వాటిలోనో, ఈ నేలలోనో కలిసిపోయి ఉంటానురా"
విశ్వమంత విప్పారిన కనులతో తిరిగి అడుగుతాడు వాడు
అయోమయమై: "ఎలా నాన్నా?"
"చచ్చిపోయి ఉంటానురా నేను ... అప్పటికి ..."
"మరి మనం తిరిగి ఎప్పుడు కలుసుకుంటాం నాన్నా?"
ఇక నడక ఆపి, మాటలు ఆపి, గొంతు గాయమై రహదారిపై
మోకాళ్ళపై కూర్చుని, వాడి తెల్లని
కుందేలు పిల్లల కళ్ళలోకి చూస్తూ చెబుతాను:
"వస్తే, నువ్వు నా వద్దకు వచ్చినట్టు నేను నీ వద్దకు వస్తాను
కన్నా ..." అతడికి అర్థమయ్యీ కాక
ప్రప్రధమంగా నిశ్శబ్ధం అనుభవమై కాసేపాగి అంటాడు:
"నాన్నా ...నీకప్పుడు చక్కగా స్నానం చేయిస్తాను. అన్నం
పెడతాను. ఆడుకోటానికి బయటికి
తీసుకు వెళ్తాను. నీకు బోలెడు బొమ్మలు కొనిపెడతాను...
నాన్నా, నువ్వు నా దగ్గరికి వస్తావా నాన్నా?"
నేను సమాధానం చెప్పను. కొంత అరుణిమ. కొంత వొణుకు
కొంత ప్రీతి. కొంత శాంతి. ఇంకొంత
పురాజన్మల, పునర్జన్మల మృత్యు అనుభూతి. స్మృతి -
వేసవి అంతాన వలయమై నల్లటి మబ్బులు కురుస్తున్నాయి
దిగంతాలలో, దిగులు దినాలలో
నా కళ్ళల్లో: దయగా ధారగా వాడి అరచేతులంత మెత్తగా –
ఇక రాబోయే కాలమే గడచిన బ్రతుకంత సంక్షిప్తం. సుదీర్గం.
అనంతం –
Subscribe to:
Posts (Atom)