ఎవరో తమ రెండు మునివేళ్ళతో
నీ ముఖంపై వాలిన గాలి తెరను
అలవోకగా అలా పుచ్చుకుని నీ
శ్వాసను తమతో
వడలిన సంధ్యాకాంతిలోంచి
చెమ్మగిల్లుతున్న చీకట్లలోకి
తేలికగా తీసుకువెడుతుంటే
ఇక
నువ్వేం చేయగలవ్ వణికే
అరచేతులతో వేడుకోవడం
తప్ప?
నీ ముఖంపై వాలిన గాలి తెరను
అలవోకగా అలా పుచ్చుకుని నీ
శ్వాసను తమతో
వడలిన సంధ్యాకాంతిలోంచి
చెమ్మగిల్లుతున్న చీకట్లలోకి
తేలికగా తీసుకువెడుతుంటే
ఇక
నువ్వేం చేయగలవ్ వణికే
అరచేతులతో వేడుకోవడం
తప్ప?
No comments:
Post a Comment