కూర్చుంటావు నీలో నువ్వు నిశ్శబ్దంగా
అలలు లేని సరస్సులో- నీలో నువ్వే- నింపాదిగా విచ్చుకునే
సూర్యరశ్మిలాంటి ఒక పొద్దుతిరుగుడు పూవుని చూస్తూ: అవే
పసుపు రాసుకుని తిరిగే
పచ్చి వాన వాసన వేసే తన చేతులలాంటి పూలరేకులను.
చూడు: సరిగ్గా అప్పుడే, నిశ్శబ్ధదీపం వెలిగించుకుని ఉన్న
ఆ కాంతి కాలాలలోనే, సరిగ్గా
అప్పుడే ఎవరో నీ పరిసరాల్లో గాలై రెపరెపలాడతారు. ఇక
గాలికి దీపం, కాంతికి గాలీ గాలికి శరీరం తోడయ్యిన
మసక సాయంత్రాన చల్లటి చీకటిగా మారెదెవరో నేను నీకు
వేరేగా చెప్పాలా?

No comments:
Post a Comment