పలకలుగా పలకలుగా
మంచు రాలిన నేలపై పూసే పూల రేణువులలో నువ్వు.
నీలో నువ్వు ఎంతకూ చేరుకోలేని వెదురు వనాల ప్రార్ధనాలయం.
ధూప గీతాలు సర్పహాసాలై
విశ్వపు అంచులను తాకే మహా రెక్కలని విప్పుతాయి
చీకటి వ్యధశాలలలోకి ఎర్రని కనులతో సాగుతూ నీకై నీకే
ఒక ఖగోళ సమాధి. కన్నీళ్ల చూపు లేని శ్వాస. చూడు
తెగుతుంది ఇక నీ నిదుర అద్ధం మధ్యగా పుష్పిస్తూ. ఏమంటావు
దానిని నువ్వు? దానినే, నువ్వు 'నువ్వు' అని పిలిచే ప్రతి
ప్రతిబింబపు కలనే? నలుగు పెట్టి రాయలేని
ఆ నాలుగు మహా వాక్యాల అంతిమ దారినే.
ఇక ఆ తరువాత
తన గర్భంలోంచి ఒక దేవతా శిల్పం
నూనుగు రెక్కలతో నిన్ను కౌగలించుకుని
నిను ఖననం కావించి నిను బ్రతికిస్తుంది. అందుకే ఉండు
ఉంటూ ఇక్కడే. ఇక్కడే. నా- నీ
ఈ వాచకాంతపు శిఖర
వలయ అంచుల పైనే!

No comments:
Post a Comment