పాపం శమించు గాక.
ఎందుకు రాసితినో నాలుగు వాక్యములు నీ గురించి మరి ఎందులకు ప్రచురించితినో
నాలుగు కాని ఆ వాక్యములను నాలుగు దిక్కులా నువ్వు చూడని ఆ నలుగురు నాలుగింతల వ్యాఖ్యనాలై
నను పరి పరి విధముల వేధించుటకు, అయినను వెళ్లి రావలయును రౌరవ
నరకములకు ఈ అర్థముల అంగడి యందున్న ఏకార్ద ఏక ముఖ పత్నీ వ్రతులను పిలిచినందుకు,
ఏక సత్య మహా పతివ్రతులను ధిక్కరించినందులకూ - పాపం
శమించు గాక. మరి ఎపుడైనా చేసేదనా ఇటువంటి నేరము బొందిలో ప్రాణము యుండగా మరి ఎపుడైనా
రాసెదనా నీ మేనును నిష్కర్షగా? యుండెదను నాలో నేను-ఇక- చిక్కగా నిను మైమరపు మోహపు
పూలతో వెన్నెలతో
సీతాకోక చిలుకలతో
నదులతో కలలలతో
ధరిత్రితో ఆకాశాలతో
తారకలతో తీరాలతో వానతో సరస్సులతో అంతిమ సత్యములతో పోలుస్తో
నిన్ను వాటితోనే ప్రతిష్టించి సమాధి చేస్తో - విన్నావా ఎన్నడైనా నువ్వు
నీ వేలితో నీ కన్నే పొడుచుకునేటట్టు చేయుట అను మహా సూత్రమును?
No comments:
Post a Comment