నువ్వొక కరుణ నిండిన పాత్రవని
దాహం తీర్చే చెలమవనీ వచ్చానీ
పూలవనం వద్దకు
కానీ, ఏం తెలుసు పాపం ఫిరోజ్ కు
నీ శరీరంలో, తనని నరికివేసే
వధశాలలు
ఉంటాయనీ
వెన్నెల వలలతో, అలలతో
బాహువుల లతలతో పూచే
చక్కని నీ ప్రియ వదనంలో
తనని దహించివేసే
ఆ సర్పాగ్నికీలలు
దాగి ఉంటాయనీ?
చూడు ఫరీదా, ఇక
ఇంతకంటే ఎక్కువ
చెప్పడం నిషిద్ధం-
ఎందుకంటే
అశ్రువులు నిప్పులై
ఓ మనిషిని నిండుగా
తగలబెట్టగలవని
ఫిరోజ్ కి తెలిసింది
ఇప్పుడే.
దాహం తీర్చే చెలమవనీ వచ్చానీ
పూలవనం వద్దకు
కానీ, ఏం తెలుసు పాపం ఫిరోజ్ కు
నీ శరీరంలో, తనని నరికివేసే
వధశాలలు
ఉంటాయనీ
వెన్నెల వలలతో, అలలతో
బాహువుల లతలతో పూచే
చక్కని నీ ప్రియ వదనంలో
తనని దహించివేసే
ఆ సర్పాగ్నికీలలు
దాగి ఉంటాయనీ?
చూడు ఫరీదా, ఇక
ఇంతకంటే ఎక్కువ
చెప్పడం నిషిద్ధం-
ఎందుకంటే
అశ్రువులు నిప్పులై
ఓ మనిషిని నిండుగా
తగలబెట్టగలవని
ఫిరోజ్ కి తెలిసింది
ఇప్పుడే.
No comments:
Post a Comment