ఒక
దూరం ఇంకొక దూరం
ఒక అశ్రువు నుంచి ఇంకొక అశ్రువు దాకా
మరొక అశ్రువు ఎంత దూరం?
అశ్రువు నుంచి అశ్రువు దాకా
నువ్వు ఎంత దూరం?
నా అశ్రువులో ఉండే నీకు నేను ఎంత దూరం?
దూరం దూరం. నిలకడ లేని
నువ్వు ఒక మహా మాయా తీరం. లోతులేని
ప్రతిబింబించలేని
ఒక ద్రవ దర్పణం.
చూడిక. నీ నిశ్శబ్దం దూరమయ్యి
నన్ను ఎలా మూగవాడిని చేసిందో:
తాకకు ఇక నన్ను
దూరం నుంచి
దూరం దాకా-!
దూరం ఇంకొక దూరం
ఒక అశ్రువు నుంచి ఇంకొక అశ్రువు దాకా
మరొక అశ్రువు ఎంత దూరం?
అశ్రువు నుంచి అశ్రువు దాకా
నువ్వు ఎంత దూరం?
నా అశ్రువులో ఉండే నీకు నేను ఎంత దూరం?
దూరం దూరం. నిలకడ లేని
నువ్వు ఒక మహా మాయా తీరం. లోతులేని
ప్రతిబింబించలేని
ఒక ద్రవ దర్పణం.
చూడిక. నీ నిశ్శబ్దం దూరమయ్యి
నన్ను ఎలా మూగవాడిని చేసిందో:
తాకకు ఇక నన్ను
దూరం నుంచి
దూరం దాకా-!
No comments:
Post a Comment