నువ్వు ఎదురొస్తావనే ఇంటికి రావడం
తళతళ లాడే ముఖంతో మిలమిల మెరిసే కనులతో
చేతులు చాచి హత్తుకుంటావనే తిరిగి రావడం
ధూళి నిండిన దారులను వొదిలి, మాలిన్యం అంటిన
మనుషులను వొదిలి అదిగో ఆ యంత్రం నోటితో
లోహనాలిక పలికే పదాలనూ అర్థాలనూ వొదిలి
వదన వాచకాలని వొదిలి, కవిత్వ వ్యసనాలని వొదిలి
ఆకాశమంత పెరిగిన అహాన్ని వొదిలి
ఇనుప చేతులతో పెదాలతో అల్లుకునే స్త్రీలను వొదిలి
రూపాన్ని వొదిలి, రూపాయిని వొదిలి
జనంలేని అంతర్జాలాన్ని వొదిలి, మింగివేసే అనుసంధాల్ని వొదిలి
అంతిమంగా నువ్వు ఉన్నావనే నువ్వలా ఎదురు చూస్తుంటావనే
నువ్వు ఉంటావనే, నువ్వు హంస పాదాలతో ఎగురుతుంటావనే
ఈ ఇంటికి రావడం, ఈ చదరపు గదుల దరి చేరడం
నువ్వున్నావనే, నువ్వు ఉంటావనే ఇంకా ఇలా బ్రతికి ఉండటం:
ఒక్కసారి దగ్గరికి తీసుకుని, ఎప్పటిలా కౌగలించుకుని
గాట్టిగా ఒక ముద్దు పెట్టుకోవా, శరీరం బద్దలయ్యేటట్టు?
శరీరం బద్దలయ్యేటట్టు ఎవ్వరైనా నన్ను ముద్దు పెట్తుకుంటారా??
ReplyDeleteఎదురుచూపుకు మరో జన్మ కావాలేమో నాకు ??