03 September 2012

రక్త పిపాసి

చుక్కల పూలు నిండుగా పూచి
తడచిన భూమి నిండుగా వొణికి
పచ్చి బురద వాసన వేసే వేళల్లో

చీకటి ఇళ్ళల్లో మెత్తటి పొరల్లో  
నీ శరీరమంతటి రాత్రిలో
నా శరీరమంతటి పాత్రతో

ఇచ్చాను నేను నీకు సంపూర్ణంగా

నా గుండెను నిండుగా చీల్చుకుని
నీ కంటి నిండుగా నా కన్నీళ్ళూ
నీ ఒంటి నిండుగా నా నెత్తురూ-

రా. రా. రా. త్వరగా.
తాగు ఇక ఒక అమర ప్రేమతో
చివరి చినుకు వరకూ నా
చర్మాన్నీ ఎముకలనీ రక్తాన్నీ

నీ మృత్యుంజయ మహా
మొహంతో తమకంతో మన
శరీరాలంతంటి మహాదీపపు
పునరపి కాంతితో కరుణతో-    

6 comments:

  1. Srikanth,
    I accept that U r a an intellect.
    But there are so many millions of people
    who are striving to understand and
    take the poetic words into them,

    But U are missing all of them,
    U are writing for Urself.
    Sri Sri books chadivinataruvatha kuda ila
    intha aspashtangaa kavitvam raasthe adi
    kavitvam anipinchukodu, intellect anipinchukodu,
    moorkha prelaapana, anthe ( Sorry )

    Srikanth , inka daggiraa raayi !
    U gonna become a great Poet!
    that is and your fans HOPE...

    Do not leave,
    and Do not go farther . . .

    ReplyDelete
  2. @,. Sorry. I don't write for public. I write for myself. As for your opinion, you're entitled to it. I have never said that the texts in the blog are poetry. If somebody thinks this is poetry, then I'm not entitled to it. As you rightly said the texts in this blog are uncontrollable words or 'feverish gibberish' of a fool. I promise that I will be continuing this 'moorkha prelaapana' with all my heart till the end of my time. Hence I neither have energy nor a mission to 'educate' reader on the 'art of reading'.
    Thank you

    ReplyDelete
  3. దొంగమొకాలు అన్నింటాపరుచుకునే వేళల
    కవి కాకుండా కవిత్వం కాకుండా
    ఉండడమే భేష్

    కానీయ్ శ్రీకాంత్

    ReplyDelete
  4. మన
    శరీరాలంతంటి మహాదీపపు
    పునరపి కాంతితో కరుణతో

    ReplyDelete
  5. nagaraju avvari@ఏకముఖ వాచకాలైన తెలుగు కవిత్వంలో బహుముఖ వాచకాల పరిస్థితి కొద్దిగా కష్టమే. ఏం చేద్దాం? మూర్ఖంగా మన మానాన మనం రాసుకుంటూ పోవడం తప్ప!(అభిమానం కొంత అధికారంగా మారిన సందార్భాలు అనుకుంటాను, పైన విరామ చిహ్నపు వ్యాఖ్య) :-) LOL

    ReplyDelete