ఇంకా దాగలేనప్పుడే
ఇంకా ఆగలేనప్పుడే
వచ్చేది తొలుచుకుని
పూవైనా రాయైనా సూర్యుడైనా చంద్రుడైనా నువ్వైనా:
నెత్తురైనా కానీ నిప్పైనా కానీ
మొండి గోడల మీదా కానీ
నిండు గుండెల మీదా కానీ
మిగలకుండా రాయాలి నీ అంతిమ వాక్యాన్నీ
లోకపు నల్లటి నుదిటి పలకపై
నీ తెల్లటి బలపంతో -ఎర్రని
మహాఆగ్రహంతో- ఎందుకంటే
ఇంకా దాగలేనప్పుడే
ఇంకా ఆగలేనప్పుడే, నువ్వు
ఇంకా ఒపలేనప్పుడే, వాళ్ళు
ఇంకా నిను ఆపాలని
ప్రయత్నించినప్పుడే
నీ నాభి నుంచి, నీ కళ్ళ నుంచి
నలుదిశలూ పిక్కుటిల్లేలా
పిగుల్చుకుని వచ్చేది ఆ
తలలు బాదుకుని రోదించి
గుండెలు చరుచుకుని అరిచే
సర్వాన్నీ సవాలు చేసే ఓ
అనాది అంతిమ పొలికేక.
విన్నావా నువ్వు
అరిచావా నువ్వు
దహించుకుపోయే
అటువంటి ఆఖరి
యుద్ధ ప్రకటనను
ఇంతకు ముందు
ఎన్నడైనా
ఎక్కడైనా?
ఇంకా ఆగలేనప్పుడే
వచ్చేది తొలుచుకుని
పూవైనా రాయైనా సూర్యుడైనా చంద్రుడైనా నువ్వైనా:
నెత్తురైనా కానీ నిప్పైనా కానీ
మొండి గోడల మీదా కానీ
నిండు గుండెల మీదా కానీ
మిగలకుండా రాయాలి నీ అంతిమ వాక్యాన్నీ
లోకపు నల్లటి నుదిటి పలకపై
నీ తెల్లటి బలపంతో -ఎర్రని
మహాఆగ్రహంతో- ఎందుకంటే
ఇంకా దాగలేనప్పుడే
ఇంకా ఆగలేనప్పుడే, నువ్వు
ఇంకా ఒపలేనప్పుడే, వాళ్ళు
ఇంకా నిను ఆపాలని
ప్రయత్నించినప్పుడే
నీ నాభి నుంచి, నీ కళ్ళ నుంచి
నలుదిశలూ పిక్కుటిల్లేలా
పిగుల్చుకుని వచ్చేది ఆ
తలలు బాదుకుని రోదించి
గుండెలు చరుచుకుని అరిచే
సర్వాన్నీ సవాలు చేసే ఓ
అనాది అంతిమ పొలికేక.
విన్నావా నువ్వు
అరిచావా నువ్వు
దహించుకుపోయే
అటువంటి ఆఖరి
యుద్ధ ప్రకటనను
ఇంతకు ముందు
ఎన్నడైనా
ఎక్కడైనా?
No comments:
Post a Comment