చల్లటి పల్చటి పరదా దాల్చిన
ఈ తడిచిన ఉదయాన్ని, ఇక
దగ్గరగా తీసుకుని మేలి ముసుగు తొలగించి చూద్దును కదా
పూవు కింద విచ్చుకున్న
రెండు రెమ్మలపై రాలిన
రెండు చినుకుల వలె నీ ముఖం నిండా విషాదం, ఇన్ని కన్నీళ్లు.
తనని దీనంగా కౌగలించుకున్న
ఆ మొండిచేతుల కరకు శిలను
ఓదార్పుగా నిమురుతూ తను
ఏమీ మాట్లాడలేదు, కానీ నేనే
అన్నాను ఇలా:
"ఎక్కడ దాచుకున్నావు యింత
కాలం ఇంత హాలాహలం
నాకు మాత్రం ఇన్నేళ్ళూ
నీ అమృత దేహాన్ని యిస్తో?"
ఈ తడిచిన ఉదయాన్ని, ఇక
దగ్గరగా తీసుకుని మేలి ముసుగు తొలగించి చూద్దును కదా
పూవు కింద విచ్చుకున్న
రెండు రెమ్మలపై రాలిన
రెండు చినుకుల వలె నీ ముఖం నిండా విషాదం, ఇన్ని కన్నీళ్లు.
తనని దీనంగా కౌగలించుకున్న
ఆ మొండిచేతుల కరకు శిలను
ఓదార్పుగా నిమురుతూ తను
ఏమీ మాట్లాడలేదు, కానీ నేనే
అన్నాను ఇలా:
"ఎక్కడ దాచుకున్నావు యింత
కాలం ఇంత హాలాహలం
నాకు మాత్రం ఇన్నేళ్ళూ
నీ అమృత దేహాన్ని యిస్తో?"
No comments:
Post a Comment