04 February 2012

ఇక

నిద్రలోంచి నీ కన్ను
మెత్తగా నీడంత దయగా మొలకెత్తుతోంది

గదిలో పచ్చటి కాంతి
తడచిన ఆకుల పచ్చి వాసన

ఎవరో తడిచి వచ్చి, అద్దంలో చూసుకుంటూ
జుత్తు దులుపుకుంటున్న వాసన

ఒద్దికగా ఒత్తిగిల్లే ఒళ్ళు. చినుకులు చిట్లే
నువ్వు వొళ్ళు విరుచుకునే చప్పుళ్ళు -

చూడు నీ చూపులోంచి
నా భవిష్యత్తు ఎలా మెత్తగా నీఅంత దయగా
నీ అరచేతుల నీడలో మొలకెత్తుతోందో:

ఇక నిన్ను ముద్దు పెట్టుకుని, బ్రతికేందుకూ
ఈ రాక్షస పగటిలోకి నేను సాగిపోయేందుకూ
యిదే సరైన సమయం-

ఇక అందివ్వు నీ చేతిని, ఇంతకు మించి
ఇంతకు మినహా నిన్నేమీ అడగను!

3 comments:

  1. జుట్టు దులుపుకుంట్టున్న వాసన

    బాగుంది

    ReplyDelete
  2. Striking images. Fragrance...i can smell. I like it uncle...thanQ

    ReplyDelete
  3. "చూడు నీ చూపులోంచి
    నా భవిష్యత్తు ఎలా మెత్తగా నీఅంత దయగా
    నీ అరచేతుల నీడలో మొలకెత్తుతోందో:"

    అనుభూతి, భావం కలగలుపుగా...బావుందండి.

    ReplyDelete