రైతులు లేని రైతుబజారు నుండి ప్లాస్టిక్
సంచిలో తెచ్చుకుంటాము బహుభద్రంగా,
నేనూ నా కొడుకూ కూరగాయలు. టమాటాలు, బెండకాయలూ,
దోసకాయలూ, ఆలుగడ్డలూ, చిలుకడ
దుంపలూ, ఇంత పాలకూరా, పచ్చి మిరపకాయలూ కొంత
కొత్తిమీరా- నేనైతే చూసాను
ఒకప్పుడు, నా కొడుకంత వయసులో ఇంటి
పెరటులో నాన్న చేసిన పాదులో ఏడు రంగుల్లా వికసించి నింగికి సాగిన బీరకాయ, పొట్లకాయ లతలనూ
వాటికి తళుక్కుమని మెరిసే కాయలనూ, నేలలో మట్టిని
కావలించుకుని నిదురించే పల్లీలనూ దుంపలనూ - అక్కడే పక్కగా ఎంచక్కగా ఎదిగి వొంగిన జామచెట్టునూ దాని కింద నీడలలో కదిలే చిన్ని పిట్టలనూ.
నగ్నమైన వీపుతో నాన్న అక్కడ మట్టిలో ఉంటే
వెనుకగా నేను నాన్న తెంచి ఇచ్చిన కనకాంబరపు పూలనూ దవనాన్నీ అమ్మకి ఇచ్చి చూసేవాడిని
ఇంద్రజాలంలాంటి ఆ కాంతిలో అమ్మ వేళ్ళ అల్లికలో పూలు హారమై అమ్మ శిరస్సులో మళ్ళీ నాటుకుని ఎలా పచ్చగా వికసించేవో - రాత్రికి
పెరటిలో తెంపుకున్న నాలుగు టమాటాలు పెరుగుతో
కూరగా నాలుగు మాటలుగా ఆనక నాన్న చెప్పే వ్యవసాయపు కథలుగా చల్లటి అమ్మ చుట్టూ వెచ్చని
నిదురుగా ఎలా మారేవో. మరి ఇప్పుడు అంటాడు
నా నాలుగేళ్ల పిల్లవాడు, కూరగాయ మొక్కలని ఎన్నడూ
చూడని వాడు, నలు చదరపు గదులలో పెరడు లేని వాడు - "
నాన్నా కొత్తిమిరకపాయలు తీసుకున్నావా?" అని. ఏమో
తీసుకున్నానేమో మరి, కానీ
కురియలేదు అప్పుడు కురిసిన వర్షం
ఇక ఏ మాత్రం ఇక్కడ:ఎప్పటికీ.నాకూ
నా పిల్లవాడికీ-
అచ్చు తెలుగు పుస్తకాలకు ప్లీజ్ విజిట్
ReplyDeletehttp://www.logili.com/
మీకు నచ్చిన పుస్తకాల మీద మీ రివ్యూ లను పంపండి.
review@logili.com
చాలా బాగుందండీ... ఈ లైన్స్ మరీ నచ్చాయ్...
ReplyDelete>నేను నాన్న తెంచి ఇచ్చిన కనకాంబరపు పూలనూ దవనాన్నీ అమ్మకి ఇచ్చి చూసేవాడిని ఇంద్రజాలంలాంటి ఆ కాంతిలో అమ్మ వేళ్ళ అల్లికలో పూలు హారమై అమ్మ శిరస్సులో మళ్ళీ నాటుకుని ఎలా పచ్చగా వికసించేవో<
మీ ఈ పోస్ట్ ను నా గూగుల్ ప్లస్ లో షేర్ చేశాను, ఇక్కడ చూడవచ్చు. https://plus.google.com/u/0/117385813833830611794/posts/Wykd4ATa43h
ReplyDeleteమీకు అభ్యంతరమైతే తెలియచేయగలరు.
కాయగూరలలో రుచి నశించింది, భూమిలో నిస్సారత కారణం. మన చిన్నప్పుడు కొత్తిమీర సువాసనలు ఆమడు దూరానికి వ్యాపించేది. కరివేపకు పరిమళాలు పరిసరాలను ఘుమ ఘుమలాడించేది. వేడిసెగ తగిలితేనె ఉదికే కాయగూరలు కుక్కర్ కు తప్ప లొంగటంలేదు. బహుశః పర్యావరణ విషతుల్య మార్పులు ఇవేనేమో!
ReplyDelete@వేణూశ్రీకాంత్. ధన్యవాదాలు. మీరు నిరబ్యంతరంగా బ్లాగ్ లోని దేనినైనా షేర్ చేసుకోవచ్చును. thanks for reading.
ReplyDelete@N.V. SIVA RAMA KRISHNA: :-) జీవిత విధానానికీ, మానసిక స్థితికీ, మనం జీవించే కాలాలకీ కొంత అవినాభావమైన సంబంధం ఉంటుందేమో అనుకుంటాను. thanks for reading.
మీరు కామెంటుకి సమాధానం ఇవ్వడం, నేను ఇదే మొదటిసారి చూడడం, అప్పుడప్పుడు ఇలా పలకరించండి, సార్.....ఆనందంగా వుంటుంది.
Deleteహ్మ్...అంతే చూడలేము ఎప్పటికి
ReplyDeleteపూలతోనే సంతోష పడే ఆ స్వచ్చం అయిన మనసులని
మమతలని