నీ ఛాయలో నేను.
కావిడి కుండలైన కళ్ళతో
నీ చెట్టు కింద ఆగి, ఒరిగి
రాత్రి పక్షుల రహస్య నాదం వింటూ
చెమ్మగిల్లిన హృదయంతో
నిదురోయింది నేనే.
మళ్ళా వచ్చాను
యిన్నాళ్ళకు నీ
పరిమళం వద్దకు
నెత్తురోడే నాలికతో.
కొద్దిగా
నీ నీటి నీడలతో
ఈనా పెదాలను
తడిపి వెళ్ళు.
తడిపి వెళ్ళు.
No comments:
Post a Comment