03 February 2012

స్నేహితుడు

నువ్వు లేకుండా ఉండలేను

రాతి దారిలో దొరికిన పువ్వువి నీవు
రాత్రి సరస్సులో మెదిలే
చిరుగాలి జాబిలివి నీవు

కనులని పసివేళ్ళతో నిమిరిన
చల్లటి వానవి నీవు
మెత్తటి నీడవి నీవు

రంగుల తోటలో రెపరెపలాడే
తెల్లటి సీతాకోకచిలుకవి నీవు

నా వెనుక ఉండి, నన్ను దాచుకుని
నన్ను పొడిచే బాకులని
వెన్నులోకి తీసుకునే నా
స్నేహ ప్రేమికుడివి నీవు
నా ప్రియమిత్రుడవి నీవు

ఇదిగో యిప్పుడు చెబుతాను: ఇదిగో
ఇప్పుడే చెబుతున్నాను

నువ్వు లేకుండా ఉండలేను
నువ్వు వున్నా ఉండలేను!

4 comments:

  1. శ్రీకాంత్, పద్యాన్ని చేతిలోనికి తీసుకుని ముద్దు పెట్టుకోవాలనిపించింది. ఆ చివరి చరణం నాకు తెలీలేదు. అంతవరకు ఇష్టంగా తిరిగిన పూల తోట ఎవరికో సొంతమని, నేను ట్రెస్పాసర్‍నని అనిపించింది. అది లేకుంటేనేం, పద్యానికి?

    ReplyDelete
  2. @abonymous, anil and HRK: thanks for reading. :-)

    ReplyDelete