ఈ రాత్రిలో పచ్చగా మెరుస్తాయి
పసుపు రాసుకున్న నీ చేతులు-
ఒక లేత సాయంత్రపు ఎండ
తప్పించుకుని వచ్చి చల్లగా
నీ చేతులను చుట్టుకున్నట్టు యిక గదంతా నీ గాజుల జల్లు-
ఆనక
మనల్ని కలిపే రాత్రిలోనే
ఆ వానలోనే, నీ శరీరపు
కమ్మటి పసుపు వాసన నా మాలిన్యాలను శుభ్రం చేస్తుంది
యిక చూస్తుండు అలా
రేపటి నీ ఉదయానికల్లా
అతను ఒక పొద్దుతిరుగుడు పూవై నీలా ఎంత పచ్చగా వికసిస్తాడో!
too good
ReplyDeleteఎండ, పొద్దుతిరుగుడు పూల ప్రతీకలు వాడిన తీరు సిమ్ప్లీ సూపర్బ్.
ReplyDelete