15 July 2012

అసూయ

నిదురోతున్న ఆ అమ్మాయి ముఖంపై
ఎగురుతోంది ఒక ఆకుపచ్చని
సీతాకోకచిలుక-ఒక చల్లచల్లని
గాలి తాకిన నీరెండ నీడ. యిక నేను

తన చెంపపై రాలిన ఆ గడ్డిపరకను నెమ్మదిగా తొలగించి
పచ్చికపై సాయంత్రం వాలిన ఆ
వెన్నెలని చూస్తాను అబ్బురంగా
కొంత అసూయగా కొంత ప్రేమగా-

భగవంతుడా! తనలా అలా
ఒక కలలో చక్కగా చిన్నగా
నేను నిదురోగలిగితే ఎంత బావుండు!

1 comment:

  1. లిఖిత గారు
    ఒక సుందరమైన దృశ్యం కవితగా మలిచారు
    మనసుకు హాయి నిచ్చే భావాలు ఆరబోశారు
    అభినందనలు
    సాయంత్రం వాలిన ఆ వెన్నెల అన్నారు
    కవిసమయం అయితే అద్భుతమే ...

    ReplyDelete