26 July 2012

మౌనం

ఇద్దరి మధ్యా ఎదురెదురుగా ఒక మహా నగర సరస్సు. ఎదురెదురుగా ఆ ఇద్దరి మధ్యా కనుచూపు మేరా పరుచుకున్న ఒక దూరం. ఒక మౌనం. యిక ఈ పూటకి

చినుకులలో ఒదిగిసంధ్యకాంతి అలలని తాకి వెళ్ళిపోతుంది. సందిగ్ధ నిలయ విలాప సాయంత్రానికి కొంత చీకటిని మిగిల్చీ, నీళ్ళకీ ఆకులకీ కొంత తన తడి నయనాల కాటుకనూ అంటించీ కాంతీ కనుమరుగయ్యి జారిపోతుంది- '-రాబోయే రాత్రిని ఎవరు వెలిగిస్తారో తెలియదు కానీ ముందు మనం ఇంటికి వెళ్ళాలి. పద - మనం మన కోసం కాకపోయినా పిల్లలకి యింత అన్నం వండాలి-' అని తనే అంటుంది కానీ

కన్నీళ్ళతో పాలిపోయిన నీలి ఆకాశం వాళ్ళతో ఎక్కడికీ వెళ్ళలేక యిక ఒంటరిగా నాతోనే సరస్సు చివరన ఆగిపోయింది. యిక యిక్కడ నేనేం చేయాలి?

No comments:

Post a Comment