ఆకులని కదిపి
కొమ్మలలోకి జారుకుంది ఒక పిట్ట
వొంటరిగా ఎండ
వొంటరిగా తను. యిక ఏడవలేక జోలెలో స్పృహ తప్పిన శిశువు
దప్పికగొని అరచేయంత నీళ్ళకై లోహ రహదారులలో నేను
ఆకలిగొని అదే దారులలో అరచేయంత అన్నం ముద్దకై తను
ఇది అంగవస్త్రం లేని ఒక మాతృదేశం. రూకల కపాలాలని గుట్టలుగా దాచుకునే నూత్న మానవుల ప్రదేశం
ఇది దేహం లేని ఒక తండ్రి శకం. అనవతమైన జెండా కింద
ఒక మృత కళేబరం ఒక మృత స్వప్నం. ఇది రాజకీయ కంకాళాల ప్రపంచ కుగ్రామం, ఒక తీరని రక్త దాహం- యిక
సాయంత్రానికి ఆ ఇద్దరిలో
ఇంటికెవరు చేరుకున్నారో
అసలు ఇల్లు అంటూ ఒకటి ఉందో లేదో ఇద్దరికీ తెలియలేదు
బాహువుల్లో శాపమై విచ్చుకున్న రాత్రికీ
మృత్యు పుష్పాలై రాలిన అనేక అనాధ పిల్లలకీ తెలియరాలేదు-
మీ కవిత హృదయాన్ని కదిలించింది.
ReplyDeleteఅన్నపూర్ణ నాదేశం ఒకప్పుడు
అసంపూర్ణం ఎటుచూసినా ఇప్పుడు...