11 February 2012

నీకు

రాత్రి నీటిలోకి చాచిన నా చేతిని
నీ ముఖం ఒక తెల్లటి చేపపిల్లై మెత్తగా తాకింది

యిక గదంతా తెరలు తెరలుగా
నీ పెదాల పరిమళం, వీచే మాటల నీలి గాలి
ఛాతిపై ఒక వెచ్చటి కుంపటి-

బ్రతకవచ్చు కదా ఎలాగోలాగా
అన్న ఒక చిన్న ఆశ
నీ చేయి ఉంది కదా అన్న చిన్ని ధైర్యం

అలసిన నా ముఖాన్ని
నీ భుజంపై వాల్చుకోవచ్చు కదా
అన్న చిన్ని నమ్మకం
ప్రార్ధన వలె నిన్ను స్మరించుకోవచ్చు కదా
అన్న ఒక మహా విశ్వాసం-

యిక ఆ రాత్రి నా ఎదురుగా
దీపంలా నిన్ను ఉంచుకుని
నేను ఎలా నిదురించగలను ?

3 comments:

  1. యిక ఆ రాత్రి నా ఎదురుగా
    దీపంలా నిన్ను ఉంచుకుని
    నేను ఎలా నిదురించగలను ?

    అలా నిదురించకుండా వుండాలంటే
    ఎంత కాంక్ష కావాలో కదా
    అభినమందనలు

    ReplyDelete
  2. sree entha theevra vedana nee matallo .....spell bound ....love j

    ReplyDelete